SUVs under 10 lakhs : రూ. 10 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు- మీ కోసం టాప్ 5 ఆప్షన్స్..
రూ. 10 లక్షల బడ్జెట్‌లో ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ఎస్యూవీ ఆప్షన్లు ఉన్నాయి. వీటిల్లో ఏది ఎంచుకోవాలి? మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుందే.. ఇది మీకోసమే. ఈ ప్రైజ్ పాయింట్లో బెస్ట్ ఆప్షన్స్‌ని ఇక్కడ చూసేయండి..
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీ ఆప్షన్స్‌కి కొదవే లేదు! మరీ ముఖ్యంగా రూ. 10లక్షల బడ్జెట్‌లో మంచి ఆప్షన్స్‌తో పాటు విపరీతమైన పోటీ నెలకొంది. మంచి ఎస్‌యూవీని ఎంచుకోవడం కస్టమర్లకు ఇప్పుడు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో (రూ.10లక్షల ధరలోపు) కేవలం బ్రాండ్ పేరు చూసి కాకుండా.. ఇంజిన్ సామర్థ్యం, ఫీచర్లు, రోజూవారీ ప్రయాణానికి ఏది సౌకర్యంగా ఉంటుందో క్షుణ్ణంగా పరిశీలించి ఈ ఐదు బెస్ట్ ఆప్షన్లను మీ ముందుకు తెస్తున్నాం.

రూ. 10లక్షల ధరలోపు బెస్ట్ ఎస్‌యూవీలు ఇవి..
1. సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్
స్పేస్, సౌకర్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారికి సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ 'ఎక్స్ ప్లస్' వేరియంట్ సరైన ఎంపిక.
ఎక్స్‌షోరూం ధర: రూ. 9.97 లక్షలు
ప్రత్యేకత: ఇది 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది (80 బీహెచ్పీ, 115 ఎన్ఎం). ఇది 7-సీటర్ కావడం విశేషం. మీరు 5-సీటర్‌గా వాడుకున్నప్పుడు భారీ బూట్ స్పేస్ లభిస్తుంది. హంగుల కంటే ప్రాక్టికాలిటీని కోరుకునే చిన్న కుటుంబాలకు ఇది బెస్ట్.
2. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ
బడ్జెట్ దాటకుండా ఆటోమేటిక్ కార్ కావాలనుకునే వారికి మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎస్‌యూవీలోని ‘ఎంఎక్స్2 ప్రో ఏటీ’ వేరియంట్ అద్భుతమైన ఆప్షన్.
ఎక్స్‌షోరూం ధర: రూ. 9.61 లక్షలు
ప్రత్యేకత: ఇందులో 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది (110 బీహెచ్పీ, 200 ఎన్ఎం). హైవే ప్రయాణాలకు సరిపోయే పవర్, సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడిపే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ దీని సొంతం. మహీంద్రా భద్రతా ప్రమాణాలు దీనికి అదనపు బలం.
3. నిస్సాన్ మాగ్నైట్
లుక్స్, స్టైల్ ముఖ్యం అనుకునే వారికి మాగ్నైట్ 'టర్బో సీవీటీ కురో ఎడిషన్' ఆకర్షణీయంగా ఉంటుంది.
ఎక్స్‌షోరూం ధర: రూ. 9.99 లక్షలు
ప్రత్యేకత: 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ (100 బీహెచ్పీ, 160 ఎన్ఎం), సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఇది వస్తుంది. ఆల్-బ్లాక్ కురో థీమ్ దీనికి స్పోర్టీ లుక్ ఇస్తుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, కనెక్టెడ్ టెక్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

4. కియా సోనెట్
అన్ని విషయాల్లోనూ సమతుల్యత కోరుకునే వారికి సోనెట్ ఎస్‌యూవీలోని 'హెచ్టీకే (ఓ+)' వేరియంట్ సరిపోతుంది.
ఎక్స్‌షోరూం ధర: రూ. 9.59 లక్షలు
ప్రత్యేకత: ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో (82 బీహెచ్పీ, 115 ఎన్ఎం) వస్తుంది. ఇది అత్యంత శక్తివంతమైనది కాకపోయినా, దీని క్యాబిన్ క్వాలిటీ, ఫినిషింగ్ చాలా ప్రీమియంగా ఉంటుంది. రోజూవారీ ప్రయాణాలకు ఇది చాలా రిఫైన్డ్ కార్.
5. స్కోడా కైలాక్
డ్రైవింగ్ ఇష్టపడే వారికి ‘క్లాసిక్+ ఏటీ’ వేరియంట్ ఒక వరం లాంటిదనే చెప్పుకోవాలి.
ఎక్స్‌షోరూం ధర: రూ. 9.25 లక్షలు
ప్రత్యేకత: 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ (115 బీహెచ్పీ, 178 ఎన్ఎం) దీనికి మంచి పవర్‌ని ఇస్తుంది. రూ. 10 లక్షల లోపే సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్వీఎం వంటి ఫీచర్లు లభించడం ఈ కారు ప్రత్యేకత.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. నా అవసరాలకు కాంపాక్ట్ ఎస్యూవీ సరిపోతుందా లేదా మిడ్-సైజ్ ఎస్యూవీ తీసుకోవాలా?
ఇది పూర్తిగా మీ ప్రయాణ తీరుపై ఆధారపడి ఉంటుంది.
కాంపాక్ట్ ఎస్యూవీ: మీరు ఎక్కువగా నగరంలో తిరుగుతూ, పార్కింగ్ సమస్యలు లేకుండా, మంచి మైలేజీని ఆశించేవారైతే కాంపాక్ట్ ఎస్యూవీ ఉత్తమం. ఇది చిన్న కుటుంబాలకు సరైన ఛాయిస్.
మిడ్-సైజ్ ఎస్యూవీ: మీది పెద్ద కుటుంబం అయి ఉండి, తరచుగా హైవేలపై సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటే మిడ్-సైజ్ ఎస్యూవీ (ఉదా: హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్) ఎంచుకోండి. వీటిలో క్యాబిన్ స్పేస్, కంఫర్ట్, ఇంజిన్ పవర్ ఎక్కువగా ఉంటాయి.
2. ఎస్యూవీ కొనేటప్పుడు సేఫ్టీ పరంగా వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి?
భద్రత విషయంలో రాజీ పడకూడదు! కారు కొనే ముందు ఈ మూడు అంశాలు తప్పక చూడండి:
ఎన్సీఏపీ రేటింగ్: కారు బాడీ ఎంత ధృడంగా ఉందో తెలిపే గ్లోబల్ ఎన్సీఏపీ లేదా భారత్ ఎన్సీఏపీ రేటింగ్ (కనీసం 4 లేదా 5 స్టార్స్) తనిఖీ చేయండి.
సేఫ్టీ ఫీచర్లు: కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ) వంటివి ప్రాథమికంగా ఉండాలి.
అడాస్ టెక్నాలజీ: నేటి కాలంలో 'అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్' (అడాస్) ఉన్న కార్లు ప్రమాదాలను ముందే పసిగట్టి అడ్డుకోగలవు. బడ్జెట్ వీలైతే దీనికి ప్రాధాన్యత ఇవ్వండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


