Cruise Control Cars : బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్- క్రూయిజ్ కంట్రోల్ ఉన్న టాప్-5 కార్లు ఇవే!
సుదీర్ఘ ప్రయాణాల్లో అలసట లేకుండా డ్రైవింగ్ ఆనందాన్నిచ్చే 'క్రూయిజ్ కంట్రోల్' ఫీచర్ ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు ధరలో ఈ అద్భుతమైన ఫీచర్‌ను అందిస్తున్న 5 అత్యుత్తమ కార్ల వివరాలు మీకోసం..
సుదీర్ఘ హైవే ప్రయాణాల్లో గంటల తరబడి యాక్సలరేటర్ పెడల్‌పై కాలు ఉంచి డ్రైవ్ చేయడం కాస్త కష్టం అనిపించవచ్చు. ఇలాంటి సమయంలో డ్రైవర్‌కు ఊరటనిచ్చే 'అన్‌సంగ్ హీరో' ఒకటి ఉంది. అదే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్. ఒకప్పుడు కేవలం లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ ఫీచర్, ఇప్పుడు బడ్జెట్ ధరలో లభించే కార్లలోనూ అందుబాటులోకి వచ్చింది. మీరు రూ. 12 లక్షల లోపు బడ్జెట్‌లో క్రూయిజ్ కంట్రోల్ ఉన్న కారు కోసం చూస్తున్నట్లయితే, ఈ ఐదు ఆప్షన్లు మీ జాబితాలో ఉండాల్సిందే..

రూ. 12 లక్షల బడ్జెట్‌లో క్రూయిజ్ కంట్రోల్ ఉన్న టాప్-5 కార్లు..
1. సిట్రోయెన్ సీ3ఎక్స్
ఎక్స్‌షోరూం ధర: రూ. 4.95 - 9.45 లక్షలు
సిట్రోయెన్ సీ3 కంటే ప్రీమియం వెర్షన్‌గా వచ్చిన ఈ సీ3ఎక్స్, దాని టాప్-స్పెక్ 'షైన్' వేరియంట్‌లో క్రూయిజ్ కంట్రోల్‌ను అందిస్తోంది. ముఖ్యంగా టర్బో-పెట్రోల్ ఇంజన్, టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ కలయికతో వచ్చే ఈ మోడల్ (రూ. 9.45 లక్షలు) హైవేలపై సాఫీగా దూసుకుపోతుంది. ఇందులో 10.25- ఇంచ్ టచ్‌స్క్రీన్, ఆటో ఏసీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
2. హోండా అమేజ్
ఎక్స్‌షోరూం ధర: రూ. 7.47 - 9.99 లక్షలు
హోండా నుంచి లభిస్తున్న అత్యంత చౌకైన సెడాన్ ఇది. దీని టాప్-స్పెక్ 'జెడ్ఎక్స్' వేరియంట్‌లో ఏకంగా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను అందించడం విశేషం. రూ. 9.21 లక్షల ప్రారంభ ధరకే లభించే ఈ కారులో వైర్‌లెస్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
3. హ్యుందాయ్ ఎక్స్టర్
ఎక్స్‌షోరూం ధర: రూ. 5.60 - 9.38 లక్షలు
మైక్రో-ఎస్‌యూవీ విభాగంలో రఫ్ అండ్ టఫ్ లుక్‌తో అలరిస్తున్న ఎక్స్టర్, మధ్య శ్రేణి వేరియంట్ 'ఎస్ఎక్స్' (రూ. 7.70 లక్షలు) నుంచే క్రూయిజ్ కంట్రోల్‌ను అందిస్తోంది. వాయిస్ ఎనేబుల్డ్ సన్‌రూఫ్, అలెక్సా కనెక్టివిటీ వంటి ఫీచర్లు దీనికి అదనపు ఆకర్షణ.
