ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) ఏప్రిల్-జూన్ (Q1) త్రైమాసికానికి సంబంధించి సంచలన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. మంగళవారం (జూలై 21, 2026) మార్కెట్ వేళల్లో కంపెనీ తన నివేదికను విడుదల చేసింది.

గతేడాది ఇదే సమయంలో రూ.610.04 కోట్లుగా ఉన్న కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం, ఈసారి ఏకంగా 67.1 శాతం పెరిగి రూ.1,019.43 కోట్లకు చేరింది. గడిచిన మార్చి త్రైమాసికంలో (Q4FY26) ఉన్న రూ.771.52 కోట్లతో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన (QoQ) లాభం 32.1 శాతం వృద్ధి చెందింది.
ఆదాయంలో 33.5% వృద్ధి
జూన్ త్రైమాసికంలో ఆపరేషన్స్ ద్వారా వచ్చే ఆదాయం 33.5 శాతం పెరిగి రూ.16,295.52 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో ఇది రూ.12,210.05 కోట్లుగా ఉంది. ఇక గత మార్చి త్రైమాసికంలోని రూ.15,052.73 కోట్లతో పోలిస్తే ఆదాయం 8.3 శాతం పెరిగింది.
మరోవైపు, వ్యాపార విస్తరణ, నిధుల సమీకరణలో భాగంగా రూ.1,000 కోట్ల వరకు నిధులను నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు (NCDs), కమర్షియల్ పేపర్లు (CPs) లేదా ఇతర మార్గాల ద్వారా సమీకరించేందుకు టివిఎస్ మోటార్స్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.
క్యూ1 ఫలితాల ప్రధాన ముఖ్యాంశాలు
అత్యధిక ఎబిట్డా (EBITDA): కంపెనీ ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా రూ.1,779 కోట్ల ఎబిట్డాను సాధించింది (41.2% పెరుగుదల). ఎబిట్డా మార్జిన్ గతేడాది ఉన్న 12.5% నుంచి 30 బేసిస్ పాయింట్లు పెరిగి 12.8%కి మెరుగైంది.
ఆల్-టైమ్ రికార్డ్ విక్రయాలు: జూన్ త్రైమాసికంలో టివిఎస్ మోటార్స్ చరిత్రలోనే అత్యధికంగా 16.3 లక్షల వాహనాలను (ద్విచక్ర + త్రిచక్ర) విక్రయించింది. గతేడాది ఇది 12.8 లక్షలుగా ఉండేది (28% వృద్ధి).
{{/usCountry}}ఆల్-టైమ్ రికార్డ్ విక్రయాలు: జూన్ త్రైమాసికంలో టివిఎస్ మోటార్స్ చరిత్రలోనే అత్యధికంగా 16.3 లక్షల వాహనాలను (ద్విచక్ర + త్రిచక్ర) విక్రయించింది. గతేడాది ఇది 12.8 లక్షలుగా ఉండేది (28% వృద్ధి).
{{/usCountry}}బైక్‌లు & స్కూటర్ల హవా: మోటార్ సైకిళ్ల విక్రయాలు 19% పెరిగి 7.4 లక్షల యూనిట్లకు చేరగా, స్కూటర్ల విక్రయాలు ఏకంగా 36% ఎగబాకి 6.8 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి.
ఈవీ విభాగం దూకుడు (86% జంప్): ఎలక్ట్రిక్ టూ-వీలర్ విక్రయాలు భారీగా పెరిగాయి. గతేడాది క్యూ1లో 70,060 యూనిట్లుగా ఉన్న ఈవీ విక్రయాలు ఈసారి ఏకంగా 86% పెరిగి 1,29,940 యూనిట్లకు చేరాయి. దీనితో టివిఎస్ ఈవీ వాహన కొనుగోలుదారుల సంఖ్య 10 లక్షల దాటింది.
ఎగుమతులు & త్రీ-వీలర్స్: అంతర్జాతీయ మార్కెట్లలో సంస్థ విక్రయాలు 33% పెరిగి 4.7 లక్షల యూనిట్లకు చేరాయి. అలాగే త్రిచక్ర వాహనాల విక్రయాలు 48% వృద్ధితో 66,697 యూనిట్లుగా నమోదయ్యాయి.