UGC NET answer key : యూజీసీ నెట్ 2026 ప్రొవిజనల్ ఆన్సర్​ కీ విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

UGC NET provisional answer key 2026 : యూజీసీ నెట్ జూన్ 2026 ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకోవచ్చు. తప్పులపై ఆగస్టు 18 లోపు అభ్యంతరాలు తెలపవచ్చు. మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 16, 2026, 12:21:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఈరోజు, ఆగస్టు 16న విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in ద్వారా తమ రెస్పాన్స్ షీట్లు, క్వశ్చన్ పేపర్లను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.

యూజీసీ నెట్ ప్రొవిజనల్ ఆన్సర్​ కీ ఇలా చెక్ చేసుకోండి..
యూజీసీ నెట్ ప్రొవిజనల్ ఆన్సర్​ కీ ఇలా చెక్ చేసుకోండి..

అభ్యర్థులు తమ సమాధానాలను ప్రొవిజనల్ ఆన్సర్ కీతో చెక్ చేసుకుని, (అంచనా)స్కోరును లెక్కగట్టవచ్చు. ఒకవేళ ఏవైనా తప్పులు కనిపిస్తే అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించారు. ప్రశ్నలవారీగా అభ్యంతరాలు తెలపడానికి ఒక్కో ప్రశ్నకు రూ. 200 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఆగస్టు 18, 2026 వరకు ఛాలెంజ్ చేయడానికి గడువు ఉంది.

అధికారిక ప్రకటన ప్రకారం మొత్తం 84 సబ్జెక్టులకు సంబంధించిన ప్రొవిజనల్ కీలను అప్‌లోడ్ చేశారు. అయితే ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల ఆన్సర్ కీలను మాత్రం త్వరలో వేరుగా విడుదల చేయనున్నారు.

"ప్రశ్నపత్రాల్లోని వివిధ రకాల లోపాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ సిఫారసుల ఆధారంగా ఆ మూడు సబ్జెక్టులకు సంబంధించిన పబ్లిక్ నోటీసును త్వరలో వేరుగా జారీ చేస్తాం," అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

యూజీసీ నెట్ జూన్ 2026- ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ముందుగా అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in ఓపెన్ చేయండి.

హోమ్‌పేజీలో కనిపించే యూజీసీ నెట్ జూన్ 2026 ఆన్సర్ కీ లింక్‌పై క్లిక్ చేయండి.

మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అవ్వండి.

స్క్రీన్‌పై కనిపించే ప్రొవిజనల్ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోండి.

యూజీసీ నెట్ జూన్ 2026- అభ్యంతరాలు తెలపడం ఎలా?

స్టెప్ 1- అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అభ్యంతరాల లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 2- లాగిన్ వివరాలు ఇచ్చి ప్రవేశించండి.

స్టెప్ 3- మీరు సవాల్ చేయాలనుకుంటున్న ప్రశ్నలను సెలెక్ట్ చేయండి.

స్టెప్ 4- సరైన సమాధానాన్ని ఎంచుకుని, అవసరమైతే తగిన ఆధారాలను అప్‌లోడ్ చేయండి.

స్టెప్ 5- ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించి సబ్మిట్ చేయండి.

యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షలను కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో జూన్ 22 నుంచి జూన్ 30 వరకు నిర్వహించారు. జలంధర్ కేంద్రాల అభ్యర్థులకు మాత్రం జులై 5న పరీక్ష జరిగింది.

పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్​ఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతతో పాటు పీహెచ్‌డీ ప్రవేశాలు లభిస్తాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More