Electric bike : టీవీఎస్ నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్- అపాచీ రేంజ్ పర్ఫార్మెన్స్తో..
టీవీఎస్ మోటార్స్ తన తొలి ఎలక్ట్రిక్ బైక్ 'ఈఎఫ్ఎక్స్ 3ఓ'ని భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అపాచీ ఆర్టీఆర్ 310కి ధీటుగా, అత్యాధునిక డిజైన్, ప్రీమియం ఫీచర్లతో రానున్న ఈ బైక్ విశేషాలు మీకోసం.
భారతీయ టూ వీలర్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన టీవీఎస్ మోటార్ కంపెనీ.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విభాగం కోసం భారీ స్కెచ్ వేస్తోంది. అటు పెట్రోల్ ఇంజిన్లతో పాటు ఇటు ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను కూడా సమాంతరంగా విస్తరించే పనిలో పడింది. ఇందులో భాగంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మోడల్ 'TVS eFX 3O'. గతేడాది మిలన్‌లో జరిగిన ఐఈసీఎంఏ 2025లో కాన్సెప్ట్ రూపంలో మెరిసిన ఈ బైక్, ఇప్పుడు భారత్‌లో ఉత్పత్తికి సిద్ధమవుతోంది.

డిజైన్ పేటెంట్ ఫైలింగ్.. లాంచ్ ఎప్పుడు?
టీవీఎస్ కంపెనీ ఇటీవల ఈ ఈఎఫ్ఎక్స్ 3ఓ ఎలక్ట్రిక్ బైక్‌కు సంబంధించి భారత్‌లో డిజైన్ పేటెంట్‌కు ఫైల్ చేసింది. ఇది భారత్‌లో టీవీఎస్ నుంచి రానున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కానుంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో ఈ బైక్ అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
అయితే పేటెంట్ అయిన ప్రతి బైక్ ప్రొడక్షన్ వరకు వెళ్లాలన్న రూల్ ఏమీ లేదు.
టీవీఎస్ ఎలక్ట్రిక్ బైక్- ఫ్యూచరిస్టిక్ లుక్.. అదిరిపోయే డిజైన్
పేటెంట్ చిత్రాలను గమనిస్తే.. ఈ టీవీఎస్ ఈఎఫ్ఎక్స్ 3ఓ ఎలక్ట్రిక్ బైక్ చాలా షార్ప్‌గా, మోడ్రన్ లుక్‌తో కనిపిస్తోంది. ముఖ్యంగా దీని రెక్టాంగ్యులర్ హెడ్‌ల్యాంప్ సెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బైక్ ముందు భాగంలో యూఎస్డీ ఫోర్కులు ఉన్నాయి. ఇక ఎలక్ట్రిక్ బైక్ అని స్పష్టంగా తెలిసేలా పెద్ద బ్యాటరీ ప్యాక్ కూడా కనిపిస్తోంది. దీనికి ఫెయిరింగ్ పూర్తిగా కవర్ చేయకుండా, కాస్త బయటకు కనిపించేలా డిజైన్ చేయడం విశేషం. వెనుక వైపు సాలిడ్ వీల్, బెల్ట్ డ్రైవ్, స్వింగ్ ఆర్మ్ సెటప్‌ను టీవీఎస్ ఇచ్చింది. మెరుగైన కూలింగ్, పనితీరు కోసం ఇందులో మిడ్-మౌంటెడ్ మోటార్‌ను వాడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల టాక్.
టీవీఎస్ ఎలక్ట్రిక్ బైక్- స్పోర్టీ రైడింగ్.. మెరుగైన ఎయిరోడైనమిక్స్..
గాలి ఒత్తిడిని తట్టుకుని వేగంగా దూసుకెళ్లేలా ఈ బైక్ బాడీని మలిచారు. ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ కేవలం స్టైల్ కోసం మాత్రమే కాదు, వేగాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. హ్యాండిల్ బార్ కొంచెం కిందకు ఉండటం, సింగిల్ సీట్ ఆప్షన్ వంటివి రైడర్‌కు ఒక అగ్రెసివ్ స్పోర్ట్స్ బైక్ ఫీలింగ్‌ను ఇస్తాయి. డాష్ బోర్డ్ విషయానికొస్తే.. చాలా సింపుల్‌గా ఉండే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. నావిగేషన్ కోసం ఎడమ వైపు స్పెషల్ స్విచ్ గేర్‌ను కూడా జోడించారు.
టీవీఎస్ ఎలక్ట్రిక్ బైక్- సేఫ్టీ ఫీచర్లు.. సస్పెన్షన్
ఈ ఎలక్ట్రిక్ బైక్ వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. గ్రిప్, బ్యాలెన్స్ కోసం వెనుక వైపు వెడల్పాటి టైర్లను అమర్చారు. రెండు వైపులా పెటల్ డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఫీచర్‌ను స్టాండర్డ్‌గా అందించనున్నారు. భద్రత విషయంలో టీవీఎస్ ఎక్కడా రాజీ పడలేదని దీని ద్వారా అర్థమవుతోంది.
టీవీఎస్ ఎలక్ట్రిక్ బైక్- ధర ఎంత ఉండొచ్చు?
ప్రస్తుతానికి ఈ టీవీఎస్ ఈఎఫ్ఎక్స్ 3ఓ సాంకేతిక వివరాలు పూర్తిగా బయటకు రాలేదు. కాగా ఈ బైక్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310కి ప్రీమియం ఎలక్ట్రిక్ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పర్యావరణ హితంతో పాటు స్పోర్టీ లుక్ కోరుకునే కుర్రకారును ఈ బైక్ ఆకట్టుకుంటుంది. మార్కెట్ అంచనాల ప్రకారం దీని ధర సుమారు రూ. 2 లక్షల వరకు ఉండవచ్చు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా ఇది మార్కెట్లోకి వస్తే, టీవీఎస్ ప్రస్థానంలో ఇదొక కీలక మలుపు అవుతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


