వాషింగ్టన్: అమెరికాలోని వలసదారులపై, హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములపై ట్రంప్ యంత్రాంగం కఠిన నిబంధనలతో విరుచుకుపడింది. వర్క్ పర్మిట్ (ఈఏడీ) రెన్యూవల్ కోసం వేచి చూసే దరఖాస్తుదారులకు లభించే 540 రోజుల ఆటోమేటిక్ గడువు పొడిగింపును రద్దు చేస్తూ అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (డీహెచ్ఎస్) తుది ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 14న ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురితమైన ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగుల కుటుంబాలు, ఆశ్రయం పొందుతున్న వలసదారులు ఆందోళనలో మునిగిపోయారు.
హెచ్-4 వీసాదారులు, భారతీయులపై తీవ్ర ప్రభావం
గతంలో జో బైడెన్ హయాంలో యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) లో దరఖాస్తుల పరిశీలన ఆలస్యమైనప్పుడు విదేశీ వర్కర్ల ఉద్యోగాలు పోకుండా ఉండేందుకు 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపు వెసులుబాటు కల్పించారు. అయితే, ఆ నిర్ణయాన్ని ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. దీనివల్ల హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములు (హెచ్-4 వీసాదారులు), ఆశ్రయం కోరుకునే వలసదారులు ప్రభావితం కానున్నారు. దరఖాస్తుదారుల బ్యాక్గ్రౌండ్ చెకింగ్, భద్రతా తనిఖీలను తరచుగా నిర్వహించేందుకే ఈ వెసులుబాటును తొలగించామని డీహెచ్ఎస్ తెలిపింది.
పెండింగ్లో 4.3 లక్షల దరఖాస్తులు.. పెరగనున్న ఉద్యోగ ముప్పు
వర్క్ పర్మిట్ గడువు ముగియడానికి 180 రోజుల ముందు మాత్రమే రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది. అయితే, యూఎస్సీఐఎస్ వద్ద దరఖాస్తుల ప్రాసెసింగ్ నెమ్మదిగా సాగుతుండటంతో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. 2026 జూన్ 30 నాటికి లభించిన అధికారిక గణాంకాల ప్రకారం, ఆరు నెలలకు పైగా పెండింగ్లో ఉన్న వర్క్ పర్మిట్ రెన్యూవల్ దరఖాస్తుల సంఖ్య 4,32,000 దాటింది. ఇందులో 91,000 కి పైగా దరఖాస్తులు 18 నెలలకు పైగా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు 540 రోజుల పొడిగింపును రద్దు చేయడంతో, కొత్త పర్మిట్ చేతికి వచ్చే వరకు ఉద్యోగులు పని చేసే హక్కును కోల్పోయి, ఉద్యోగాలు వదులుకోవాల్సి వచ్చే ప్రమాదం ఏర్పడింది.
కోర్టును ఆశ్రయించిన బాధితులు
ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హెచ్-4 వీసాదారులు జనవరిలోనే ఫెడరల్ కోర్టులో దావా వేశారు. దరఖాస్తుదారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా, సరైన విధానపరమైన నిబంధనలు పాటించకుండా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు తెచ్చిందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కాలిఫోర్నియా ఫెడరల్ న్యాయమూర్తి గత సెప్టెంబర్లో పిటిషనర్లకు తాత్కాలిక ఊరటనిస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపివేశారు. అయితే ప్రభుత్వం తన తుది నిబంధనను ఇప్పుడు ఖరారు చేసింది.
శరణార్థుల సమయం 10 రోజులకు కుదింపు
{{/usCountry}}ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హెచ్-4 వీసాదారులు జనవరిలోనే ఫెడరల్ కోర్టులో దావా వేశారు. దరఖాస్తుదారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా, సరైన విధానపరమైన నిబంధనలు పాటించకుండా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు తెచ్చిందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కాలిఫోర్నియా ఫెడరల్ న్యాయమూర్తి గత సెప్టెంబర్లో పిటిషనర్లకు తాత్కాలిక ఊరటనిస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపివేశారు. అయితే ప్రభుత్వం తన తుది నిబంధనను ఇప్పుడు ఖరారు చేసింది.
శరణార్థుల సమయం 10 రోజులకు కుదింపు
{{/usCountry}}మరొక కఠిన చర్యలో భాగంగా, శరణార్థుల (రిఫ్యూజీ) హోదా రద్దును సవాలు చేసేందుకు ఇచ్చే గడువును 30 రోజుల నుంచి 10 రోజులకు కుదించారు. బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంపై శరణార్థుల హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేవలం 10 రోజుల వ్యవధిలో న్యాయవాదిని సంప్రదించి, అవసరమైన పత్రాలను సమర్పించడం సాధ్యం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైడెన్ హయాంలో ఆమోదం పొందిన సుమారు 1,85,000 మంది శరణార్థుల గ్రీన్ కార్డ్ దరఖాస్తులను మళ్లీ సమీక్షిస్తున్నట్లు సమాచారం.
'అమెరికా ఫస్ట్' అజెండాతో ఆంక్షల పర్వం
గత ఏడాది రెండోసారి శ్వేతసౌధంలో బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్, తన 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' (MAGA), 'అమెరికా ఫస్ట్' విధానాల్లో భాగంగా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. శరణార్థుల ప్రవేశాలను నిలిపివేయడం, కొన్ని నిర్దిష్ట దేశాల పౌరులపై ఆంక్షలు విధించడమే కాకుండా, కొత్త హెచ్-1బీ పిటిషన్లపై 1,00,000 డాలర్ల రుసుము చెల్లించాలనే నిబంధనను కూడా తెచ్చారు. తాజాగా వర్క్ పర్మిట్ గడువు తగ్గింపు నిర్ణయం విదేశీ వృత్తి నిపుణులపై భారాన్ని మోపింది.