భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే ‘కేంద్ర బడ్జెట్ 2026’ సమయం వచ్చేసింది. దేశవ్యాప్తంగా సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఈ వార్షిక ఆర్థిక ప్రణాళికను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
నిర్మలా సీతారామన్ రికార్డు

ఈసారి బడ్జెట్‌కు ఒక ప్రత్యేకత ఉంది. నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ అరుదైన రికార్డును సృష్టించబోతున్నారు. ఇప్పటివరకు వరుసగా అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా ఆమె చరిత్రకెక్కారు. వచ్చే ఏడాది కూడా ఆమె బడ్జెట్ ప్రవేశపెడితే, మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న 10 బడ్జెట్ల రికార్డును ఆమె సమం చేస్తారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని మూడవ ప్రభుత్వంలో ఇది రెండవ పూర్తిస్థాయి బడ్జెట్ కావడం గమనార్హం.
అసలు ‘కేంద్ర బడ్జెట్’ అంటే ఏమిటి?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం.. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం తన వార్షిక ఆదాయ, వ్యయాల పట్టికను పార్లమెంటు ముందు ఉంచాలి. దీనినే ‘కేంద్ర బడ్జెట్’ అంటారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఎక్కడి నుంచి నిధులు సేకరిస్తుంది? వేటికి ఖర్చు చేస్తుంది? పన్నుల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి? ఏయే రంగాలకు ప్రాధాన్యత ఇస్తుంది? వంటి కీలక అంశాలన్నీ ఇందులో ఉంటాయి.
నోట్ చేసుకోవాల్సిన కీలక తేదీలు:
బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది కేవలం ఒక రోజు ప్రక్రియ కాదు. దీనికి సంబంధించి కీలకమైన షెడ్యూల్ ఇలా ఉంది:
- జనవరి 28: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.
- జనవరి 31: ఆర్థిక మంత్రి పార్లమెంటులో ‘ఆర్థిక సర్వే’ (Economic Survey) ప్రవేశపెడతారు. దేశ ఆర్థిక స్థితిగతులను వివరిస్తూ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (CEA) వి. అనంత నాగేశ్వరన్ ఈ నివేదికను రూపొందిస్తారు.
- ఫిబ్రవరి 1: ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2026ని ప్రవేశపెడతారు.
- ఫిబ్రవరి 13: బడ్జెట్ సమావేశాల మొదటి విడత ముగుస్తుంది.
- మార్చి 9: రెండవ విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.
- ఏప్రిల్ 2: బడ్జెట్ సమావేశాలు అధికారికంగా ముగుస్తాయి.
ఈ బడ్జెట్లో ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు ఉంటాయా? సామాన్యులకు ఊరట లభిస్తుందా? అనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.
{{/usCountry}}ఈ బడ్జెట్లో ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు ఉంటాయా? సామాన్యులకు ఊరట లభిస్తుందా? అనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.
{{/usCountry}}