అక్టోబర్, నవంబర్‌లో పుట్టిన వారు ఎలా ఉంటారు? ప్రేమ జీవితం, కెరీర్, ఆసక్తులు గురించి పూర్తి వివరాలు!

పుట్టిన తేదీతో పాటు పుట్టిన నెల ఆధారంగా కూడా వ్యక్తిత్వంలోని కొన్ని లక్షణాలను తెలుసుకోవచ్చని జ్యోతిష్యం, నెలవారీ జన్మ విశ్లేషణలు చెబుతున్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో జన్మించిన వారి ఆలోచనా విధానం, సంబంధాలను చూసే తీరు, నిర్ణయాలు తీసుకునే విధానం ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొంటారు. 

Published on: Sep 25, 2026, 12:31:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

పుట్టిన తేదీ ఆధారంగా ఎలా అయితే ఒక మనిషి వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటామో, పుట్టిన నెల ఆధారంగా కూడా అలాగే తెలుసుకోవచ్చు. మీరు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో పుట్టారా? అయితే కచ్చితంగా మీ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి.

అక్టోబర్, నవంబర్‌లో పుట్టిన వారు ఎలా ఉంటారు? ప్రేమ జీవితం, కెరీర్, ఆసక్తులు గురించి పూర్తి వివరాలు! (AI)
అక్టోబర్, నవంబర్‌లో పుట్టిన వారు ఎలా ఉంటారు? ప్రేమ జీవితం, కెరీర్, ఆసక్తులు గురించి పూర్తి వివరాలు! (AI)

ప్రతి వ్యక్తిత్వం వారి అనుభవాలు, పెంపకం, పరిసరాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే జ్యోతిష్యం, నెలవారీ జన్మ విశ్లేషణ ప్రకారం అక్టోబర్, నవంబర్ నెలలో జన్మించిన వారికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వారి ఆలోచనా విధానం, సంబంధాలను చూసే తీరు, నిర్ణయాలు తీసుకునే విధానం ఇతరుల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. మీరు కూడా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో పుట్టారా? అయితే కచ్చితంగా మీ గురించి ఇది తెలుసుకోవాలి.

అక్టోబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది?

అక్టోబర్ నెలలో పుట్టిన వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఉంటారు. ఇతరులతో సులువుగా కలిసిపోతారు. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరిస్తారు. సులువుగా వారిని ఇట్టే మార్చేసుకోగలరు.

సామాజికంగా చురుకుగా ఉంటారు

అక్టోబర్ నెలలో పుట్టిన వారు సామాజికంగా చురుకుగా ఉంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తారు.

సమతుల్య ఆలోచనా విధానం

అక్టోబర్ నెలలో పుట్టిన వారు ఏదైనా విషయంపై వెంటనే నిర్ణయం తీసుకోరు. రెండు వైపుల నుంచి ఆలోచించే స్వభావంతో ఉంటారు. సమస్యల్ని ప్రశాంతంగా పరిష్కరించడానికి ఇష్టపడతారు.

అందం, కళలపై ఆసక్తి

అక్టోబర్‌లో పుట్టిన వారు అందం, కళలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. సంగీతం, కళలు, ఫ్యాషన్, సృజనాత్మక రంగాలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

నిర్ణయాల్లో ఆలస్యం

ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు కాబట్టి కాస్త టైం పడుతుంది. వెంటనే నిర్ణయాలు తీసుకుని బాధపడడానికి ఇష్టపడరు.

సంబంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు

అక్టోబర్ నెలలో పుట్టిన వారు వారి భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వారిపై శ్రద్ధ పెడతారు. నమ్మకం, పరస్పర గౌరవం ఉన్న సంబంధాలను ఎక్కువగా కోరుకుంటారు.

నవంబర్ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు?

మీరు నవంబర్ నెలలో పుట్టారా? అయితే మీరు లోతైన ఆలోచనలను కలిగి ఉంటారు. అలాగే నవంబర్ నెలలో పుట్టిన వారు పట్టుదలతో ఉంటారు. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దానికోసం ఎంతగానో కష్టపడతారు.

బలమైన సంకల్పం

నవంబర్‌లో పుట్టిన వారు బలమైన సంకల్పంతో ఉంటారు. ఎదురయ్యే సమస్యలను సులువుగా పరిష్కరిస్తారు. వెనుకడుగు వేయరు. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని సాధించే వరకు నిద్రపోరు.

విషయాలను లోతుగా అర్థం చేసుకుంటారు

భావోద్వేగాలను బయటపడటంలో జాగ్రత్తగా ఉంటారు. మనసులో ప్రతి విషయాన్ని అందరితో షేర్ చేసుకోరు. ఎవరిని నమ్మాలో నిర్ణయించుకుని, ఆ తర్వాత మాత్రమే వ్యక్తిగత విషయాలను ఇతరులతో షేర్ చేసుకుంటారు.

విశ్వాసానికి ఎక్కువ ప్రాధాన్యత

సంబంధాల్లో నమ్మకం వీరికి చాలా ముఖ్యమైనది. ఒకసారి ఎవరినైనా నమ్మితే వారికి అండగా నిలబడడానికి ప్రయత్నం చేస్తారు.

లక్ష్యసాధనపై దృష్టి

నవంబర్ నెలలో పుట్టిన వారు కెరీర్, వ్యక్తిగత జీవితంలో, వ్యాపారంలో ఇలా ఏదైనా సరే స్పష్టమైన లక్ష్యాలు ఉంటే, వాటినే సాధించేదాకా క్రమశిక్షణతో పని చేస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More