పెట్రోల్​ ధరలు పెరుగుతాయని భయంగా ఉందా? ఈవీలు కొనండి- ఈ టాటా ఎలక్ట్రిక్​ కార్లపై అదిరే డిస్కౌంట్లు

Tata electric cars discounts : కొత్త ఎలక్ట్రిక్​ కారు తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. తన పోర్ట్​ఫోలియోలోని ఈవీలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది టాటా మోటార్స్​ సంస్థ. గరిష్ఠంగా రూ. 3లక్షల వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. పూర్తి వివరాలను చూసేయండి..

Published on: Mar 10, 2026, 06:00:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్న రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం, నేడు ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా అనిశ్చితి, రేపు ఇంకొకటి.. ఇలా కారణం ఏదైనా సరే, పెట్రోల్​- డీజిల్​ ధరలు పెరుగాయేమో అన్న భయం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇంధన ఖర్చులు పెరిగితే సామాన్యుడి జేబుకు చిల్లుపడినట్టే! అందుకే చాలా మంది ఇప్పుడు ఈవీలవైపు షిఫ్ట్​ అవుతున్నారు. మరి మీరు కూడా ఒక ఎలక్ట్రిక్​ కారు కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ, దేశ ఈవీ సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతున్న టాటా మోటార్స్​.. తన పోర్ట్​ఫోలియోలోని ఎలక్ట్రిక్​ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. ఇవి ఈ మార్చ్​ నెలలో అందుబాటులో ఉంటాయి. ఈ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా హారియర్​ ఈవీ
టాటా హారియర్​ ఈవీ

టాటా కర్వ్ ఈవీ - మార్చి 2026 ఆఫర్లు..

టాటా మోటార్స్ నుంచి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూపేపై ప్రస్తుతం రూ. 3.30 లక్షల భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రూ. 3 లక్షల క్యాష్​ డిస్కౌంట్​, రూ. 30,000 ఎక్స్​ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

సామర్థ్యం: ఇది 45 kWh, 55 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. 45 kWh వేరియంట్ 148 బీహెచ్​పీ పవర్, 215 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగా.. 55 కేడబ్ల్యూహెచ్​ వేరియంట్ 165 బీహెచ్​పీ పవర్, 215 ఎన్​ఎం టార్క్‌ను అందిస్తుంది.

ధర: దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 17.49 లక్షలు.

టాటా టియాగో ఈవీ - మార్చి 2026 ఆఫర్లు..

టాటా ఎలక్ట్రిక్​ కార్ల పోర్ట్‌ఫోలియోలో ఎంట్రీ-లెవల్ మోడల్ అయిన టియాగో ఈవీపై మొత్తం రూ. 60,000 వరకు తగ్గింపు ఉంది. ఇందులో రూ. 40,000 నగదు తగ్గింపు, రూ. 20,000 ఎక్స్​ఛేంజ్ బోనస్ కలిసి ఉన్నాయి.

సామర్థ్యం: ఇది రెండు బ్యాటరీ ప్యాక్ వెర్షన్లలో లభిస్తుంది. 19.2 kWh బ్యాటరీ ప్యాక్ మోటార్ 60 బీహెచ్​పీ పవర్, 110 ఎన్​ఎం టార్క్‌ను ఇస్తుంది. అలాగే 24 kWh బ్యాటరీ ప్యాక్ 73.75 బీహెచ్​పీ పవర్, 114 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ధర: దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.99 లక్షలు.

టాటా ఎలక్ట్రిక్​ కార్లపై డిస్కౌంట్లు..
టాటా ఎలక్ట్రిక్​ కార్లపై డిస్కౌంట్లు..

టాటా నెక్సాన్ ఈవీ- మార్చి 2026 ఆఫర్లు..

టాటా మోటార్స్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న సబ్-కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నెక్సాన్ ఈవీపై ప్రస్తుతం రూ. 30,000 ఎక్స్​ఛేంజ్ బోనస్ మాత్రమే లభిస్తోంది. నెక్సాన్ ఐసీఈ (పెట్రోల్/డీజిల్) వెర్షన్ ఇప్పటికే ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటిగా ఉంది.

సామర్థ్యం: ఇది 30 kWh, 45 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. 30 kWh వెర్షన్ 127.3 బీహెచ్​పీ పవర్, 215 ఎన్​ఎం టార్క్‌ను.. 45 kWh వెర్షన్ 142.14 బీహెచ్​పీ పవర్, 215 ఎన్​ఎం టార్క్‌ను అందిస్తాయి.

ధర: దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.49 లక్షలు.

టాటా హారియర్ ఈవీ - మార్చి 2026 ఆఫర్లు..

టాటా ఎలక్ట్రిక్​ కార్ల శ్రేణిలో హారియర్ ఈవీ అత్యంత ఖరీదైన 'ఫ్లాగ్‌షిప్' మోడల్. ప్రస్తుతం ఈ కారుపై రూ. 50,000 ఎక్స్​ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంది.

సామర్థ్యం: ఇందులో 65 kWh, 75 kWh అనే రెండు పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. రియర్ వీల్ డ్రైవ్ (ఆర్​డబ్ల్యూడీ) వేరియంట్ 234.74 బీహెచ్​పీ పవర్‌ను ఇస్తుంది. ఇక ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) వేరియంట్ వెనుక వైపు మోటార్ ద్వారా 234.74 బీహెచ్​పీ, ముందు వైపు మోటార్ ద్వారా 155.8 బీహెచ్​పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ధర: దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.49 లక్షలు.

తరచుగా అడిగే ప్రశ్నలు-

1. టాటా కర్వ్ ఈవీపై లభించే రూ. 3.30 లక్షల తగ్గింపులో ఏయే అంశాలు ఉన్నాయి?

టాటా కర్వ్ ఈవీపై లభించే ఈ భారీ తగ్గింపులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి రూ. 3,00,000 నేరుగా లభించే నగదు తగ్గింపు, కాగా మిగిలిన రూ. 30,000 పాత కారును మార్చుకునే వారికి లభించే ఎక్స్​ఛేంజ్ బోనస్. అంటే కొత్త కారు కొనే వారందరికీ రూ. 3 లక్షల ప్రయోజనం ఖచ్చితంగా అందుతుంది.

2. టాటా హారియర్ ఈవీలోని ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ ప్రత్యేకత ఏంటి

హారియర్ ఈవీ ఏడబ్ల్యూడీ వేరియంట్ అత్యంత శక్తివంతమైనది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇది కఠినమైన రోడ్లపై కూడా కారుకు అద్భుతమైన పట్టును (ట్రాక్షన్​​), వేగాన్ని చేకూరుస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More