న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు వ్యాపారంలో కుబేరులవుతారు.. ఆ రాడిక్స్ సంఖ్యలు ఇవే!

న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ సంఖ్యను లెక్కించి వ్యక్తిత్వం, వృత్తి, వ్యాపార అవకాశాల గురించి సంప్రదాయపరమైన అంచనాలు వేస్తారు. ముఖ్యంగా రాడిక్స్ 1, 3, 6 సంఖ్యలకు చెందినవారు కొన్ని రకాల వ్యాపారాల్లో రాణిస్తారని నమ్ముతారు. 

Published on: Oct 24, 2026, 14:30:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రాడిక్స్ సంఖ్యల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. ఒకరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో రాడిక్స్ సంఖ్యలు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి.

న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు వ్యాపారంలో కుబేరులవుతారు.. ఆ రాడిక్స్ సంఖ్యలు ఇవే! (AI)
న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు వ్యాపారంలో కుబేరులవుతారు.. ఆ రాడిక్స్ సంఖ్యలు ఇవే! (AI)

ఈ సంఖ్యల ఆధారంగా మనిషి గురించి అనేక విషయాలను చెప్పవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారు వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు. వ్యాపారాలు మొదలుపెడితే కుబేరులుగా మారిపోతారు. మరి అలాంటి వారు ఎవరు? ఏ సంఖ్యల వారికి వ్యాపారంలో బాగా కలిసి వస్తుందో చూసేద్దాం.

ఈ సంఖ్యల వారు వ్యాపారాన్ని మొదలుపెడితే తిరుగు ఉండదు. కుబేరులుగా మారిపోతారు.

రాడిక్స్ సంఖ్య 1

ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి సంఖ్య ఒకటి అవుతుంది. సూర్యుడు అనుగ్రహంతో ఈ తేదీల్లో పుట్టిన వారు వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సూర్యుడు నాయకత్వ లక్షణాలు, ధైర్యం మొదలైన వాటికి కారకుడు.

ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో అద్భుతంగా రాణించగలరు. కన్సల్టెన్సీ, మేనేజ్‌మెంట్, జ్యువెలరీ, ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌లలో బాగా సంపాదించి ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

రాడిక్స్ సంఖ్య 3

ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి సంఖ్య మూడు అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి గురువు. గురువు అనుగ్రహంతో ఈ తేదీల్లో పుట్టిన వారు జ్ఞానాన్ని బాగా సంపాదిస్తారు. ఈ సంఖ్య వారు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆగిపోరు.

రిస్క్ తీసుకోవడానికి కూడా ఏమాత్రం ఆలోచించరు. తప్పుల నుంచి బాగా నేర్చుకుంటారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌ను కలిగి ఉంటారు. ఏ వ్యాపారంలో అయినా పర్ఫెక్ట్‌గా రాణించగలరు. స్టేషనరీ, పుస్తకాలు మొదలైన వ్యాపారాల్లో బాగా రాణించగలరు.

రాడిక్స్ సంఖ్య 6

ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి సంఖ్య 6 అవుతుంది. శుక్రుడు సంపద, విలాసాలు, డబ్బు మొదలైన వాటికి కారకుడు. ఈ సంఖ్య వారు వస్తువులను ఆకర్షణీయంగా ప్రదర్శించగలరు.

వ్యాపార రంగాల్లో ఈ తేదీల్లో పుట్టిన వారికి తిరుగు ఉండదు. ఫ్యాషన్, బ్యూటీ వంటివి ఈ సంఖ్య వారికి బాగా కలిసి వస్తాయి. ఇంటీరియర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన బిజినెస్‌లలో కుబేరులుగా మారతారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More