పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గత నెల ఎన్నికల పరాజయం తర్వాత టీఎంసీలో అసమ్మతి జ్వాలలు ముమ్మరమ్యాయి. ఏకంగా 20 మంది లోక్‌సభ ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమికి మద్దతు ఇవ్వడానికి సిద్ధమవగా, రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేలు విడిగా చీలిపోయారు. ఈ తిరుగుబాటు పార్లమెంట్, అసెంబ్లీలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో పరిశీలిద్దాం.
లోక్‌సభలో మారిన సమీకరణాలు

లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్ కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో దాదాపు 20 మంది ఎంపీలు తాము ఎన్‌డీయే (NDA) కూటమికి అధికారికంగా మద్దతు ఇస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
ప్రస్తుతం లోక్‌సభలో టీఎంసీకి మొత్తం 28 మంది సభ్యులు ఉన్నారు (బసిర్‌హాట్ ఎంపీ హాజీ నూరుల్ ఇస్లాం మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది). తాజా చీలికతో మమతా బెనర్జీ వైపు కేవలం 8 మంది ఎంపీలు మాత్రమే మిగిలారు.
బీజేపీకి లాభమేనా?
ఈ రెబెల్ ఎంపీలు లోక్‌సభలో ఒక ప్రత్యేక పార్లమెంటరీ బ్లాక్‌గా ఉంటూనే కేంద్రంలోని ఎన్‌డీయే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వనున్నారు. ఇది పరోక్షంగా లోక్‌సభలో బీజేపీ కూటమి బలాన్ని మరింత పెంచనుంది.
రాజ్యసభలోనూ ఎదురుదెబ్బ
మరోవైపు, టీఎంసీ సీనియర్ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి, అలాగే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభలో టీఎంసీ బలం 13 నుండి 12కి పడిపోయింది. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, ఆర్‌జీ కర్ హాస్పిటల్ అత్యాచారం-హత్య కేసును పార్టీ హ్యాండిల్ చేసిన విధానంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని ఆయన ఆరోపించారు.
“ఆర్‌జీ కర్ హాస్పిటల్ ఘటనపై నేను బహిరంగంగా మాట్లాడినప్పటి నుండి పార్టీ నన్ను దూరం పెట్టింది. సాక్ష్యాల నాశనంలో కీలక పాత్ర పోషించిన కొందరు పోలీసులపై అంతర్గత విచారణ జరపాలని డిమాండ్ చేయడమే నేను చేసిన తప్పు. ప్రస్తుతానికి నేను ఏ పార్టీలో చేరడం లేదు, బహుశా క్రియాశీల రాజకీయాల నుంచే తప్పుకోవచ్చు” అని సుఖేందు శేఖర్ రాయ్ వ్యాఖ్యానించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తిరుగుబాటు కొండంత
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీకి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అందులో 58 మంది ఎమ్మెల్యేలు అధిష్టానంపై తిరుగుబాటు చేశారు. పార్టీ అధికారికంగా ప్రతిపాదించిన శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయను తిరస్కరించి, రితబ్రత బెనర్జీని తమ నేతగా ఎన్నుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ ఈ 58 మంది తిరుగుబాటు గ్రూపును ప్రత్యేక లెజిస్లేటివ్ బ్లాక్‌గా అధికారికంగా గుర్తించడమే కాకుండా, రితబ్రత బెనర్జీని అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఆమోదించారు.
{{/usCountry}}పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీకి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అందులో 58 మంది ఎమ్మెల్యేలు అధిష్టానంపై తిరుగుబాటు చేశారు. పార్టీ అధికారికంగా ప్రతిపాదించిన శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయను తిరస్కరించి, రితబ్రత బెనర్జీని తమ నేతగా ఎన్నుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ ఈ 58 మంది తిరుగుబాటు గ్రూపును ప్రత్యేక లెజిస్లేటివ్ బ్లాక్‌గా అధికారికంగా గుర్తించడమే కాకుండా, రితబ్రత బెనర్జీని అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఆమోదించారు.
{{/usCountry}}రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉండగా, సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఈ రెబెల్ ఎమ్మెల్యేలు తాము సెంబ్లీలో బాధ్యతాయుతమైన, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని, కేవలం వ్యతిరేకత కోసమే ప్రభుత్వాన్ని అడ్డుకోబోమని స్పష్టం చేశారు. అంతేకాదు, మమతా బెనర్జీని తమ కొత్త లెజిస్లేటివ్ టీమ్‌కు 'చీఫ్ అడ్వైజర్' (ప్రధాన సలహాదారు)గా ఉండాలని కోరతామని రితబ్రత బెనర్జీ పేర్కొనడం గమనార్హం.
సభల వారీగా టీఎంసీ బలాబలాలు (నెంబర్ గేమ్):
| సభ పేరు | మొత్తం సభ్యులు | రెబెల్స్ / రాజీనామా చేసినవారు | మమతా బెనర్జీ పక్షాన ఉన్నవారు |
|---|---|---|---|
| లోక్‌సభ | 28 (1 ఖాళీ) | 20 (ఎన్‌డీయేకి మద్దతు) | 8 |
| రాజ్యసభ | 13 | 1 (రాజీనామా) | 12 |
| బెంగాల్ అసెంబ్లీ | 80 | 58 (ప్రత్యేక బ్లాక్) | 22 |