నవంబర్, డిసెంబర్లో పుట్టినవారికి ఈ ప్రత్యేక లక్షణాలు ఉంటాయా? అందుకే వీళ్ళు స్పెషల్!
నవంబర్, డిసెంబర్ నెలల్లో పుట్టిన వారి వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, లక్ష్యాల పట్ల నిబద్ధత గురించి ఈ కథనంలో వివరించారు. నవంబర్లో జన్మించినవారు పట్టుదల, లోతైన ఆలోచన, స్వతంత్ర నిర్ణయాలు, నమ్మకానికి ప్రాధాన్యత వంటి లక్షణాలు కలిగి ఉంటారని చెబుతారు.
మనం పుట్టిన నెల ఆధారంగా కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. పుట్టిన నెల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, వారి ప్రవర్తన తీరు ఎలా ఉంటుందనేది చెప్పొచ్చు. అంతేకాకుండా, పుట్టిన నెల ఆధారంగా వ్యక్తుల వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, లక్ష్యాల పట్ల నిబద్ధతతో పాటుగా అభివృద్ధి గురించి కూడా అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి వీలవుతుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో పుట్టిన వారు ఎలా ఉంటారు? నవంబర్, డిసెంబర్ నెలల్లో పుట్టిన వారి గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం.

నవంబర్ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు?
నవంబర్లో పుట్టిన వారు పట్టుదల, లోతైన ఆలోచనలను కలిగి ఉంటారు. అలాగే, ఏ విషయం అయినా పైపైన అర్థం చేసుకోవడంతో సరిపెట్టుకోరు. దాని వెనుక కారణాలను కూడా తెలుసుకుంటారు. ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. మరి నవంబర్లో పుట్టిన వారు ఎలా ఉంటారో పూర్తిగా చూసేయండి.
స్వతంత్రంగా ఉండాలనుకుంటారు
నవంబర్ నెలలో పుట్టిన వారు తమ నిర్ణయాలను తామే తీసుకోవాలని, జీవితానికి సంబంధించిన ఏ విషయాన్నైనా స్వతంత్రంగా వ్యవహరించాలని అనుకుంటారు. ఇతరుల అభిప్రాయాలను కూడా విన్నప్పటికీ, చివరకు తమ ఆలోచనలకే ప్రాధాన్యత ఇస్తారు.
నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యత
స్నేహం, ప్రేమ, కుటుంబ సంబంధాల్లో నిజాయితీకి విలువ ఇస్తారు. ఒకరిని నమ్మిన తర్వాత వారికి తోడుగా, అండగా నిలవడానికి నిరంతరం శ్రమిస్తారు. నమ్మకం దెబ్బతింటే మాత్రం మళ్లీ దగ్గరవడానికి చాలా సమయం పడుతుంది.
లోతుగా ఆలోచిస్తారు
ఏ విషయాన్నైనా నవంబర్ నెలలో పుట్టిన వారు లోతుగా ఆలోచిస్తారు. వాటి వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని రకాలుగా ఆలోచించి, ఆ తర్వాత మాత్రమే ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తారు.
లక్ష్య సాధన
నవంబర్లో పుట్టిన వారు లక్ష్యాల పట్ల దృఢమైన సంకల్పంతో ఉంటారు. పనిని ప్రారంభిస్తే, దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు. ఏవైనా అడ్డంకులు ఎదురైనా కూడా వెనకడుగు వేయరు.
భావాలను జాగ్రత్తగా బయటపెడతారు
తమ మనసులోని విషయాలను అందరితో పంచుకోరు. తమ భావాలను బయటపెట్టడంలో జాగ్రత్తగా ఉంటారు. బాగా దగ్గరగా ఉండే వ్యక్తులతో మాత్రమే మనసు విప్పి మాట్లాడుతారు.
వీటిని మెరుగుపరుచుకుంటే మంచిది
డిసెంబర్ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు?
డిసెంబర్ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారనేది చూస్తే, ఈ నెలలో పుట్టిన వారు నిజాయితీగా మాట్లాడతారు. పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. తమకు ఆసక్తి ఉన్న రంగంలో అభివృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తారు.
స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యత
డిసెంబర్లో పుట్టిన వారు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. కొత్త ప్రదేశాలను సందర్శించడం అంటే ఈ నెలలో పుట్టిన వారికి చాలా ఇష్టం.
ఉత్సాహంగా ఉంటారు
డిసెంబర్లో పుట్టిన వారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఆశావాదంతో ముందుకు వెళ్తారు. సమస్యలు ఎదురైనా కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలనే ఆలోచనతో ఉంటారు.
స్నేహపూర్వకంగా ఉంటారు
డిసెంబర్లో పుట్టిన వారు అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. కొత్తవారితో పరిచయాలు పెంచుకోవడం, ఇతరులతో కలిసి ఉండడం వీరిలో ఉండే ప్రత్యేక లక్షణాలు. అలాగే, స్నేహితులతో సమయాన్ని గడపడం, సరదాగా మాట్లాడడం అంటే ఈ నెలలో పుట్టిన వారికి మహా ఇష్టం.
నిజాయితీగా మాట్లాడతారు
తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచడం ఇష్టం. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకొకటి మాట్లాడడం వీరికి నచ్చదు. మాట్లాడే విధానంలో ఎదుటివారి భావాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం.
లక్ష్యాలు
భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని, కొత్త విజయాలను అందుకోవాలని ఈ నెలలో పుట్టిన వారు కోరుకుంటారు. వారికి ఆసక్తి ఉన్న రంగంలో అభివృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


