...
...
Next Story

JEE Main 2026 Results : జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ఫలితాలు - ముగ్గురు తెలుగు విద్యార్థులకు100 పర్సంటైల్‌

జేఈఈ మెయిన్‌-2026 తొలి విడత ఫలితాల్లో ఏపీ, తెలంగాణ విద్యార్థులు మెరిశారు. దేశవ్యాప్తంగా 12 మంది 100 పర్సంటైల్‌ స్కోర్‌ సాధించగా… వీరిలో ముగ్గురు తెలుగువారు ఉన్నారు.

Published on: Feb 17, 2026 06:30 AM IST
Advertisement

జేఈఈ మెయిన్‌-2026 మొదటి సెషన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మెరిశారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో దేశవ్యాప్తంగా 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ స్కోర్‌ సాధించారు. అయితే వారిలో ముగ్గురు తెలుగు రాష్ట్రాల వాళ్లు ఉన్నారు. ఏపీ నుంచి ఇద్దరు కాగా… తెలంగాణ నుంచి ఒకరున్నారు.

జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ఫలితాలు
జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రేంద్రబాబు గారి మహిత్, పసల మోహిత్ 100 పర్సంటైల్‌ స్కోర్ సాధించారు. ఇక తెలంగాణకు చెందిన వివాన్ శరద్ మహిశ్వరి కూడా 100 పర్సంటైల్‌ సాధించిన వారిలో ఒకరిగా ఉన్నాడు. రెండో విడత పరీక్ష తర్వాత విడుదలయ్యే తుది ర్యాంకుల్లో వీరికి మంచి ర్యాంకులు దక్కే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మంత్రి లోకేశ్ అభినందనలు

ఏపీ నుంచి 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. “జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటడం గర్వకారణం. దేశవ్యాప్తంగా కేవలం 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా, అందులో మన రాష్ట్రానికి చెందిన నరేంద్ర బాబు గారి మహిత్, పసల మోహిత్ అత్యున్నత ప్రతిభ కనబరచడం అభినందనీయం. కఠోర శ్రమ, క్రమశిక్షణతో జాతీయ స్థాయిలో రాష్ట్ర కీర్తిని దశదిశలా చాటిన విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు” అని పేర్కొన్నారు.

ఇక జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా దేశంలోని ఎన్‌ఐటీలు (NITs), ఐఐఐటీలు (IIITs) మరియు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే విద్యాసంస్థల్లో (GFTIs) అడ్మిషన్లు లభిస్తాయి. మెయిన్స్‌లో అర్హత సాధించిన అగ్రశ్రేణి విద్యార్థులు మాత్రమే ఐఐటీలలో (IITs) ప్రవేశం కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయడానికి అవకాశం పొందుతారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe