ధన త్రయోదశి ఎప్పుడు? పూజా సమయం, శుభప్రదమైన కొనుగోళ్లు, నివారించాల్సిన వస్తువుల వివరాలు!

దీపావళికి ముందు జరుపుకునే ధన త్రయోదశి పండుగకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ రోజున ధన్వంతరి స్వామి, లక్ష్మీదేవి, కుబేరుడిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. బంగారం, వెండి, ఇత్తడి, రాగి, స్టీల్ పాత్రలు, చీపురు, గోమతి చక్రాలు కొనుగోలు చేయడం సంపద, ఐశ్వర్యానికి ప్రతీకలుగా నమ్ముతారు. 

Published on: Oct 29, 2026, 13:15:40 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాము. దీపావళి నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తాము. ఆ రోజు లక్ష్మీదేవికి, కుబేరుడికి ప్రత్యేకంగా పూజలు చేసి, శుభ ఫలితాలను పొందాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాము. అయితే, దీపావళికి ముందు వచ్చేది ధన త్రయోదశి కూడా చాలా విశేషమైనది.

ధన త్రయోదశి ఎప్పుడు? పూజా సమయం, శుభప్రదమైన కొనుగోళ్లు, నివారించాల్సిన వస్తువుల వివరాలు! (AI)
ధన త్రయోదశి ఎప్పుడు? పూజా సమయం, శుభప్రదమైన కొనుగోళ్లు, నివారించాల్సిన వస్తువుల వివరాలు! (AI)

చాలా చోట్ల దీపావళి పండుగను ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ధన త్రయోదశి నాడు ధన్వంతరి స్వామిని, లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజిస్తాము. ధన త్రయోదశి నాడు బంగారం, వెండి, ఇత్తడి, రాగి పాత్రలు కొనుగోలు చేసే సంప్రదాయం కూడా ఉంది. ధన త్రయోదశి నాడు కొన్ని కొత్త వస్తువులను ఇంటికి తీసుకురావడం వలన సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. అలాగే, ఆ రోజు కొన్ని వస్తువులు కొనకూడదనే సంప్రదాయం కూడా ఉంది.

ధన త్రయోదశి నాడు ఏ వస్తువులను కొనుగోలు చేయాలి? వేటిని కొనుగోలు చేయకూడదు? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే, ఈ ఏడాది ధన త్రయోదశి ఎప్పుడు వచ్చిందో కూడా చూసేద్దాం.

ధన త్రయోదశి 2026 తేదీ, సమయం

ధన త్రయోదశి ఎప్పుడు అనే కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది. ధన త్రయోదశి ఈ సంవత్సరం నవంబర్ 6, శుక్రవారం నాడు వచ్చింది. ధన త్రయోదశి తిథి ప్రారంభం విషయానికి వస్తే, నవంబర్ 6, శుక్రవారం ఉదయం 10:30కు త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. నవంబర్ 7, శనివారం ఉదయం 10:47తో ముగుస్తుంది. ఈ లెక్కన ధన త్రయోదశిని నవంబర్ 6, శుక్రవారం నాడు జరుపుకోవాలి. ఆ రోజు ఈ వస్తువులను కొనుగోలు చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే, ఈ పొరపాట్లు కూడా చేయకుండా చూసుకోండి.

వీటిని కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు

బంగారం, వెండి: ధన త్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలు చేయడం చాలా మంచిది. సంపద, ఐశ్వర్యానికి వీటిని ప్రత్యేకంగా భావిస్తారు.

ఇత్తడి, రాగి, స్టీల్ పాత్రలు: ధన త్రయోదశి నాడు ఇత్తడి, రాగి, స్టీల్ పాత్రలు కొనుగోలు చేయడం కూడా శుభ ఫలితాలను అందిస్తుంది. కొత్త పాత్రలను ఇంటికి తీసుకురావడం వలన మంచి జరుగుతుంది. వాటిని ఇంటికి తీసుకువచ్చి నీళ్లు లేదా ధాన్యాలతో నింపడం మంచిది.

చీపురు: చీపురుతో ఇంటి పరిశుభ్రత ముడిపడి ఉంటుంది. ధన త్రయోదశి నాడు చీపురును కొనుగోలు చేసే సంప్రదాయం కూడా ఉంది.

గోమతి చక్రాలు: ధన త్రయోదశి నాడు గోమతి చక్రాలను కొనుగోలు చేయడం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని నమ్ముతారు. ఈ గోమతి చక్రాలు సుఖసంతోషాలు, ఐశ్వర్యానికి చిహ్నాలుగా భావిస్తారు.

ధన త్రయోదశి నాడు ఈ తప్పులు చేయొద్దు

ధన త్రయోదశి నాడు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని నమ్ముతారు. ఆ తప్పులు ఏమిటో కూడా తెలుసుకుందాం.

ఇనుప వస్తువులు: ధన త్రయోదశి నాడు ఇనుప వస్తువులను కొనుగోలు చేయకూడదని చెబుతారు. ఇవి మంచి ఫలితాలను తీసుకురావని కొందరి నమ్మకం.

పదునైన వస్తువులు: అలాగే, ధన త్రయోదశి నాడు పదునైన వస్తువులను కొనుగోలు చేయకూడదు. అంటే కత్తులు, కత్తెరలు వంటివి కొనుగోలు చేయకూడదని సంప్రదాయం చెబుతోంది.

ఖాళీ పాత్రలు: ఖాళీ పాత్రలను ధన త్రయోదశి నాడు ఇంటికి తీసుకురావడం కూడా మంచిది కాదని భావిస్తారు.

నలుపు రంగు వస్తువులు: నలుపు రంగు వస్తువులను కూడా ధన త్రయోదశి నాడు కొనుగోలు చేయడం మంచిది కాదని కొందరు నమ్ముతారు. అవి ప్రతికూల శక్తిని, సమస్యలను తీసుకొస్తాయని భావిస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More