ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ ఆటోమొబైల్ దిగ్గజం 'టెస్లా' కీలక ప్రకటన చేసింది. గత తొమ్మిదేళ్లుగా ఈవీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెస్లా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నెక్ట్స్-జనరేషన్ రోడ్‌స్టర్’ని ఆవిష్కరించే డేట్‌ను కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ అధికారికంగా ఖరారు చేశారు. అక్టోబర్ 1వ తేదీన ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నట్టు వెల్లడించారు.
టెస్లా రోడ్‌స్టర్- 9 ఏళ్ల నిరీక్షణ.. మస్క్ మాస్టర్ ప్లాన్!

2017లో టెస్లా మొదటిసారిగా రోడ్‌స్టర్ కాన్సెప్ట్ మోడల్‌ను ప్రదర్శించింది. నిజానికి 2020 నాటికే దీని డెలివరీలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాలు, మార్కెట్ పరిస్థితుల వల్ల ప్రాజెక్ట్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.
ఇక ఇప్పుడు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా టెస్లా సంస్థ "లాంచ్‌కు సిద్ధం" అని పోస్ట్ చేయగా, ఎలాన్ మస్క్ స్పందిస్తూ "న్యూ టెస్లా రోడ్‌స్టర్ అన్వీల్ 10.01" అంటూ అక్టోబర్ 1 తేదీని ధృవీకరించారు.
స్పేస్ఎక్స్ రాకెట్ టెక్నాలజీతో సంచలనం!
సాధారణ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్లలా కాకుండా, ఈ కొత్త రోడ్‌స్టర్‌లో అంతరిక్ష పరిశోధన సంస్థ 'స్పేస్ఎక్స్' సాంకేతికతను ఉపయోగిస్తుండటం ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. టెక్సాస్‌లోని మెక్‌గ్రెగర్‌లోని స్పేస్ ఎక్స్ టెస్టింగ్ సెంటర్‌లో కోల్డ్-గ్యాస్ థ్రస్టర్లతో నడిచే ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ రోడ్‌స్టర్‌ను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాకెట్లలో వాడే ఈ థ్రస్టర్ల సాయంతో కారు వేగం ఊహకందని స్థాయిలో ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
స్పోర్ట్స్ కారు కాదు.. కార్బన్ ఫైబర్ 'హైపర్‌కార్'!
ప్రారంభంలో టెస్లా మోడల్ ఎస్ ప్లాయిడ్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రోడ్‌స్టర్‌ను డిజైన్ చేయాలని భావించినప్పటికీ, మస్క్ తన ప్రణాళికను పూర్తిగా మార్చేశారు. సాధారణ స్పోర్ట్స్ కార్ పరిమితులను దాటి, అత్యంత తేలికైన, బలమైన కార్బన్-ఫైబర్ బాడీతో సరికొత్త ‘హైపర్‌కార్’గా దీనిని రీ-డిజైన్ చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఫెరారీ, లంబోర్గిని వంటి దిగ్గజ బ్రాండ్ల స్పోర్ట్స్ కార్లకు ఈ టెస్లా రోడ్‌స్టర్ గట్టి పోటీ ఇవ్వనుంది.
ఆటోనామస్ రేసులో టెస్లా జోరు..
{{/usCountry}}అంతర్జాతీయ మార్కెట్లో ఫెరారీ, లంబోర్గిని వంటి దిగ్గజ బ్రాండ్ల స్పోర్ట్స్ కార్లకు ఈ టెస్లా రోడ్‌స్టర్ గట్టి పోటీ ఇవ్వనుంది.
ఆటోనామస్ రేసులో టెస్లా జోరు..
{{/usCountry}}ఒకవైపు పవర్ఫుల్ హైపర్‌కార్లను తీసుకొస్తూనే, మరోవైపు భవిష్యత్తు డ్రైవర్‌లెస్ రవాణా వ్యవస్థపై టెస్లా దృష్టి సారించింది. ఇటీవల టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరంలో స్టీరింగ్, పెడల్స్ లేని ‘సైబర్ క్యాబ్’ రోబోటాక్సీ సర్వీసును పరిమితంగా ప్రారంభించింది.
ఈ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో గ్లోబల్ ఈవీ మార్కెట్లో తన ఆధిపత్యం మరింత బలపడుతుందని ఎలాన్ మస్క్ భావిస్తున్నారు.