Bajaj Chetak vs TVS iQube : రెండు బెస్ట్​ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు- దేని ఈఎంఐ తక్కువ?

Electric scooters : ఈవీ మార్కెట్‌లో టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ మధ్య గట్టి పోటీ నెలకొంది. పెట్రోల్ ధరల భారం, ఈ20 ఇంధన గందరగోళం వల్ల వీటి విక్రయాలు పెరుగుతున్నాయి. వేరియంట్‌ను బట్టి నెలకు ఎంత ఇఎంఐ కట్టాలో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jul 21, 2026, 14:31:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో గత కొన్నేళ్లుగా డిమాండ్‌తో పాటు విక్రయాలు కూడా భారీగా పుంజుకుంటున్నాయి. నిరంతరం పెరుగుతున్న పెట్రోల్ ధరలు, వాహన నిర్వహణ వ్యయం భారంగా మారడం, అలాగే ఈ20 ఇంధన ప్రభావంపై వాహనదారుల్లో ఉన్న సందేహాలు, భయాలు.. వినియోగదారులను ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వైపు వేగంగా నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత మార్కెట్‌లో సుదీర్ఘకాలంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ ముందంజలో ఉన్నాయి.

రెండు ఈవీల్లో దేని ఈఎంఐ తక్కువ?
రెండు ఈవీల్లో దేని ఈఎంఐ తక్కువ?

రోజువారీ ప్రయాణాలకు అత్యంత సౌకర్యవంతంగా, ప్రాక్టికల్ డిజైన్‌తో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్​గా ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టీవీఎస్ రూపొందించగా, అది ఐక్యూబ్‌గా ప్రాచుర్యం పొందింది. మరోవైపు బజాజ్ చేతక్ క్లాసిక్ వింటేజ్ లుక్‌తో వస్తూనే, నిత్యం ఆఫీసులు, పనులకు వెళ్లేవారికి తగ్గట్టుగా సమర్థవంతమైన ఫీచర్లను అందిస్తోంది.

మీరు కూడా ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తూ, ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలో అర్థం కాక ఆలోచిస్తుంటే, వీటి మధ్య ఉన్న నెలవారీ ఇఎంఐ వివరాలు, ఆర్థిక గణాంకాలు మీకోసం:

బజాజ్ చేతక్ వర్సెస్ టీవీఎస్ ఐక్యూబ్: నెలకు ఇఎంఐ ఎంత కట్టాలి?

బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ల నెలవారీ ఇఎంఐని లెక్కించడానికి రెండింటికి సంబంధించిన బేస్ (ప్రారంభ), టాప్ వేరియంట్లను ప్రామాణికంగా తీసుకుందాము. ఈ లెక్కల కోసం వార్షిక వడ్డీ రేటును 9.5 శాతంగా, ఎక్స్-షోరూమ్ ధరలో 100 శాతం రుణ సదుపాయాన్ని పొందినట్లుగా, రీపేమెంట్ గడువును 24 నెలలుగా (2 ఏళ్లు) లెక్కించాము.

బజాజ్ చేతక్ వర్సెస్ టీవీఎస్ ఐక్యూబ్- నెలవారీ ఈఎంఐలు ఇలా..
మోడల్- వేరియంట్లోన్ (ఎక్స్​షోరూం ధరపై 100%)వడ్డీ రేటురీపేమెంట్ టెన్యూర్నెలవారీ ఈఎంఐ
చేతక్ సీ2501రూ. 95,8029.5%24 నెలలురూ. 4,399
చేతక్ సీ3501రూ. 152,140రూ. 6,985
ఐక్యూబ్ 2.2 కేడబ్ల్యూహెచ్రూ. 94,434రూ. 4,322
ఐక్యూబ్ ఎస్​టీ 5.3 కేడబ్ల్యూహెచ్రూ. 158,834రూ. 7,293

ఈ అంచనాల ప్రకారం:

బజాజ్ చేతక్: మీరు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి నెలవారీ ఇఎంఐ సుమారు రూ. 4,399 నుంచి రూ. 6,985 వరకు ఉంటుంది.

టీవీఎస్ ఐక్యూబ్: మోడల్ వేరియంట్‌ను బట్టి నెలవారీ ఇఎంఐ రూ. 4,322 నుంచి రూ. 7,293 వరకు చెల్లించాల్సి వస్తుంది.

అయితే, మీరు తీసుకునే రుణ మొత్తం, చెల్లించే డౌన్ పేమెంట్, బ్యాంక్ విధించే వడ్డీ రేటు, అలాగే ఎంచుకునే రీపేమెంట్ కాలవ్యవధి ఆధారంగా మీ నెలవారీ ఇఎంఐ మొత్తంలో మార్పులు ఉంటాయని గమనించాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More