ఈ ఎక్స్టర్ని సంస్థ అప్డేట్ చేస్తోంది. 2026 హ్యుందాయ్ ఎక్స్టర్ ఫేస్‌లిఫ్ట్ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
4. స్కోడా కైలాక్
ఎక్స్‌షోరూం ధర: రూ. 7.59 - 12.99 లక్షలు
భారత్ కోసం స్కోడా రూపొందించిన తొలి సబ్-4 మీటర్ ఎస్‌యూవీ ఇది. 'క్లాసిక్ ప్లస్' వేరియంట్ (రూ. 8.25 లక్షలు) నుంచి ఇందులో క్రూయిజ్ కంట్రోల్ లభిస్తుంది. 1.0-లీటర్ టర్బో ఇంజన్‌తో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఈ కారులో వెంటిలేటెడ్ సీట్లు కూడా ఉండటం గమనార్హం.
5. హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్
ఎక్స్‌షోరూం ధర: రూ. 9.21 - 11.67 లక్షలు
స్పోర్టీ డ్రైవింగ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఐ20 ఎన్ లైన్‌లో క్రూయిజ్ కంట్రోల్ స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తుంది. అంటే అన్ని వేరియంట్లలోనూ ఇది అందుబాటులో ఉంటుంది. స్పోర్టియర్ సస్పెన్షన్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ దీని ప్రత్యేకతలు.
వీటిల్లో మీరు ఏ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఉన్న కారును ఎంచుకుంటారు?
తరచూ అడిగే ప్రశ్నలు-
1. క్రూయిజ్ కంట్రోల్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?
క్రూయిజ్ కంట్రోల్ అనేది ఒక ఆటోమేటెడ్ సిస్టమ్. మీరు ఒక నిర్దిష్ట వేగాన్ని (ఉదాహరణకు గంటకు 80 కి.మీ) సెట్ చేసినప్పుడు, మీరు యాక్సలరేటర్ పెడల్‌పై కాలు పెట్టకపోయినా కారు అదే వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ముఖ్యంగా ట్రాఫిక్ లేని హైవేలపై డ్రైవర్ అలసటను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మీరు బ్రేక్ నొక్కినా లేదా క్లచ్ వాడినా ఈ సిస్టమ్ వెంటనే ఆగిపోతుంది.
2. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, సాధారణ క్రూయిజ్ కంట్రోల్ మధ్య తేడా ఏంటి?
సాధారణ క్రూయిజ్ కంట్రోల్: మీరు సెట్ చేసిన వేగంతోనే కారు వెళుతుంది. ముందున్న కారు నెమ్మదించినా ఇది వేగాన్ని తగ్గించదు, మీరే మాన్యువల్‌గా బ్రేక్ వేయాలి.
అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ఏసీసీ): ఇది సెన్సార్ల సాయంతో పనిచేస్తుంది. మీ ముందు వెళుతున్న కారు వేగాన్ని బట్టి మీ కారు వేగాన్ని ఆటోమేటిక్‌గా పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది. ఒకవేళ ముందు కారు ఆగిపోతే, మీ కారు కూడా సురక్షితమైన దూరం పాటిస్తూ నెమ్మదిస్తుంది.
3. క్రూయిజ్ కంట్రోల్ వాడటం వల్ల మైలేజీ పెరుగుతుందా?
అవును, సాధారణంగా హైవేలపై క్రూయిజ్ కంట్రోల్ వాడటం వల్ల మైలేజీ మెరుగుపడుతుంది. ఎందుకంటే మనం మాన్యువల్‌గా డ్రైవ్ చేస్తున్నప్పుడు తెలియకుండానే తరచుగా యాక్సలరేటర్ పెడల్‌ను నొక్కడం లేదా వదలడం చేస్తుంటాం. కానీ క్రూయిజ్ కంట్రోల్ ఇంజన్‌కు వెళ్లే ఇంధన సరఫరాను స్థిరంగా ఉంచుతుంది. అయితే, ఎత్తుపల్లాలు ఉన్న ఘాట్ రోడ్లపై దీని వల్ల మైలేజీ తగ్గే అవకాశమూ ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


