ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఐటీ నిపుణులు కలలుకనే ఉద్యోగాల్లో ‘గూగుల్’ మొదటి వరుసలో ఉంటుంది. అయితే, అత్యుత్తమ జీతభత్యాలు, వర్క్ కల్చర్, కెరీర్ గ్రోత్ ఉండే గూగుల్‌లో ఉద్యోగం సాధించడం అంత తేలికైన విషయమేమీ కాదు. కఠినమైన కోడింగ్ పరీక్షలతో పాటు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ రౌండ్లను దాటితేనే గూగుల్ ఆఫర్ లెటర్ చేతికి వస్తుంది.

అసలు గూగుల్ ఇంటర్వ్యూలలో అభ్యర్థులు ఎలా సమాధానాలు ఇవ్వాలి? రిక్రూటర్లు అభ్యర్థి నుంచి ఏం ఆశిస్తారు? అనే అంశాలపై న్యూయార్క్ గూగుల్ ఆఫీస్‌లో పనిచేస్తున్న సీనియర్ రిక్రూటర్ లారెన్ డెవిటో కీలక సలహాలు, సూచనలు అందించారు.
హైదరాబాద్, బెంగళూరు వంటి ఐటీ హబ్‌లలో ఉంటూ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టాప్ టెక్ కంపెనీల ఉద్యోగాలకు సిద్ధమవుతున్న మన తెలుగు వారికి ఈ టిప్స్ ఎంతో ఉపయోగపడతాయి. లారెన్ తెలిపిన వివరాల ప్రకారం.. గూగుల్ ఇంటర్వ్యూలలో ప్రధానంగా రెండు రకాల ప్రశ్నలు ఎదురవుతాయి.
1. బిహేవియోరల్ ప్రశ్నలు– 'STAR' విధానం వాడండి!
అభ్యర్థి గతంలో ఎదుర్కొన్న అనుభవాలు, పని చేసిన విధానం, సమస్యలను పరిష్కరించిన తీరును అంచనా వేయడానికి బిహేవియోరల్ ప్రశ్నలు అడుగుతారు.
ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చేటప్పుడు 'STAR' (సిట్యుయేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్) పద్ధతిని పాటించాలని లారెన్ సూచించారు.
Situation (సందర్భం): మీరు ఎదుర్కొన్న సమస్య లేదా ప్రాజెక్ట్ నేపథ్యం.
Task (లక్ష్యం): ఆ సందర్భంలో మీరు సాధించాల్సిన లక్ష్యం.
Action (చర్య): సమస్య పరిష్కారానికి మీరు స్వయంగా తీసుకున్న చర్యలు.
Result (ఫలితం): మీ పని వల్ల వచ్చిన తుది ఫలితం, గణాంకాలు (డేటా అండ్ మెట్రిక్స్).
{{/usCountry}}Result (ఫలితం): మీ పని వల్ల వచ్చిన తుది ఫలితం, గణాంకాలు (డేటా అండ్ మెట్రిక్స్).
{{/usCountry}}"ఇంటర్వ్యూయర్ మీ విజయాన్ని గణాంకాల రూపంలో చూడాలనుకుంటారు. కాబట్టి సమస్య లేదా నేపథ్యం గురించి సుదీర్ఘంగా చెప్పకుండా, మీరు స్వయంగా తీసుకున్న 'యాక్షన్', దానివల్ల వచ్చిన ఫలితాల పైనే ఎక్కువ సమయం కేటాయించాలి," అని లారెన్ స్పష్టం చేశారు.
టీమ్‌వర్క్ కన్నా 'మీ పాత్ర' ముఖ్యం!
గూగుల్‌లో టీమ్‌వర్క్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు "మేము ఈ ప్రాజెక్ట్ చేశాం, మా టీమ్ ఇది సాధించింది" అని చెప్పడం కంటే, "ఆ ప్రాజెక్ట్‌లో నా పాత్ర ఇది, నేను ఈ ఫలితాన్ని రాబట్టాను" అని స్పష్టంగా చెప్పాలి. టీమ్ సాధించిన విజయం ఆధారంగా మాత్రమే ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని అంచనా వేయలేరు. కాబట్టి మీ వ్యక్తిగత సహకారాన్ని హైలైట్ చేయడం మర్చిపోవద్దు.
2. హైపోథెటికల్ ప్రశ్నలు– ఆలోచించి సమాధానం ఇవ్వండి!
రెండోది 'హైపోథెటికల్' ప్రశ్నలు. అంటే ఒక ఊహాజనిత పరిస్థితిని మీ ముందు ఉంచి "ఒకవేళ గూగుల్‌లో మీకు ఇలాంటి సమస్య వస్తే ఎలా స్పందిస్తారు?" అని అడుగుతారు.
ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు వెంటనే హడావుడిగా సమాధానం చెప్పడం మొదలుపెట్టకూడదని లారెన్ హెచ్చరించారు.
కాసేపు విరామం తీసుకోండి: ప్రశ్నను విన్న తర్వాత కొన్ని సెకన్ల పాటు ఆలోచించండి.
నోట్ చేసుకోండి: అవసరమైతే ప్రశ్నను ఒక కాగితంపై పాయింట్లుగా రాసుకోండి.
అనుమానాలు ఉంటే అడగండి: ప్రశ్నలో ఏదైనా సందేహం ఉంటే ఇంటర్వ్యూయర్‌ను తిరిగినడిగి స్పష్టత తీసుకోండి.
ఇంటర్వ్యూను ఒక చర్చలా సాగనివ్వండి!
హైపోథెటికల్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు సుదీర్ఘమైన ఉపన్యాసంలా కాకుండా, సంభాషణలా ఉండాలి. మీ ప్రాథమిక ఆలోచనను పంచుకున్న తర్వాత, ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని ఫాలో-అప్ ప్రశ్నలు అడిగేందుకు కాస్త వ్యవధి ఇవ్వాలి. దీనివల్ల ఇంటర్వ్యూ ఒక ఏకపక్ష సమాధానంలా కాకుండా, ఇద్దరి మధ్య జరిగే ఆసక్తకరమైన చర్చలా మారుతుంది.
చివరగా, ఇంటర్వ్యూ ప్రారంభంలో చెప్పే మీ సెల్ఫ్- ఇంట్రొడక్షన్ అత్యంత కుప్తంగా, ఆకట్టుకునేలా ఉండాలని.. ఇంటర్వ్యూ ముగిసే సమయంలో కంపెనీ, రోల్ గురించి అడగటానికి కొన్ని మంచి ప్రశ్నలతో సిద్ధంగా ఉండాలని లారెన్ డెవిటో అభ్యర్థులకు సూచించారు.