ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), గ్లోబల్ ఫ్రంటియర్ ఏఐ సంస్థ 'ఆంత్రోపిక్' (Anthropic) కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. వివిధ పరిశ్రమలలో ఎంటర్‌ప్రైజ్ ఏఐ (Enterprise AI) వినియోగాన్ని వేగవంతం చేయడానికి ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా, క్లాడ్ ఏఐ మోడల్స్‌పై లోతైన నైపుణ్యాన్ని సాధించేందుకు టీసీఎస్ ఒక ప్రత్యేక బిజినెస్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది.

ఆర్థిక సేవలు, హెల్త్‌కేర్, ఏవియేషన్, టెలికాం వంటి కఠినమైన నిబంధనలు ఉండే రంగాలలో ఏఐ ప్రాజెక్టులు ప్రయోగాల దశలోనే నిలిచిపోతుంటాయి. అక్కడ ఖచ్చితత్వం, జవాబుదారీతనం చాలా ముఖ్యం. చిన్న పొరపాటు జరిగినా తీవ్ర నష్టాలు వస్తాయి. ఈ అడ్డంకులను అధిగమించేందుకే టీసీఎస్ తన పటిష్టమైన గవర్నెన్స్, మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను ఆంత్రోపిక్ సాంకేతికతతో జోడిస్తోంది. తద్వారా పెద్ద పెద్ద కంపెనీలు భయం లేకుండా క్లాడ్ ఏఐని తమ రోజువారీ వ్యాపార ప్రక్రియల్లో వాడుకునే వీలు కలుగుతుంది.
50 వేల మంది ఉద్యోగులకు క్లాడ్ ఏఐ శిక్షణ
ఈ భాగస్వామ్యంలో భాగంగా టీసీఎస్ తన ఇంజనీరింగ్, ఫైనాన్స్, లీగల్, మార్కెటింగ్, సేల్స్ విభాగాలకు చెందిన 50,000 మంది ఉద్యోగులకు క్లాడ్ ఏఐ లైసెన్సులను అందిస్తోంది. ఈ సాంకేతికతను అంతర్గతంగా ఉపయోగించడం ద్వారా వచ్చే అనుభవంతో, క్లయింట్లకు మరింత మెరుగైన సేవలు అందించడానికి టీసీఎస్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ లైఫ్ అండ్ పెన్షన్స్ బిజినెస్ సంస్థ 'డిలిజెంటా' (Diligenta) ప్రస్తుతం 2.2 కోట్ల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. టీసీఎస్‌కు చెందిన ఈ సంస్థ, క్లాడ్ ఏఐ సాయంతో తన కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ను సరికొత్తగా మార్చనుంది. దీనితో పాటు, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, ఐటీ ఆపరేషన్స్ ఉత్పాదకతను పెంచేందుకు బీఎఫ్ఎస్ఐ (BFSI) ప్రొడక్ట్స్ టీమ్స్ 'క్లాడ్ కోడ్' (Claude Code) సాంకేతికతను వాడుకోనున్నాయి.
టీసీఎస్ ఐఓఎన్ (TCS iON) ద్వారా ఏఐ సర్టిఫికేషన్
భారతదేశంలోని 1,500 నగరాల్లో ఏడాదికి 7.5 కోట్ల కంటే ఎక్కువ అసెస్మెంట్లు నిర్వహించే టీసీఎస్ ఐఓఎన్ (TCS iON) ప్లాట్‌ఫారమ్ ద్వారా క్లాడ్ మోడల్స్‌పై ప్రత్యేక శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులను అందించనున్నారు. ఇది దేశంలోని యువతకు సరికొత్త ఏఐ నైపుణ్యాలను అందిస్తూ, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
{{/usCountry}}భారతదేశంలోని 1,500 నగరాల్లో ఏడాదికి 7.5 కోట్ల కంటే ఎక్కువ అసెస్మెంట్లు నిర్వహించే టీసీఎస్ ఐఓఎన్ (TCS iON) ప్లాట్‌ఫారమ్ ద్వారా క్లాడ్ మోడల్స్‌పై ప్రత్యేక శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులను అందించనున్నారు. ఇది దేశంలోని యువతకు సరికొత్త ఏఐ నైపుణ్యాలను అందిస్తూ, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
{{/usCountry}}ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సెటిల్‌మెంట్, లెండింగ్ అడ్వైజరీ వంటి క్లిష్టమైన బ్యాంకింగ్ ప్రక్రియల కోసం టీసీఎస్ తన అనుభవాన్ని జోడించి సరికొత్త ప్లగిన్‌లను, స్కిల్స్‌ను క్లాడ్ కోడ్ ఎకోసిస్టమ్‌లోకి తీసుకురానుంది.
అగ్రనేతలు ఏమన్నారంటే..
"వ్యాపార రంగంలో ఏఐ విజయవంతం కావాలంటే బిజినెస్ నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం, సంక్లిష్ట వ్యవస్థలను నడపడం చాలా అవసరం. నమ్మకం, నిబంధనలు అత్యంత కీలకమైన పరిశ్రమలలో మా పరిశ్రమ అనుభవాన్ని, క్లాడ్ ఏఐ సాంకేతికతను జోడించి కస్టమర్లు తమ ప్రొడక్షన్‌ను వేగవంతం చేసేలా సహాయపడతాం" అని టీసీఎస్ సీఈఓ, ఎండీ కే కృతివాసన్ తెలిపారు.
"మేం క్లాడ్‌ను సురక్షితమైన, నమ్మకమైన సాంకేతికతగా రూపొందించాం. మాకు భారతదేశం రెండవ అతిపెద్ద మార్కెట్. ఈ భాగస్వామ్యం ద్వారా టీసీఎస్ తన 50,000 మంది ఉద్యోగులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంటర్‌ప్రైజెక్స్‌కు క్లాడ్ సేవలను చేరువ చేస్తుంది" అని ఆంత్రోపిక్ కో-ఫౌండర్, సీఈఓ డారియో అమోడెయ్ పేర్కొన్నారు.
"ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల పునర్నిర్మాణానికి పునాది కానుంది. టాటా గ్రూప్ నమ్మకమైన బంధాలు, ఆంత్రోపిక్ సామర్థ్యాలు కలిసి దేశంలోని యువతకు ఏఐ యుగంలో లీడర్లుగా ఎదిగేందుకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తాయి" అని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్పష్టం చేశారు.