Sedans for city drive : సిటీ ట్రాఫిక్‌ని జయించే సెడాన్లు ఇవి- తక్కువ బడ్జెట్ నుంచి ప్రీమియం ఎలక్ట్రిక్ వరకు!

సిటీ ట్రాఫిక్​లో స్మూత్​ డ్రైవింగ్​ కోసం మంచి సెడాన్​ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో ప్రస్తుతం మీ అవసరానికి తగ్గట్టు ఉన్న టాప్​-5 సెడాన్​ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 10, 2026, 16:00:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నగరాల్లో ప్రయాణం అంటే గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లు, ఇరుకైన రోడ్లు. ఇలాంటి పరిస్థితుల్లో సాఫీగా సాగిపోయే పెర్ఫార్మెన్స్, సౌకర్యవంతమైన సీటింగ్, ప్రాక్టికల్ ఫీచర్లు ఉన్న సెడాన్ మీ డ్రైవింగ్ ఎక్స్​పీరియెన్స్​ని పూర్తిగా మార్చేస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ల నుంచి లగ్జరీ ఎలక్ట్రిక్- హైబ్రిడ్ మోడళ్ల వరకు సిటీ ట్రాఫిక్‌కు సరిపోయే ఐదు ఉత్తమ సెడాన్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

హోండా అమేజ్​ సెడాన్​..
హోండా అమేజ్​ సెడాన్​..

1. హోండా అమేజ్

ఎక్స్​షోరూం ధర: రూ. 7.47 - 9.99 లక్షలు

జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా నుంచి లభిస్తున్న అత్యంత చౌకైన సెడాన్ ఇది. చిన్న సైజులో ఉండటం వల్ల సిటీలో నడపడం చాలా సులభం.

ఇంజిన్: 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ (ఎన్​ఏ) పెట్రోల్.

గేర్‌బాక్స్: 5-స్పీడ్ మాన్యువల్ (ఎంటీ), సీవీటీ ఆటోమేటిక్.

ఫీచర్లు: 8- ఇంచ్​ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 7- ఇంచ్​ సెమీ-డిజిటల్ క్లస్టర్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ వెంట్స్, వైర్‌లెస్ ఛార్జర్, కప్పు హోల్డర్లతో కూడిన రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్.

2. స్కోడా స్లావియా..

ఎక్స్​షోరూం ధర: రూ. 9.99 - 17.99 లక్షలు

విశాలమైన క్యాబిన్, ప్రీమియం ఫీచర్లతో విసుగు పుట్టించే ట్రాఫిక్ ప్రయాణాన్ని కూడా ఇది ఆహ్లాదకరంగా మారుస్తుంది.

ఇంజిన్ అండ్​ పవర్: * 1.0-లీటర్ టీఎస్​ఐ (114 బీహెచ్​పీ/178 ఎన్​ఎం)

1.5-లీటర్ టీఎస్​ఐ (148 బీహెచ్​పీ/250 ఎన్​ఎం)

గేర్‌బాక్స్: 6-స్పీడ్ మాన్యువల్ (6 ఎంటీ), టార్క్ కన్వర్టర్ (6టీసీ), 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ (7 డీసీటీ) ఆప్షన్లు ఉన్నాయి.

ఫీచర్లు: ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, వెంటిలేషన్ సదుపాయం ఉన్న పవర్డ్ ఫ్రంట్ సీట్లు, 10- ఇంచ్​ టచ్‌స్క్రీన్, డిజిటల్ క్లస్టర్.

3. హోండా సిటీ..

ఎక్స్​షోరూం ధర: రూ. 11.95 - 16.07 లక్షలు

దశాబ్దాలుగా భారతీయ రోడ్లపై అత్యంత ఆదరణ పొందిన సెడాన్ ఇది. రిఫైన్డ్ డ్రైవింగ్ ఎక్స్​పీరియెన్స్​, టెక్నాలజీతో కూడిన ఇంటీరియర్ దీని ప్రత్యేకత.

ఇంజిన్: 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఐ-వీటెక్​ పెట్రోల్ (117 బీహెచ్​పీ/145 ఎన్​ఎం).

గేర్‌బాక్స్: 6-స్పీడ్ మాన్యువల్ (ఎంటీ), 7-స్పీడ్ సీవీటీ (ప్యాడిల్ షిఫ్టర్లతో).

ఫీచర్లు: 8- ఇంచ్​ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, భద్రత కోసం హోండా సెన్సింగ్ అడాస్​ సూట్.

4. బీవైడీ సీల్..

ఎక్స్​షోరూం ధర: రూ. 41.00 - 53.15 లక్షలు

ఇది ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ సెడాన్. స్టైలిష్ డిజైన్, నిశ్శబ్దమైన పవర్‌ట్రెయిన్ వల్ల సిటీలో డ్రైవింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

బ్యాటరీ అండ్​ రేంజ్: 61.44 కేడబ్ల్యూహెచ్​ (510 కిమీ, 82.56 కేడబ్ల్యూహెచ్​ (650 కిమీ వరకు రేంజ్).

వేరియంట్లు: డైనమిక్ (201 బీహెచ్​పీ), ప్రీమియం (308 బీహెచ్​పీ), పర్ఫార్మెన్స్ ఏడబ్ల్యూడీ (523 బీహెచ్​పీ).

ఫీచర్లు: 15.6- ఇంచ్​ రొటేటింగ్ టచ్‌స్క్రీన్, 10.25- ఇంచ్​ ఎల్​సీడీ క్లస్టర్, విండ్‌స్క్రీన్ హెచ్​యూడీ (హెడ్​- అప్​ డిస్​ప్లే), క్రిస్టల్ గేర్ సెలెక్టర్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్.

5. టయోటా కామ్రీ..

ఎక్స్​షోరూం ధర: రూ . 47.48 - 47.62 లక్షలు

ఎలిగెంట్ లుక్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వచ్చే ప్రీమియం మిడ్-సైజ్ సెడాన్.

ఇంజిన్: 2.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ (226.8 బీహెచ్​పీ పవర్).

గేర్‌బాక్స్: ఈ- సీవీటీ (10-స్పీడ్ సీక్వెన్షియల్ షిఫ్ట్ మోడ్‌తో).

ఫీచర్లు: సాఫ్ట్ లెదర్ అప్‌హోలిస్ట్రీ, రెండు 12.3- ఇంచ్​ డిస్‌ప్లేలు, 10-వే పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 9-స్పీకర్ జేబీఎల్​ ఆడియో సిస్టమ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More