ఈ ఏడాది లాంచ్​ అయిన టాప్​ 5 నియో రెట్రో బైక్స్​- కుర్రాళ్ల ఫేవరెట్​ ఇవి..

2025లో క్లాసిక్ డిజైన్, మోడ్రన్ ఫీచర్ల కలయికతో వచ్చిన ఐదు అద్భుతమైన నియో రెట్రో బైక్స్​ విశేషాలు మీకోసం. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి హోండా వరకు స్టైలిష్ బైకుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Dec 30, 2025, 06:45:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బైక్​ అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు. అది ఒక ఎమోషన్. పాతకాలపు రాజసాన్ని ఉట్టిపడేలా చేస్తూనే, నేటి తరం టెక్నాలజీని జోడించి రూపొందించే 'నియో రెట్రో' బైకులకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. 2025లో కూడా ఈ క్రేజ్​ కొనసాగింది. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్​ సంస్థలు కొత్త కొత్త మోడల్స్​ని లాంచ్​ చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అద్భుతమైన డిజైన్లతో ఈ ఏడాది లాంచ్​ అయిన టాప్​ 5 నియో రెట్రో బైక్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

బెస్ట్​ నియో రెట్రో బైక్స్​..
బెస్ట్​ నియో రెట్రో బైక్స్​..

2025లో లాంచ్​ అయిన టాప్​ 5 నియో రెట్రో బైక్స్​..

1. హోండా సీబీ350సీ

350 సీసీ విభాగంలో పట్టు సాధించేందుకు హోండా ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ. 2.02 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కేవలం హోండా 'బిగ్‌వింగ్' డీలర్‌షిప్‌లలో మాత్రమే లభించే ఈ బైక్.. ఆకర్షణీయమైన కలర్ స్కీమ్స్, కొత్త గ్రాఫిక్స్‌తో వస్తోంది.

సిటీలో తిరగడానికైనా, హైవేపై లాంగ్ డ్రైవ్‌కైనా దీనిలోని పవర్‌ఫుల్ టార్క్ అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది.

2. హోండా సీబీ650ఆర్​..

క్లాసిక్ లుక్‌తో పాటు రేసింగ్ బైక్ పవర్‌ను కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. హోండా సీబీఆర్​650ఆర్​కి ఇది నేకెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. దీనిలో విప్లవాత్మకమైన 'ఈ-క్లచ్' టెక్నాలజీని ప్రవేశపెట్టారు. 649 సీసీ ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్.. 94 బీహెచ్​పీ పవర్‌ని జనరేట్​ చేస్తుంది.

దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 9.60 లక్షల నుంచి రూ. 10.30 లక్షల వరకు ఉంది.

3. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350..

కుర్రాళ్ల ఫేవరెట్ హంటర్ 350 బైక్​ని 2025లో మరింత కొత్తగా తీర్చిదిద్దింది రాయల్ ఎన్‌ఫీల్డ్. కొత్త రంగులతో పాటు ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, మొబైల్ ఛార్జింగ్ కోసం టైప్-సీ పోర్ట్, సౌకర్యవంతమైన సీటు వంటి అప్‌గ్రేడ్స్ ఇచ్చారు. ముఖ్యంగా దీనిలోని స్లిప్పర్ క్లచ్, కొత్త సస్పెన్షన్ రైడింగ్‌ను చాలా స్మూత్‌గా మారుస్తాయి.

దీని ప్రారంభ ధర రూ. 1.37 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ఉండటం విశేషం.

4. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650..

బైక్ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూసిన వెహికిల్​ ఇది. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన 'ట్విన్ ఇంజిన్' ఇప్పుడు క్లాసిక్ లుక్‌లో రోడ్డు మీదకు వచ్చింది. దీని ఫినిషింగ్, క్రోమ్ టచ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

పాత క్లాసిక్ 500 స్ఫూర్తితో రూపొందించిన ఈ బైక్ ధర రూ. 3.37 లక్షల నుంచి రూ. 3.61 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

5. ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 1200

అందానికి అందం, పవర్‌కు పవర్.. అదే ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 1200! టియర్-డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయల్ ట్యాంక్, రౌండ్ హెడ్‌ల్యాంప్, బార్-ఎండ్ మిర్రర్స్ దీనికి వింటేజ్ లుక్‌ను ఇస్తాయి. 1200 సీసీ ఇంజిన్‌తో ఏకంగా 103 బీహెచ్​పీ పవర్‌ను ఇచ్చే ఈ మెషీన్ ధర రూ. 13.84 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More