SUV : టాటా పంచ్​కి పోటీగా హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఫేస్​లిఫ్ట్​- అప్డేటెడ్​ ఎస్​యూవీ హైలైట్స్​ ఇవే!

టాటా పంచ్‌కు గట్టి పోటీనిచ్చే హ్యుందాయ్ ఎక్స్​టర్​ సరికొత్త అవతారంలో రాబోతోంది. 2026 ఎక్స్​టర్​ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కొరియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించింది. మెరుగైన ఇంటీరియర్, మరిన్ని సేఫ్టీ ఫీచర్లతో ఈ కారు త్వరలోనే భారత్‌లో విడుదల కానుంది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Feb 20, 2026, 10:00:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హ్యుందాయ్ ఇండియా ఈ ఏడాది వరుసగా కొత్త మోడళ్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా కంపెనీకి మంచి సక్సెస్ అందించిన మైక్రో ఎస్​యూవీ 'ఎక్స్​టర్​' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకువస్తోంది. తాజాగా కొరియాలో ఈ కారు టెస్టింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. భారీగా కవర్ చేసినప్పటికీ, ఈ కొత్త వెర్షన్‌లో రాబోయే మార్పులపై ఒక స్పష్టత వచ్చింది. వాటి వివరాలను ఇక్కడ చూసేయండి..

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఫేస్​లిఫ్ట్​ అప్డేట్స్​..
హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఫేస్​లిఫ్ట్​ అప్డేట్స్​..

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఫేస్​లిఫ్ట్​- ఎక్స్‌టీరియర్: చిన్నపాటి మార్పులు..

మొదటి చూపులో 2026 ఎక్స్​టర్​ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత మోడల్ లాగే కనిపిస్తోంది. గ్రిల్, హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ డిజైన్‌లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు.

వీల్స్: టెస్టింగ్ చేస్తున్న కారులో స్టీల్ వీల్స్ ఉన్నాయి. అంటే ఇది బేస్ వేరియంట్ (ఈఎక్స్​ లేదా ఈఎక్స్​(ఓ)) అయ్యే అవకాశం ఉంది.

స్టాన్స్: హ్యుందాయ్​ ఎక్స్​టర్​కే గుర్తింపునిచ్చే ఆ మస్క్యులర్​ వీల్ ఆర్చ్ క్లాడింగ్ అలాగే కొనసాగుతోంది. ఇది కారుకు స్ట్రాంగ్ ఎస్​యూవీ లుక్‌ను ఇస్తోంది.

బేస్ వేరియంట్ కావడంతో ఇందులో రూఫ్ రైల్స్ కనిపించలేదు. బంపర్ డిజైన్‌లో మాత్రం చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది.

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఫేస్​లిఫ్ట్​- ఇంటీరియర్: అసలైన అప్‌డేట్స్ ఇక్కడే!

బయట పెద్దగా మార్పులు లేకపోయినా, 2026 హ్యుందాయ్​ ఎక్స్​టీరియర్​ లోపల మాత్రం సంస్థ భారీ మార్పులే చేస్తోంది.

టెక్నాలజీ: ప్రస్తుత దానికంటే పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త గ్రాఫిక్స్‌తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇందులో ఆశించవచ్చు. కనెక్టెడ్ కార్ ఫీచర్లు కూడా మరింత మెరుగుపడనున్నాయి.

సౌకర్యాలు: సెగ్మెంట్‌లో మొదటిసారిగా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఫ్రంట్, రియర్ ఆర్మ్‌రెస్ట్‌లు, అలాగే వెనుక ప్రయాణికుల కోసం సన్‌షేడ్స్ వంటి ప్రీమియం ఫీచర్లను హ్యుందాయ్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఈ మైక్రో ఎస్​యూవీ ఇంటీరియర్ థీమ్, మెటీరియల్ క్వాలిటీ కూడా పెరగనుంది.

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఫేస్​లిఫ్ట్​- భద్రతలో మరో మెట్టు పైకి..!

ప్రస్తుతం ఎక్స్​టర్​లో 6 ఎయిర్‌బ్యాగులు, ఈఎస్​సీ, హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ కెమెరా, టీపీఎంఎస్​ (టైర్​ ప్రెజర్​ మానిటరింగ్​ సిస్టెమ్​), ఇన్‌బిల్ట్ డ్యాష్‌క్యామ్ వంటి మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో మరిన్ని అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ (అడాస్​) ఫీచర్లను జోడించడం ద్వారా భద్రతను మరింత పటిష్ఠం చేయాలని హ్యుందాయ్ భావిస్తోంది.

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఫేస్​లిఫ్ట్​- ఇంజిన్ ఆప్షన్లు మారవు..!

మెకానికల్ పరంగా 2026 హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఫేస్‌లిఫ్ట్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

పెట్రోల్: 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ (83 హెచ్​పీ పవర్, 113.8 ఎన్​ఎం టార్క్). ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

సీఎన్జీ: ఇందులో బయో-ఫ్యూయల్ పెట్రోల్ + సీఎన్జీ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది 69 హెచ్​పీ పవర్ అందిస్తుంది (కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే).

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఫేస్​లిఫ్ట్​- పోటీ, ధర..

హ్యుందాయ్ ఎక్స్​టర్​ ప్రధానంగా టాటా పంచ్, మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది. ప్రస్తుతం ఎక్స్​టర్​ ధర రూ. 5.64 లక్షల నుంచి రూ. 8.85 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కొత్త ఫీచర్లు, టెక్నాలజీ కారణంగా ఫేస్‌లిఫ్ట్ ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

ఈ కొత్త మోడల్ లాంచ్​పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, త్వరలోనే ఇది భారత మార్కెట్​లో లాంచ్ కానుందని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More