అసిస్టెంట్ డైరక్టర్ నుంచి The Paradise వరకు- నాని నెట్ వర్త్, లగ్జరీ కార్లు, రెమ్యునరేషన్ వివరాలు..
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'ది పారడైజ్' చిత్రం థియేటర్లలో సందడి చేస్తున్న వేళ, నేచురల్ స్టార్ నాని నెట్ వర్త్, లగ్జరీ కార్లు, ఆస్తుల వివరాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన నాని సక్సెస్ జర్నీ కథనం ఇది..
తెలుగు చిత్రసీమలో స్వయంకృషితో ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. ప్రస్తుతం ఆయన నటించిన 'ది ప్యారడైజ్' చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు టాలీవుడ్‌తో పాటు అటు సోషల్ మీడియాలోనూ నాని పేరు మారుమోగిపోతోంది. ఈ క్రమంలోనే ఈ నేచురల్ స్టార్ ఆస్తుల విలువ, లగ్జరీ కార్లు, ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

ది ప్యారడైజ్ : నానీ నెట్ వర్త్ రూ. 200 కోట్లు.. రూ. 30 కోట్ల పారితోషికం!
ఫిలిం నగర్ వర్గాలు, వివిధ మీడియా నివేదికల ప్రకారం ది ప్యారడైజ్ హీరో నాని మొత్తం నెట్ వర్త్ రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఉంటుంది! ఒకప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన నాని, నేడు ఒక్కో సినిమాకు రూ. 25 కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకు పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు.
హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో నానికి విలువైన స్థిరాస్తులు సైతం ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ. 50 కోట్ల వరకు ఉంటుంది. హైదరాబాద్‌లోని ఆయన నివసించే విలాసవంతమైన భవనం విలువే సుమారు రూ. 40 కోట్లు ఉంటుందని సమాచారం. నగరానికి సమీపంలోని చేవెళ్ల వద్ద ప్రశాంతమైన వాతావరణంలో నానికి ఒక ఫామ్‌హౌస్ ఉంది. దీనికి 'హంబుల్' అని పేరు పెట్టగా, దీని విలువ రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ది ప్యారడైజ్ : నాని గ్యారేజ్‌లో విలాసవంతమైన లగ్జరీ కార్లు..
ది ప్యారడైజ్ స్టార్ నానికి లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం. ఆయన గ్యారేజ్‌లో దాదాపు రూ. 6 కోట్ల విలువైన ప్రీమియం వాహనాలు ఉన్నాయి:
రేంజ్ రోవర్ 3.0 వోగ్: నాని వద్ద ఉన్న అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీ ఇది. తరచూ ఈ కారులోనే నాని బయట కనిపిస్తుంటారు.
బీఎండబ్ల్యూ 5 సిరీస్: నగర ప్రయాణాలకు, షూటింగ్‌లకు వెళ్లేందుకు ఆయన ఎక్కువగా వాడే ప్రీమియం సెడాన్.
టయోటా ఫార్చ్యూనర్: ప్రయాణాల కోసం ఆయన గ్యారేజ్‌లో ఉండే మరో పాపులర్ ఎస్‌యూవీ.
ది ప్యారడైజ్ : అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నేచురల్ స్టార్ వరకు..
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చిన నాని ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుంది. ఆరంభంలో క్లాప్ అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన, దిగ్గజ దర్శకుడు బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో అవకాశాల కోసం నిరీక్షిస్తున్న సమయంలో, 'వరల్డ్ స్పేస్ శాటిలైట్' రేడియోలో ఆర్‌జేగా చేరి 'నాన్ స్టాప్ నాని' కార్యక్రమంతో శ్రోతలను అలరించారు.
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'అష్టా చమ్మా' సినిమాతో నాని కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత రైడ్, స్నేహితుడా, భీమిలి కబడ్డీ జట్టు చిత్రాలతో ఆకట్టుకుని, 'అలా మొదలైంది', 'పిల్ల జమీందార్', 'ఈగ' చిత్రాలతో స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు. 'భలే భలే మగాడివోయ్', 'జెర్సీ', 'శ్యామ్ సింగరాయ్', 'దసరా', 'హాయ్ నాన్న', 'సరిపోదా శనివారం' వంటి వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరిగా నిలిచారు.
ది ప్యారడైజ్ : నిర్మాతగా, హోస్ట్‌గా నాని..
కేవలం నటుడిగానే కాకుండా బుల్లితెరపై 'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2'కి వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు నేచురల్ స్టార్. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై 'హిట్' ఫ్రాంచైజ్ చిత్రాలతో పాటు 'కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' వంటి అవార్డు విన్నింగ్ సినిమాలను నిర్మించారు.
ప్రస్తుతం 'ది పారడైజ్' చిత్రంతో థియేటర్లలో సందడి చేస్తున్న నాని, తదుపరి మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న భారీ చిత్రాన్ని సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


