Best Smartphones : రూ. 25వేల ధరలోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్స్ ఇవి- 10,001ఎంఏహెచ్ బ్యాటరీతో..
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రూ. 25,000 విభాగం అత్యంత పోటీతో కూడుకున్నది. ఈ బడ్జెట్‌లో ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లను అందిస్తున్న రియల్‌మీ, నథింగ్, రెడ్‌మీ, వన్‌ప్లస్ కంపెనీల టాప్ 5 ఫోన్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి..
ప్రస్తుతం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రూ. 25,000 లోపు విభాగం యూజర్లకు స్వర్గధామంగా మారింది! ఒకప్పుడు కేవలం ఖరీదైన ఫోన్లకే పరిమితమైన బలమైన పనితీరు, నాణ్యమైన కెమెరాలు, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇప్పుడు ఈ బడ్జెట్‌లోనే అందుబాటులోకి వస్తున్నాయి. మీరు గేమర్ అయినా లేదా మంచి కెమెరా ఫోన్ కావాలనుకున్నా.. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ (రూ. 25వేల లోపు) వివరాలను ఇక్కడ చూసేయండి..
రూ. 25వేల ధరలోపు టాప్- 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్..
- వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5
వన్‌ప్లస్ నుంచి బడ్జెట్ ధరలో ప్రీమియం అనుభూతిని ఇచ్చే స్మార్ట్‌ఫోన్ ఇది.
పర్ఫార్మెన్స్: డైమెన్సిటీ 8350 అపెక్స్ చిప్‌సెట్, 6.77- ఇంచ్ 120హెచ్‌జెడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో మల్టీ టాస్కింగ్ చాలా ఈజీగా ఉంటుంది.
సాఫ్ట్‌వేర్: వన్‌ప్లస్‌కు ఉన్న అతిపెద్ద బలం ఆక్సీజెన్‌ఓఎస్. క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్, స్మూత్ యానిమేషన్లు కావాలనుకునే వారికి ఇది బెస్ట్. దీని డిజైన్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది.
2. రియల్‌మీ పి4 పవర్
ఈ ఫోన్ ప్రధానంగా భారీ బ్యాటరీ కావాలనుకునే పవర్ యూజర్ల కోసం రూపొందించబడింది.
ప్రత్యేకత: ఇందులో ఏకంగా 10,001ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో దొరికే ఫోన్లలో ఇదే అతిపెద్ద బ్యాటరీలలో ఒకటి. దీనికి తోడు 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండటంతో ఛార్జింగ్ గురించి బెంగ అక్కర్లేదు.
డిస్‌ప్లే అండ్ ప్రాసెసర్: 6.8- ఇంచ్ 144హెచ్‌జెడ్ హైపర్‌గ్లో కర్వ్‌డ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్ స్మూత్ గేమింగ్ అనుభూతిని ఇస్తాయి.
కెమెరా: 50ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ కెమెరా సెటప్ సాధారణ ఫోటోగ్రఫీకి బాగుంటుంది.
రియల్‌మీ పీ4 లైట్ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే లాంచ్ అయ్యింది. ఈ గ్యాడ్జెట్ వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
3. రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్
షియోమీ నుంచి వచ్చిన ఈ ఫోన్ అన్ని విభాగాల్లో సమతుల్యంగా ఉంటుంది.
డిస్‌ప్లే: 6.67- ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్‌ప్లే అద్భుతమైన కలర్స్ అందిస్తుంది.
బ్యాటరీ: 6200 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 90డబ్ల్యూ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ దీని ప్రత్యేకత.
కెమెరా: ఈ విభాగంలో ప్రత్యేకంగా 'టెలిఫోటో లెన్స్'ను అందిస్తూ తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది.
4. నథింగ్ ఫోన్ 3ఏ
డిజైన్ అండ్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
డిజైన్: నథింగ్ బ్రాండ్ కే ప్రత్యేకమైన గ్లిఫ్ లైటింగ్, ట్రాన్స్‌పరెంట్ డిజైన్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తాయి.
ఫీచర్లు: స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్‌సెట్, 6.77-ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉన్నాయి.
కెమెరా: ఇందులో మెయిన్, టెలిఫోటో, అల్ట్రా వైడ్ అనే మూడు ఉపయోగకరమైన కెమెరాల సెటప్ ఉంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఇది వస్తుంది.
5. రియల్‌మీ 14 ప్రో ప్లస్
పనితీరు, కెమెరా నాణ్యతను కోరుకునే వారికి రియల్‌మీ నుంచి ఇది మరో మంచి ఆప్షన్.
హార్డ్‌వేర్: ఇందులో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 6.83- ఇంచ్ కర్వ్‌డ్ ఒఎల్ఈడీ డిస్‌ప్లే ఉన్నాయి.
కెమెరా: ఈ రియల్‌మీ 14 ప్రో ప్లస్‌లో కూడా టెలిఫోటో షూటర్ ఉండటం వల్ల ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది బాగా నచ్చుతుంది.
పవర్: 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


