TVS Ntorq 150 Spectral Green : టీవీఎస్ ఎన్‌టార్క్ 150 కొత్త వర్షన్.. స్పెక్ట్రల్ గ్రీన్ లాంచ్!

ప్రముఖ టూవీలర్ సంస్థ టీవీఎస్ మోటార్ తమ ఫ్లాగ్‌షిప్ స్కూటర్ ఎన్‌టార్క్ 150లో సరికొత్త 'స్పెక్ట్రల్ గ్రీన్' కలర్ ఆప్షన్‌ను లాంచ్ చేసింది. రూ. 1.22 లక్షల ధరలో అందుబాటులోకి వచ్చిన ఈ స్కూటర్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Nov 10, 2026, 17:03:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

యువతను విపరీతంగా ఆకట్టుకునే స్పోర్టీ స్కూటర్ల విభాగంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్ కంపెనీ'.. మరో సంచలన అప్‌డేట్‌ను అందించింది. తమ ప్రాచుర్యం పొందిన ఫ్లాగ్‌షిప్ స్కూటర్ ‘టీవీఎస్ ఎన్‌టార్క్ 150’ మోడల్‌లో సరికొత్త ‘స్పెక్ట్రల్ గ్రీన్’ కలర్ ఆప్షన్‌ను శ్రేణిలోకి ప్రవేశపెట్టింది. గతంలో జూపిటర్ మోడల్‌కు అందించిన తరహాలోనే ఈ నూతన రంగును కూడా టీవీఎస్ డిజైన్ చేసింది.

టీవీఎస్ ఎన్​టార్క్ 150 స్పెక్ట్రల్ గ్రీన్
టీవీఎస్ ఎన్​టార్క్ 150 స్పెక్ట్రల్ గ్రీన్

దిల్లీ ఎక్స్-షోరూమ్ వద్ద ఈ కొత్త వర్షన్ ధరను రూ. 1.22 లక్షలుగా నిర్ణయించారు. ఎన్‌టార్క్ 150 మార్కెట్లో అడుగుపెట్టి ఏడాదినర దాటిన సందర్భంగా అగ్రశ్రేణి టీఎఫ్‌టీ వేరియంట్‌లో ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఈ రంగు అందుబాటులోకి తెచ్చారు.

ఇప్పటికే యామహా ఏరాక్స్ 155, అప్రిలియా ఎస్ఆర్ 175, హీరో జూమ్ 160 వంటి స్కూటర్లు రేసులో ఉండగా, టీవీఎస్ తీసుకువచ్చిన ఈ కొత్త డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ యువతకు సరికొత్త ఎంపికగా నిలవనుంది.

స్పెక్ట్రల్ గ్రీన్ డిజైన్ ప్రత్యేకతలు..

నూతన స్పెక్ట్రల్ గ్రీన్ కలర్ వేరియంట్‌లో డార్క్ ఆలివ్ గ్రీన్ బేస్ రంగుపై ఫ్లోరోసెంట్ యెల్లో యాక్సెంట్లను అమర్చారు. ఫ్రంట్ మడ్‌గార్డ్, వెనుక బాడీ ప్యానెళ్లపై ఈ మెరుపు పసుపు రంగు మెరుస్తుంది. సైడ్ ప్యానెళ్లపై గ్రే, ఎల్లో షేడ్స్‌లో ఎన్‌టార్క్ 150 గ్రాఫిక్స్ ఆకట్టుకుంటున్నాయి. వీల్స్‌కు గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల ఇదివరకు వచ్చిన బ్రైట్ కలర్స్ కంటే భిన్నమైన రోడ్ ప్రజెన్స్ దీని సొంతమవుతుంది.

ఈ కొత్త వర్షన్ రాకతో ఎన్‌టార్క్ 150 టీఎఫ్‌టీ శ్రేణిలో మొత్తం నాలుగు రంగులు (స్పెక్ట్రల్ గ్రీన్, నైట్రో గ్రీన్, రేసింగ్ రెడ్, టర్బో బ్లూ) కస్టమర్లకు లభిస్తాయి.

పవర్‌ఫుల్ ఇంజిన్.. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్

టీవీఎస్ ఎన్​టార్క్ 105 స్పెక్ట్రల్ గ్రీన్ స్కూటర్ ఇంజిన్ పరంగా కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో నమ్మకమైన 149.7 సిసి సింగిల్-సిలిండర్, 3-వాల్వ్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు.

పవర్ గణాంకాలు: ఈ ఇంజిన్ 7,000 ఆర్‌పీఎం వద్ద 13.2 పీఎస్ పవర్‌ను, 5,500 ఆర్‌పీఎం వద్ద 14.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వేగం, ట్రాన్స్‌మిషన్: దీనికి సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేశారు. కేవలం 6.3 సెకన్లలోనే 0 నుంచి 60 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 104 కిలోమీటర్లు.

ఈ స్కూటర్‌లో స్ట్రీట్, రేస్ అనే రెండు రైడింగ్ మోడ్లతో పాటు టీవీఎస్ ప్రత్యేక పర్ఫార్మెన్స్ బూస్ట్ ఇచ్చే 'iGo అసిస్ట్' టెక్నాలజీ ఉంది.

స్మార్ట్ కనెక్టివిటీ.. హైటెక్ ఫీచర్లు

టీవీఎస్ ఎన్​టార్క్ 105 స్పెక్ట్రల్ గ్రీన్ స్కూటర్​లో 5 అంగుళాల పూర్తి రంగుల టీఎఫ్‌టీ కాన్సోల్‌ను అందించారు. ఇది టీవీఎస్ అధునాతన 'SmartXonnect' టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.

"స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, అలెక్సా కాంబినేషన్ ఈ స్కూటర్‌ను తన సెగ్మెంట్‌లో అత్యంత సాంకేతికమైనదిగా నిలబెడుతుంది," అని ఆటోమొబైల్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ స్మార్ట్ సిస్టమ్ ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/మెసేజ్ అలర్టులు, మ్యూజిక్ కంట్రోల్, అలెక్సా వాయిస్ కంట్రోల్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ సదుపాయాలు పొందువచ్చు. భద్రత కోసం వెహికల్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్, క్రాష్ అలర్ట్‌లు, ఓవర్ దీ ఎయిర్ (ఓటీఏ) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఇందులో లభిస్తాయి. ఈ వేరియంట్‌లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, సింగిల్ ఛానల్ ఏబీఎస్ సురక్షిత ప్రయాణాన్ని ఇస్తాయి.

ఈ టీవీఎస్ స్కూటర్ ముందు భాగంలో నాలుగు ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లాంప్‌ల అమరిక, యాంగులర్ ఫ్రంట్ ఏప్రాన్, ఏరోడైనమిక్ వింగ్‌లెట్లు, ఎక్స్‌పోజ్డ్ హ్యాండిల్‌బార్ ప్రత్యేకంగా నిలుస్తాయి. వెనుక వైపు 'టీ' ఆకారంలో ఉండే ఎల్‌ఈడీ టైల్ లాంప్, కాంపాక్ట్ ఎగ్జాస్ట్ సైలెన్సర్ స్పోర్టీ లుక్‌ని మరింత పెంచుతున్నాయి.

ఈ స్కూటర్‌లో 22 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, 5.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి. 12 ఇంచుల అలాయ్ వీల్స్‌తో పాటు ముందు వైపు 220 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక వైపు 130 ఎంఎం డ్రమ్ బ్రేక్ అమర్చారు. దీని బరువు 115 కిలోలు కాగా, సీటు ఎత్తు 770 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 155 ఎంఎంగా ఉంటుంది.

టీవీఎస్ ఎన్​టార్క్ 105 స్పెక్ట్రల్ గ్రీన్ స్కూటర్- ధరలు, వేరియంట్లు..

ప్రస్తుతం టీవీఎస్ ఎన్‌టార్క్ 150 రెండు వేరియంట్లలో లభిస్తోంది. సాధారణ వర్షన్ ధర రూ. 1.13 లక్షలు కాగా, నూతన స్పెక్ట్రల్ గ్రీన్‌తో వచ్చిన టీఎఫ్‌టీ వర్షన్ ధర రూ. 1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్ దిల్లీ). పోటీ పరంగా ఇది మార్కెట్లో యమహా ఏరాక్స్ 155, అప్రిలియా ఎస్ఆర్ 175, హీరో జూమ్ 160 స్కూటర్లకు ప్రధాన సవాలు విసురుతోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More