రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడే ఒక సాధారణ సెక్యూరిటీ గార్డు జీవితం ఒకే ఒక్క ఈమెయిల్‌తో రాత్రికి రాత్రే మారిపోయింది. యూఏఈ లక్కీ డే లాటరీ డ్రాలో అతనికి ఏకంగా 15 కోట్ల రూపాయల జాక్‌పాట్ తగిలింది. అప్పటివరకు నెలకు వచ్చే కొద్దిపాటి జీతంతో బతుకుబండి లాదిన ఆ యువకుడు ఇప్పుడు కోటీశ్వరుడిగా మారిపోయాడు.
వణికిపోయిన చేతులు.. నమ్మలేని నిజం

అబుదాబిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన 26 ఏళ్ల తయాబ్ ఖాన్ ఈ అదృష్టవంతుడు. మే 27న ఈద్ అల్ అధా సెలవుల్లో రాత్రి డ్యూటీలో ఉన్న సమయంలో అతనికి లాటరీ తగిలినట్లు ఈమెయిల్ వచ్చింది. తయాబ్ ఖాన్‌తో పాటు అతని నలుగురు స్నేహితులు కలిసి దాదాపు 30 మిలియన్ దిర్హామ్‌ల (సుమారు రూ.78 కోట్లు) బంపర్ ప్రైజ్ గెలుచుకున్నారు. వీరంతా కలిసి ఒక్కొక్కరు 50 దిర్హామ్‌లు వేసుకుని ఈ టికెట్ కొన్నారు. ప్రైజ్ మనీని సమానంగా పంచుకోవడంతో తయాబ్ వాటాగా 6 మిలియన్ దిర్హామ్‌లు (దాదాపు రూ.15 కోట్లు) వచ్చాయి.
సాధారణంగా వచ్చే ఈమెయిల్ లాగే అనుకుని ఓపెన్ చేసిన తయాబ్, అందులోని ప్రైజ్ మనీ చూసి షాక్‌కు గురయ్యాడు.
"గతంలో చిన్నచిన్న బహుమతులు వచ్చినప్పుడు ఇలాగే ఈమెయిల్స్ వచ్చేవి. అందుకే దీనిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ మెయిల్ ఓపెన్ చేసి 30 మిలియన్ దిర్హామ్‌లు అని చూడగానే నా చేతులు, కాళ్లు వణికిపోయాయి. ఇదంతా ఒక కలలా అనిపించింది" అని తయాబ్ తన సంతోషాన్ని పంచుకున్నాడు.
ఫేస్‌బుక్‌లో చూసి 2024 ఆరంభం నుండి ఈ ఐదుగురు స్నేహితులు క్రమంతప్పకుండా లాటరీ టికెట్లు కొంటున్నారు. ప్రతి వారం ఒకరు చొప్పున నంబర్లు ఎంచుకునేవారు. ఎన్నాళ్లో శ్రమించినా చిన్న బహుమతులే వచ్చినా నమ్మకం కోల్పోకుండా ప్రయత్నించి చివరకు అనుకున్నది సాధించారు.
సెక్యూరిటీ ఉద్యోగానికి గుడ్ బై
ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో తయాబ్ తన సెక్యూరిటీ గార్డు ఉద్యోగానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. "నేను ఇకపై ఇదే ఉద్యోగంలో కొనసాగలేను. జీవితంలో కొత్త అడుగులు వేయడానికి, ఇన్వెస్ట్మెంట్ రంగంలోకి అడుగుపెట్టడానికి ఇదే సరైన సమయం. సెక్యూరిటీ రంగాన్ని వదిలి వ్యాపారవేత్తగా మారాలనుకుంటున్నాను" అని తయాబ్ వెల్లడించాడు. గత నాలుగేళ్లుగా ఉద్యోగిగా పనిచేసిన తాను, ఇప్పుడు తదుపరి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాడు.
కుటుంబానికి ఇల్లు.. మహీంద్రా థార్‌పై కన్ను
{{/usCountry}}ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో తయాబ్ తన సెక్యూరిటీ గార్డు ఉద్యోగానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. "నేను ఇకపై ఇదే ఉద్యోగంలో కొనసాగలేను. జీవితంలో కొత్త అడుగులు వేయడానికి, ఇన్వెస్ట్మెంట్ రంగంలోకి అడుగుపెట్టడానికి ఇదే సరైన సమయం. సెక్యూరిటీ రంగాన్ని వదిలి వ్యాపారవేత్తగా మారాలనుకుంటున్నాను" అని తయాబ్ వెల్లడించాడు. గత నాలుగేళ్లుగా ఉద్యోగిగా పనిచేసిన తాను, ఇప్పుడు తదుపరి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాడు.
కుటుంబానికి ఇల్లు.. మహీంద్రా థార్‌పై కన్ను
{{/usCountry}}ఈ సొమ్ముతో తన సొంత దేశమైన నేపాల్‌లోని కుటుంబానికి ఒక మంచి ఇల్లు నిర్మించడమే తన మొదటి లక్ష్యమని తయాబ్ చెప్పాడు. ఈ విజయం గురించి మొదట తన బాబాయికి సమాచారం అందించాడు. ఆయనే తయాబ్‌ను యూఏఈకి వచ్చేలా సహాయం చేశారు. ఈ వార్త వినగానే ఆయన కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి.
దీర్ఘకాలిక ప్రణాళికలతో పాటు తన పాత కలలను కూడా నెరవేర్చుకోవాలని తయాబ్ భావిస్తున్నాడు. ఒక ఖరీదైన కారు, మంచి వాచ్ కొనడం అతని జాబితాలో ఉన్నాయి. భారత్‌కు చెందిన ప్రముఖ ఎస్‌యూవీ 'మహీంద్రా థార్' (Mahindra Thar) జీపుతో పాటు 'రోలెక్స్' (Rolex) వాచ్ కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు తెలిపాడు. దుబాయ్‌లో ఒక అపార్ట్‌మెంట్ కొని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే యోచనలో కూడా ఉన్నాడు.