యూకో బ్యాంక్ (UCO Bank) బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 530 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ uco.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 530 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 అక్టోబర్ 29న ముగియనుంది.
అర్హతలు, వయోపరిమితి వివరాలు
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థులు 2022 ఏప్రిల్ 1 లేదా ఆ తర్వాత తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కళాశాల లేదా యూనివర్సిటీ జారీ చేసిన ఒరిజినల్ లేదా ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్, మార్కుల జాబితా కలిగి ఉండటం నిర్బంధం.
2026 అక్టోబర్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
స్టైపెండ్ ఎంతంటే?
అప్రెంటిస్‌షిప్ కాలవ్యవధిలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.16,650 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ సొమ్ము కూడా కలిసి ఉంటుంది. ఈ స్టైపెండ్ మినహా అభ్యర్థులకు ఎలాంటి ఇతర అలవెన్సులు లేదా ప్రయోజనాలు లభించవు.
ఎంపిక విధానం, పరీక్ష శైలి
రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ పరీక్షలో మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు అడుగుతారు.
పరీక్షను నాలుగు విభాగాలుగా నిర్వహిస్తారు:
- జనరల్ / ఫైనాన్షియల్ అవేర్‌నెస్
- జనరల్ ఇంగ్లీష్
- రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
పరీక్ష వ్యవధి 60 నిమిషాలు (1 గంట) ఉంటుంది. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా రాష్ట్రాలవారీగా, కేటగిరీలవారీగా మెరిట్ జాబితాను రూపొందించి నియామకాలు చేపడతారు.
దరఖాస్తు ఫీజు వివరాలు
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (PwBD): రూ. 200 + జీఎస్టీ
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (పురుషులు): రూ. 800 + జీఎస్టీ
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (మహిళలు / ట్రాన్స్జెండర్లు): రూ. 600 + జీఎస్టీ
పరీక్ష వ్యవధి 60 నిమిషాలు (1 గంట) ఉంటుంది. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా రాష్ట్రాలవారీగా, కేటగిరీలవారీగా మెరిట్ జాబితాను రూపొందించి నియామకాలు చేపడతారు.
దరఖాస్తు ఫీజు వివరాలు
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (PwBD): రూ. 200 + జీఎస్టీ
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (పురుషులు): రూ. 800 + జీఎస్టీ
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (మహిళలు / ట్రాన్స్జెండర్లు): రూ. 600 + జీఎస్టీ
దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి. ఒకసారి చెల్లించిన ఫీజును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వరు. అభ్యర్థులు రాత పరీక్షకు హాజరైనా, కాకపోయినా ఫీజు రీఫండ్ ఉండదు. పూర్తి వివరాల కోసం యుకో బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
సమగ్ర ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.