MG Majestor : ఇదీ ఎంజీ మెజెస్టర్ సత్తా! ఏకంగా రైలునే లాగేసిన బడా ఎస్‌యూవీ..
MG Majestor price : ఏప్రిల్ 20న లాంచ్‌కానున్న ఎంజీ మెజెస్టర్ బడా ఎస్‌యూవీపై బిగ్ అప్డేట్! ఈ ఎస్‌యూవీ.. ఏకంగా ఒక రైలును లాగేసింది. ఈ విషయంలో ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
MG Majestor record : టెక్నాలజీ, పవర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ సంస్థ నుంచి త్వరలో విడుదల కానున్న ‘ఎంజీ మెజెస్టర్’ ఎస్‌యూవీ.. ప్రపంచంలోనే అత్యంత బరువైన రైలును లాగిన వాహనంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది!

బ్రిటిష్ కార్ల తయారీ దిగ్గజం ఎంజీ మోటార్ తన ఇంజనీరింగ్ అద్భుతాన్ని చాటిచెప్పింది. జమ్ము కాశ్మీర్‌లోని కాకాపోరా - అవంతిపోరా మధ్య ఉన్న రైల్వే ట్రాక్‌పై ఈ సాహసోపేతమైన ఫీట్‌ను నిర్వహించారు. ఒక సాధారణ ఎస్‌యూవీ ఇంత భారీ లోడ్‌ను లాగడం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఎంజీ మెజెస్టర్- 406 టన్నుల బరువు.. 300 అడుగుల దూరం!
ఈ రికార్డ్ ప్రయత్నంలో భాగంగా ఎంజీ మెజెస్టర్ ఎస్‌యూవీ ఏకంగా 406.4 టన్నుల బరువున్న రైలును 300 అడుగుల దూరం విజయవంతంగా లాగింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్దేశించిన 400 టన్నుల బరువు, 100 అడుగుల దూరం అనే ప్రాథమిక లక్ష్యాన్ని ఇది సునాయాసంగా అధిగమించడం విశేషం.
ఈ రైలులో ఒక శక్తివంతమైన డబ్ల్యూఏజీ-9హెచ్‌సీ లోకోమోటివ్‌తో పాటు ప్యాసింజర్, గార్డ్ కోచ్‌లు ఉన్నాయి. విశేషమేమిటంటే, ఈ ప్రయోగం కోసం వాడిన కారులో ఎటువంటి మార్పులు చేయలేదు! షోరూమ్‌లో లభించే సాధారణ ప్రొడక్షన్ మోడల్‌తోనే ఈ ఫీట్ సాధించడం హైలైట్.
అంటే ఇంకొన్ని నెలల్లో మీరు ఈ పవర్ఫుల్ ఎస్‌యూవీని డ్రైవ్ చేయవచ్చు.

ఎంజీ మెజెస్టర్- ఇంజన్ పవర్, పనితీరు..
మెజెస్టర్ ఎస్‌యూవీలో ఉన్న 2.0-లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఈ రికార్డుకు ప్రధాన కారణం.
పవర్: 215.5 పీఎస్
టార్క్: 478.5 ఎన్ఎం
ట్రాన్స్‌మిషన్: 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్
ఈ ఇంజన్ నుంచి వెలువడే అద్భుతమైన టార్క్, ఖచ్చితమైన ట్రాక్షన్ మేనేజ్‌మెంట్ వల్ల అంత భారీ రైలును ఎటువంటి బాహ్య సహాయం లేకుండా లాగగలిగిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఎంజీ మెజెస్టర్- ఆఫ్-రోడింగ్, సేఫ్టీ ఫీచర్లు..
కేవలం బలం మాత్రమే కాదు, టెక్నాలజీ పరంగానూ మెజెస్టర్ దూసుకుపోతోంది. ఇందులో అడ్వాన్స్‌డ్ 4డబ్ల్యూడీ సిస్టమ్ ఉంది.
ఆఫ్-రోడ్ మోడ్స్: 10 రకాల డ్రైవింగ్ మోడ్స్.
డిఫరెన్షియల్ లాక్స్: ఫ్రంట్, రియర్, సెంటర్ - ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్స్.
గ్రౌండ్ క్లియరెన్స్: 219 ఎంఎం, 810 ఎంఎం వాటర్ వేడింగ్ కెపాసిటీ.
సేఫ్టీ: లెవల్ 2 అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) రక్షణ.
"ఎంజీ మెజెస్టర్ ఇంజనీరింగ్ సామర్థ్యానికి ఈ గిన్నిస్ రికార్డ్ ఒక నిదర్శనం. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా నియంత్రణ కోల్పోకుండా శక్తిని ప్రదర్శించే వాహనాలను తయారు చేయడమే మా లక్ష్యం," అని జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా పేర్కొన్నారు.
ఎంజీ మెజెస్టర్- లాంచ్, బుకింగ్స్, ఆఫర్లు..
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తొలిసారి మెరిసిన ఈ కారును ఏప్రిల్ 20న సంస్థ అధికారికంగా లాంచ్ చేయనుంది. ధరలు కూడా అదే రోజు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం రూ. 41,000 చెల్లించి ఈ ఎస్‌యూవీని ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. మొదటి 3,000 మంది కస్టమర్లకు 'కంప్లీట్ పీస్-ఆఫ్-మైండ్' ప్యాకేజీని అందిస్తున్నారు. ఇందులో 5 ఏళ్ల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీ, 5 ఏళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 5 లేబర్-ఫ్రీ సర్వీసులు లభిస్తాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. ఎంజీ మెజెస్టర్ ఏ రికార్డును సృష్టించింది?
ప్రపంచంలోనే అత్యంత బరువైన రైలును (406.4 టన్నులు) లాగిన ఎస్‌యూవీగా ఎంజీ మెజెస్టర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది.
2. ఈ రికార్డ్ ఫీట్ ఎక్కడ జరిగింది?
జమ్ముకశ్మీర్‌లోని కాకాపోరా, అవంతిపోరా మధ్య ఉన్న రైల్వే మార్గంలో ఈ ఘనతను సాధించారు.
3. ఎంజీ మెజెస్టర్ ఇంజన్ ప్రత్యేకత ఏంటి?
ఇందులో 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 215.5 PS పవర్, 478.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
4. బుకింగ్ ఆఫర్లు ఏంటి?
రూ. 41,000తో బుక్ చేసుకున్న మొదటి 3,000 మంది వినియోగదారులకు 5 ఏళ్ల వారంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


