...
...
Next Story

అమెరికాలో దారుణం: టెక్సాస్‌లో భారత జాతీయ జెండాను చింపివేసిన ఆందోళనకారుడు

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో వలసదారులకు వ్యతిరేకంగా జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో ఘోర అవమానం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి భారత జాతీయ జెండాను (Indian National Flag) బూతులు తిడుతూ ముక్కలుగా చింపివేయగా, అక్కడ చేరిన జనం అతడిని ప్రోత్సహిస్తూ నినాదాలు చేశారు.

Updated on: Jun 3, 2026, 15:35:41 IST
Advertisement

అమెరికాలోని టెక్సాస్ (Texas) రాష్ట్రంలో భారతీయులను దిగ్భ్రాంతికి గురిచేసే ఒక సంఘటన వెలుగుచూసింది. డల్లాస్ శివారు ప్రాంతమైన ఫ్రిస్కో (Frisco) సిటీ హాల్ ముందు యాంటీ-ఇమ్మిగ్రేషన్ (వలస వ్యతిరేక) గ్రూపులు నిర్వహించిన ఒక నిరసన ప్రదర్శనలో, ఒక అమెరికన్ వ్యక్తి భారత జాతీయ జెండాను అత్యంత దారుణంగా అవమానించాడు.

అమెరికాలో జరిగిన సంఘటన ఇది.  టెక్సాస్‌లో భారత జాతీయ జెండాను చింపివేసిన ఆందోళనకారుడు
అమెరికాలో జరిగిన సంఘటన ఇది. టెక్సాస్‌లో భారత జాతీయ జెండాను చింపివేసిన ఆందోళనకారుడు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. సదరు వ్యక్తి నోట్లో సిగరెట్ పెట్టుకుని, భారతదేశాన్ని ఉద్దేశించి బూతులు తిడుతూ భారత త్రివర్ణ పతాకాన్ని చింపివేశాడు. నార్త్ డల్లాస్‌లో భారతీయ వలసదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందంటూ వారు ఈ నిరసన చేపట్టారు. ఆ వ్యక్తి జెండాను చింపుతున్న సమయంలో అక్కడున్న మిగతా నిరసనకారులు "యస్.. లెట్స్ గో" అంటూ అతడిని ప్రోత్సహిస్తూ కేకలు వేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఫ్రిస్కోలో ఎందుకీ వ్యతిరేకత?

డల్లాస్ పరిధిలోని ఫ్రిస్కో నగరం ఐటీ రంగానికి (Tech Industry) కేంద్రంగా మారి వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి కంపెనీలలో పనిచేసేందుకు హెచ్-1బీ (H-1B) వీసాల ద్వారా పెద్ద ఎత్తున భారతీయులు ఇక్కడికి వలస వచ్చారు. ప్రస్తుతం ఫ్రిస్కో జనాభాలో దాదాపు మూడో వంతు (One-third) ఆసియా వాసులు, ముఖ్యంగా భారతీయులే ఉన్నారు. అయితే, భారతీయుల సంఖ్య పెరగడం వల్ల స్థానికంగా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని, ఇళ్ల ధరలు, ట్రాఫిక్ పెరిగిపోతున్నాయని, సంస్కృతి మారిపోతోందని కొందరు స్థానిక అమెరికన్లు కొద్దిరోజులుగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోపమే ఇప్పుడు జెండాను అవమానించే స్థాయికి చేరింది.

నెటిజన్ల తీవ్ర ఆగ్రహం

ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు:

"భారతీయులు ఇక్కడికి దండయాత్రకు రాలేదు, కష్టపడి పని చేయడానికి వచ్చారు. అమెరికాలో అత్యధికంగా పన్నులు చెల్లించే (Highest Taxpayers) పౌరులలో భారతీయులు ముందు వరుసలో ఉన్నారు. ఇలాంటి జాత్యహంకార చేష్టలు నిజాలను మార్చలేవు" అని ఒకరు స్పందించారు.

మరికొందరు అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్రను గుర్తుచేస్తూ..

"ప్రస్తుతం అమెరికాలోని టాప్ టెక్ కంపెనీల సీఈఓలంతా భారతీయులే. అమెరికా వృద్ధికి భారతీయ ప్రతిభే ఇంధనం లాంటిది. ఇలా జెండాను చింపేసి, ఏడవడం మానేసి మీ నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టండి" అని హితవు పలికారు.

జాతీయ జెండాను అవమానించడం అంటే 140 కోట్ల మంది ప్రజలను, ఒక దేశ సార్వభౌమత్వాన్ని అవమానించడమేనని, ఇలాంటి విద్వేషపూరిత చర్యలను ఎంతమాత్రం సహించబోమని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe