అందమైన పర్వత శ్రేణులు, పచ్చని వాతావరణం, సువాసనలు వెదజల్లే లావెండర్ తోటలు.. ఇవన్నీ న్యూజిలాండ్‌లోని క్వీన్స్‌టౌన్, వనాకా నగరాల మధ్య సాగే అందమైన రహదారి ప్రయాణంలో పర్యాటకులను పరవశింపజేస్తాయి. అయితే ఈ సుందరమైన ప్రకృతి ఒడిలో ప్రయాణిస్తుంటే కార్డ్రోనా లోయ వద్ద ఒక వింతైన దృశ్యం అందరిని ఆశ్చర్యపరుస్తుంది! రోడ్డు పక్కన ఉన్న సుమారు 40 మీటర్ల పొడవైన ఒక కంచె (ఫెన్స్) నిండా వేలాది ఇన్నర్‌వేర్లు (బ్రా) వేలాడుతూ కనిపిస్తాయి. ‘బ్రాడ్రోనా’ అని పిలిచే ఈ ప్రాంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న ఒక ప్రత్యేకమైన పర్యాటక కేంద్రంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న 'బ్రాడ్రోనా'!

ఈ విచిత్రమైన న్యూజిలాండ్ బ్రా ఫెన్స్ వద్దకు చేరుకున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంటారు. వివిధ రంగులు, పరిమాణాల్లో ఉన్న వేలాది బ్రాలు అక్కడ లైనుగా అమర్చి ఉంటాయి. అక్కడికి వెళ్లే పర్యాటకులు వాటితో సెల్ఫీలు దిగడమే కాకుండా, తమ వెంట తెచ్చుకున్న ఇన్నర్‌వేర్లను కూడా ఆ కంచెకు తగిలించి వెళుతుంటారు!
ఇక ఇటీవలే ఒక ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ ఈ ప్రదేశాన్ని సందర్శించి తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
"ఒకవైపు పర్వతాలు, మరోవైపు సముద్రం ఉన్న ఈ ప్రదేశంలో ఇలా వేలాది ఇన్నర్‌వేర్లు కనిపించడం నమ్మలేకపోతున్నాను. నేను కూడా ఈ వినూత్న సంప్రదాయంలో భాగస్వామ్యమవుతున్నాను," అని చెప్తూ ఆమె తన బ్రాను కూడా ఆ కంచెకు తొడిగింది.
ఈ వింత ఆచారం ఎలా ప్రారంభమైంది?
ఈ విచిత్ర అలవాటు వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 1998 క్రిస్మస్, 1999 నూతన సంవత్సర వేడుకల మధ్య కాలంలో నలుగురు అపరిచిత మహిళలు కార్డ్రోనా వ్యాలీ రోడ్డులోని రహదారి కంచెపై మొదటిసారిగా తమ బ్రాలను వేలాడదీశారు. స్థానిక కార్డ్రోనా హోటల్‌లో రాత్రి వేళ పార్టీ చేసుకున్న అనంతరం వారు సరదాగా ఇలా చేసి ఉంటారని స్థానికులు భావించారు.
ఆ తర్వాత ఆ మార్గంలో ప్రయాణించే మరికొందరు పర్యాటకులు కూడా ఉత్సాహంతో తమ వంతుగా ఇన్నర్‌వేర్లను అక్కడ జోడించడం మొదలుపెట్టారు. రోజులు గడిచేకొద్దీ ఆ కంచె నిండా వందలాది ఇన్నర్‌వేర్లు చేరడంతో అదొక పర్యాటక ఆకర్షణగా రూపాంతరం చెందింది!
వివాదాలు.. అధికారుల తొలగింపు చర్యలు
{{/usCountry}}ఆ తర్వాత ఆ మార్గంలో ప్రయాణించే మరికొందరు పర్యాటకులు కూడా ఉత్సాహంతో తమ వంతుగా ఇన్నర్‌వేర్లను అక్కడ జోడించడం మొదలుపెట్టారు. రోజులు గడిచేకొద్దీ ఆ కంచె నిండా వందలాది ఇన్నర్‌వేర్లు చేరడంతో అదొక పర్యాటక ఆకర్షణగా రూపాంతరం చెందింది!
వివాదాలు.. అధికారుల తొలగింపు చర్యలు
{{/usCountry}}ఈ న్యూజిలాండ్ బ్రా ఫెన్స్ మంచి ప్రాచుర్యం పొందుతున్నప్పటికీ, అందరూ దీనిని స్వాగతించలేదు! ప్రధాన రహదారి పక్కనే ఉండటం వల్ల వాహనదారుల దృష్టి మళ్లి ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానిక అధికారులకు ఫిర్యాదులు అందాయి. కొన్ని సమయాల్లో ఇది సంస్కృతికి భంగపాటు అని విమర్శలూ వచ్చాయి.
దీనితో 2006లో స్థానిక మున్సిపల్ కౌన్సిల్ ఆ కంచె పైనున్న సుమారు 1,500 ఇన్నర్‌వేర్లను తొలగించింది. అయినప్పటికీ, పర్యాటకులు మళ్లీ కొత్త వాటిని తెచ్చి తగిలించడం ప్రారంభించారు. ఇలా అధికారుల తొలగింపు చర్యలు, పర్యాటకుల పునరుద్ధరణల మధ్య కొన్ని ఏళ్ల పాటు వివాదం నడిచింది. చివరికి 2014లో ఈ కంచెను ప్రధాన రహదారి నుంచి కొద్దిగా పక్కకు జరిపి, స్థానిక కార్డ్రోనా డిస్టిలరీ, రైడింగ్ హబ్ ప్రైవేట్ ప్రవేశ మార్గానికి మార్చడంతో వివాదానికి తెరపడింది.
రొమ్ము క్యాన్సర్ చైతన్యానికి ప్రతీకగా..!
2015లో ఈ ప్రాంతానికి అధికారికంగా ‘బ్రాడ్రోనా’ అని నామకరణం చేశారు. కేవలం వినోదం కోసమే కాకుండా, రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన పెంచేందుకు, పరిశోధనలకు నిధులు సేకరించేందుకు దీనిని ఒక ప్రచార వేదికగా మార్చారు.
కంచె వద్ద ఒక గులాబీ రంగు విరాళాల పెట్టెను ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశాన్ని సందర్శించే పర్యాటకులు ఫెన్స్లకు బ్రాలు తొడగడంతో పాటు రొమ్ము క్యాన్సర్ నిధికి విరాళాలు అందజేస్తారు. ఇప్పటివరకు ఈ వేదిక ద్వారా న్యూజిలాండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు లక్షల డాలర్ల విరాళాలు సమకూరడం విశేషం!
అలా ఒక సరదా సంఘటనగా ప్రారంభమైన ఆలోచన, నేడు క్యాన్సర్ బాధితులకు ఆసరాగా నిలుస్తున్న గొప్ప సామాజిక కార్యక్రమంగా నిలిచింది.