Union Cabinet : ఏపీకి కేంద్రం మరో కానుక - రూ. 9,889 కోట్లతో భారీ ప్రాజెక్టులు..! కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ఏపీకి కేంద్రం మరో భారీ కానుక ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Published on: Apr 18, 2026, 18:53:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ రైల్వే మౌలిక సదుపాయాలను మరింత ఆధునీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ…. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 601 కిలోమీటర్ల మేర కొత్త లైన్ల నిర్మాణానికి రూ. 24,815 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్టులు రైలు రద్దీని తగ్గించడమే కాకుండా…. పారిశ్రామిక, పర్యాటక రంగాలకు ