Family cars : త్వరలో భారత్‌లోకి రానున్న టాప్-5 7 సీటర్ ఎస్‌యూవీలు ఇవే..
Upcoming 7 Seater cars : భారతదేశంలో పెద్ద కుటుంబాలకు సరిపోయే 7 సీటర్ ఎస్‌యూవీలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టాటా, ఎంజీ, కియా, స్కోడా వంటి దిగ్గజ సంస్థలు రానున్న రోజుల్లో అత్యాధునిక ఫీచర్లతో కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఆ ఆసక్తికరమైన మోడళ్ల వివరాలు..
Tata Safari EV launch date : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం ‘బిగ్ కార్స్’ హవా నడుస్తోంది! ఎక్కువ స్థలం, విలాసవంతమైన ప్రయాణం, రోడ్డుపై గంభీరమైన లుక్ కోరుకునే వారు 7-సీటర్ ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రెండేళ్లలో మార్కెట్లోకి రానున్న ఐదు కీలకమైన త్రీ-రో ఎస్‌యూవీల జాబితాను ఇక్కడ చూసేయండి..

1. టాటా సఫారీ ఈవీ..
టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన సఫారీ మోడల్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకురానుంది. ఇది టాటా ఎలక్ట్రిక్ లైనప్‌లో హారియర్ ఈవీ కంటే పైన, అత్యంత ప్రీమియం కారుగా నిలవనుంది.
బ్యాటరీ: ఇందులో 75కేడబ్ల్యూహెచ్ లేదా అంతకంటే పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉండవచ్చు.
ఫీచర్: టాటా దీనిని ‘క్యూడబ్ల్యూడీ’ (ఏడబ్ల్యూడీ) టెక్నాలజీతో, అంటే ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లాంచ్ చేయనుంది.
2. ఎంజీ మెజెస్టర్..
టయోటా ఫార్చ్యూనర్ వంటి దిగ్గజాలకు పోటీగా ఎంజీ ‘మెజెస్టర్’ను రంగంలోకి దించుతోంది. ఇది పక్కా ఆఫ్-రోడ్ హార్డ్‌వేర్‌తో వస్తుంది.
పవర్: 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ (213 బీహెచ్పీ పవర్‌ని ఇస్తుంది).
ఫీచర్లు: త్రీ డిఫరెన్షియల్ లాక్స్, లెవల్-2 అడాస్, పనోరమిక్ సన్‌రూఫ్, మసాజ్ ఫంక్షన్ ఉన్న పవర్డ్ సీట్లు వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
3. కియా సోరెంటో..
గ్లోబల్ మార్కెట్‌లో సక్సెస్ అయిన సోరెంటో త్వరలో భారత రోడ్లపైకి రానుంది. ఇది ట్రూ ఆఫ్-రోడర్ కాకపోయినా, అత్యంత విలాసవంతమైన ఫ్యామిలీ ఎస్‌యూవీగా గుర్తింపు పొందింది.
ఇంజిన్: అంతర్జాతీయంగా ఇది 1.6 లీటర్ హైబ్రిడ్ పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. భారత్‌లో కూడా ఇవే వెర్షన్లు వచ్చే అవకాశం ఉంది.
4. స్కోడా కొడియాక్ ఆర్ఎస్..
పర్ఫార్మెన్స్ అంటే ఇష్టపడే వారి కోసం స్కోడా ‘కొడియాక్ ఆర్ఎస్’ను తెస్తోంది. ఇది కేవలం 6.3 సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
స్పెసిఫికేషన్స్: 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 261 బీహెచ్పీ పవర్, 7-స్పీడ్ డీఎస్జీ గేర్‌బాక్స్, ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) వ్యవస్థ దీని ప్రత్యేకత.
5. వూలింగ్ స్టార్‌లైట్ 560..
ఈ కారును ఎంజీ బ్రాండ్ కింద భారత్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న ‘హెక్టార్ ప్లస్’ స్థానాన్ని భర్తీ చేయవచ్చు.
హైలైట్: ఇది మొదట ‘స్ట్రాంగ్ హైబ్రిడ్’, ‘ప్లగ్-ఇన్ హైబ్రిడ్’ మోడల్స్‌లో వచ్చి, ఆ తర్వాత ఫుల్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రానుంది. మైలేజీ, స్పేస్ విషయంలో ఇది బెస్ట్ ఛాయిస్ కానుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


