ఐటీ దిగ్గజాల్లో ఒకటిగా పేరొందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇప్పుడు ఒక అనూహ్యమైన వివాదంలో చిక్కుకుంది. నాసిక్‌లోని టీసీఎస్ బీపీఓ (BPO) యూనిట్‌లో పనిచేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మతపరమైన వేధింపులు, బలవంతపు మతమార్పిడులు వంటి తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఘటన కేవలం ఒక కార్పొరేట్ క్రమశిక్షణ ఉల్లంఘనగా కాకుండా, సామాజిక, రాజకీయ కోణాల్లో చర్చలకు దారితీస్తోంది.
ప్రేమ వ్యవహారంతో మొదలైన రగడ
ఈ వివాదానికి బీజం మార్చి 26న పడింది. బీపీఓలో పనిచేసే 23 ఏళ్ల ఒక హిందూ యువతి కుటుంబ సభ్యులు దేవ్‌లాలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె రంజాన్ ఉపవాసాలు చేస్తూ, హిజాబ్ ధరిస్తోందని, దీని వెనుక అదే ఆఫీసులో పనిచేసే దానిష్ షేక్ (31) ఉన్నాడని వారు ఆరోపించారు. దానిష్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని సదరు యువతి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు దానిష్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు.
రంగంలోకి సిట్.. అండర్ కవర్ ఆపరేషన్
నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్ ఈ కేసు తీవ్రతను గుర్తించి, ఏసీపీ సందీప్ మిట్కే నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆఫీసులో అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆరుగురు మహిళా పోలీసులు 'హౌస్ కీపింగ్' సిబ్బంది వేషంలో లోపలికి వెళ్లారని పోలీసులు చెబుతున్నారు.
అయితే, టీసీఎస్ వంటి హై-సెక్యూరిటీ జోన్లలో బయోమెట్రిక్ యాక్సెస్ కార్డు లేకుండా లోపలికి వెళ్లడం అసాధ్యమని, పోలీసుల వాదనలో లాజిక్ లేదని కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కంపెనీ స్పందిస్తూ, విచారణ జరుగుతున్నందున వివరాలు వెల్లడించలేమని పేర్కొంది.
వేధింపులా? మతపరమైన ఒత్తిళ్లా?
మరోవైపు, ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సీనియర్ అధికారులు అశ్విని చైనాని సహా ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఒక సీనియర్ అనలిస్ట్ ఫిర్యాదు ప్రకారం.. తన టీమ్ లీడర్ తౌసిఫ్ అత్తార్ తనను బలవంతంగా టోపీ ధరింపజేశాడని, కల్మా చదవాలని ఒత్తిడి చేశాడని ఆరోపించారు. అయితే, దీనికి సంబంధించిన ఒక వీడియోలో వీరిద్దరూ ఆత్మీయంగా ఫోటోలకు పోజులివ్వడం ఇప్పుడు కేసును మలుపు తిప్పుతోంది.
{{/usCountry}}మరోవైపు, ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సీనియర్ అధికారులు అశ్విని చైనాని సహా ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఒక సీనియర్ అనలిస్ట్ ఫిర్యాదు ప్రకారం.. తన టీమ్ లీడర్ తౌసిఫ్ అత్తార్ తనను బలవంతంగా టోపీ ధరింపజేశాడని, కల్మా చదవాలని ఒత్తిడి చేశాడని ఆరోపించారు. అయితే, దీనికి సంబంధించిన ఒక వీడియోలో వీరిద్దరూ ఆత్మీయంగా ఫోటోలకు పోజులివ్వడం ఇప్పుడు కేసును మలుపు తిప్పుతోంది.
{{/usCountry}}లైంగిక వేధింపుల విషయంలోనూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చీరలు కట్టుకుని ఆఫీసుకు వచ్చినప్పుడు వెక్కిరించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటివి చేశారని మహిళా ఉద్యోగులు ఆరోపించారు. "మేము సీనియర్లకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు, అందుకే మౌనంగా ఉండాల్సి వచ్చింది" అని ఒక బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
టీసీఎస్ సీఈఓ స్పందన
ఈ పరిణామాలపై టీసీఎస్ సీఈఓ కృతివాసన్ స్పష్టతనిచ్చారు.
"ఉద్యోగుల సంక్షేమం, గౌరవానికి టీసీఎస్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. వేధింపుల విషయంలో మాకు 'జీరో టాలరెన్స్' పాలసీ ఉంది. పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా, డెలాయిట్ (Deloitte), ట్రైలీగల్ (Trilegal) వంటి సంస్థలతో అంతర్గత విచారణను కూడా కంపెనీ ప్రారంభించింది. అయితే, 'పోష్' (POSH) నిబంధనల కింద ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదులు అందలేదని కంపెనీ స్పష్టం చేయడం గమనార్హం.
కార్పొరేట్ జిహాద్?
మహారాష్ట్రలో 'లవ్ జిహాద్' చట్టంపై చర్చ జరుగుతున్న తరుణంలో ఈ కేసు వెలుగులోకి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియాలో దీనిని 'కార్పొరేట్ జిహాద్' అంటూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా పలుకుబడి ఉన్నవారితో సంబంధాలు ఉన్న వ్యక్తుల పేర్లు కూడా ఈ కేసులో వినబడుతుండటంతో నాసిక్ పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. టీసీఎస్ నాసిక్ కేసులో ప్రధాన ఆరోపణలు ఏమిటి?
ప్రధానంగా అత్యాచారం, లైంగిక వేధింపులు, మత మార్పిడికి ప్రేరేపించడం వంటి ఆరోపణలపై ఎనిమిది మంది ఉద్యోగులపై కేసులు నమోదయ్యాయి.
2. అశ్విని చైనాని పాత్ర ఏమిటి?
అశ్విని చైనాని టీసీఎస్‌లో సీనియర్ అధికారిణి. బాధితులు తన వద్దకు వచ్చి వేధింపుల గురించి ఫిర్యాదు చేసినా, ఆమె వాటిని పట్టించుకోకుండా నిందితులకు కొమ్ముకాసారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
3. కంపెనీ (TCS) ఈ కేసుపై ఏమంటోంది?
తమ అంతర్గత విచారణలో ఎప్పుడూ వేధింపుల ఫిర్యాదులు రాలేదని, అయినప్పటికీ పోలీసు విచారణకు సహకరిస్తూ నిజానిజాలు బయటపెడతామని కంపెనీ తెలిపింది.
4. ఈ కేసులో 'మతపరమైన ఒత్తిడి' అంటే ఏమిటి?
ముస్లిం మత ఆచారాలను పాటించాలని, శాకాహారులను మాంసాహారం తినమని బలవంతం చేశారని, హిందూ దేవుళ్లపై అసభ్య వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.