చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు ఎంట్రీ - ఈ 4 రాశుల వారికి డిసెంబర్ 5 వరకు ఆకస్మిక ధనలాభం! పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్

కుజుడికి చెందిన చిత్తా నక్షత్రంలోకి శుక్ర గ్రహం ప్రవేశించింది. డిసెంబర్ 5 వరకు సాగే ఈ సంచారం వల్ల 4 రాశుల వారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడంతో పాటు ఆకస్మిక ధనలాభం కలగనుంది.

Published on: Oct 25, 2026, 07:47:47 IST
By , नई दिल्ली
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రంలో ప్రేమ, ఐశ్వర్యం, కీర్తి, కళలకు కారకుడైన శుక్ర గ్రహ సంచారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. జాతకంలో శుక్రుడి అనుగ్రహం ఉంటే నిలిచిపోయిన పనులు కూడా వేగంగా పూర్తవుతాయి. ప్రస్తుతం శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలో సంచరిస్తూ…. తన నక్షత్ర గమనాన్ని మార్చుకున్నాడు.

చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు
చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు

హిందూ పంచాంగం ప్రకారం…. అక్టోబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3:11 గంటలకు శుక్రుడు కుజ గ్రహానికి చెందిన చిత్రా నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ నక్షత్రంలో శుక్రుడి సంచారం డిసెంబర్ 5వ తేదీ ఉదయం వరకు, అంటే దాదాపు 42 రోజుల పాటు కొనసాగనుంది.

ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం…. ఈ నక్షత్ర మార్పు వల్ల 4 రాశుల వారికి అపారమైన ఆర్థిక లాభాలతో పాటు సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి….

కుంభ రాశి

చిత్తా నక్షత్రంలో శుక్రుడి సంచారం కుంభ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో వీరి ప్రేమ జీవితం చాలా అందంగా, ఆహ్లాదకరంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు లభించి భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మిథున రాశి

మిథున రాశి జాతకులకు శుక్రుడి నక్షత్ర మార్పు అత్యంత అనుకూల ఫలితాలను ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపేందుకు విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యక్తిగత జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభూతి లేదా మలుపు చోటుచేసుకుంటుంది.

తులా రాశి

స్వక్షేత్రమైన తులా రాశిలోనే శుక్రుడు సంచరిస్తూ నక్షత్ర మార్పు చెందడం ఈ రాశి వారికి విశేషమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా కళారంగం, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు మంచి శుభవార్తలు వింటారు. నిలిచిపోయిన సొమ్ము చేతికి అంది ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ 42 రోజుల కాలం సానుకూల వాతావరణాన్ని తెస్తుంది. జీవితంలో ఆశావాదం, ఉత్సాహం పెరుగుతాయి. భాగస్వామితో శృంగారం, అనుబంధం మరింత బలపడతాయి. విభిన్న మార్గాల ద్వారా ఆదాయం పెరిగి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More