ఆస్ట్రేలియాలో ఇండియా వన్డే సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత టీ20 సిరీస్ కిక్ స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్ టీ20 వర్షంతో రద్దయింది. ఇక మెల్ బోర్న్ లో ఇవాళ (అక్టోబర్ 31) జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటింగ్ మెరుపులు చూద్దామనుకున్న ఫ్యాన్స్ కు తీవ్రమైన నిరాశ తప్పలేదు. సెకండ్ టీ20లో బ్యాటింగ్ లో ఇండియా కుప్పకూలింది. అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. 18.4 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది.
పేస్ దెబ్బకు

మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ టాస్ ఓడింది. ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఆసీస్ పేస్ దెబ్బకు ఇండియా బ్యాటర్లు పెవిలియన్ క్యూ కట్టారు. హేజిల్ వుడ్ 3, నేథన్ ఎలిస్ 2, జేవియర్ 2 వికెట్లతో టీమిండియాను దెబ్బ కొట్టారు.
శుభ్ మన్ గిల్ (5), శాంసన్ (2), సూర్యకుమార్ (1), తిలక్ వర్మ (0), అక్షర్ (7), శివమ్ దూబె (4), కుల్ దీప్ యాదవ్ (0), వరుణ్ చక్రవర్తి (0 నాటౌట్), బుమ్రా (0).. ఇలా వీళ్లందరూ కనీసం 10 పరుగులూ చేయలేకపోయారు.
అభిషేక్ పోరాటం
ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగిన మెల్ బోర్న్ లో ఇండియా 120కి పైగా స్కోరు చేసిందంటే అందుకు ప్రధాన కారణం అభిషేక్ శర్మ. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో ఎదురు దాడి కొనసాగించాడు అభిషేక్. అతను 37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 68 పరుగులు సాధించాడు. టీమ్ మొత్తం కలిపి చేసిన స్కోరులో అభిషేక్ చేసిన రన్స్ 50 శాతం కంటే ఎక్కువ.
హర్షిత్ తో కలిసి
ఓ ఎండ్ లో అభిషేక్ నిలబడ్డా మరో వైపు టపటపా వికెట్లు పడ్డాయి. 49 పరుగులకే భారత్ సగం వికెట్లు కోల్పోయింది. ఇండియా స్కోరు 100 కూడా చేరుతుందా లేదా అనిపించింది. ఆ టైమ్ లో పేస్ బౌలర్ హర్షిత్ రాణా (33 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్సర్) గొప్పగా పోరాడాడు. హర్షిత్ సపోర్ట్ తో అభిషేక్ తన స్టైల్లో షాట్లు ఆడాడు. టీమ్ స్కోరు 100 దాటిన తర్వాత హర్షిత్ ఔటయ్యాడు.
{{/usCountry}}ఓ ఎండ్ లో అభిషేక్ నిలబడ్డా మరో వైపు టపటపా వికెట్లు పడ్డాయి. 49 పరుగులకే భారత్ సగం వికెట్లు కోల్పోయింది. ఇండియా స్కోరు 100 కూడా చేరుతుందా లేదా అనిపించింది. ఆ టైమ్ లో పేస్ బౌలర్ హర్షిత్ రాణా (33 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్సర్) గొప్పగా పోరాడాడు. హర్షిత్ సపోర్ట్ తో అభిషేక్ తన స్టైల్లో షాట్లు ఆడాడు. టీమ్ స్కోరు 100 దాటిన తర్వాత హర్షిత్ ఔటయ్యాడు.
{{/usCountry}}హర్షిత్ వికెట్ తర్వాత టీమిండియా మరోసారి కుప్పకూలింది. మళ్లీ టపటపా వికెట్లు పడ్డాయి. వరుస బంతుల్లో అభిషేక్, బుమ్రా ఔట్ కావడంతో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది.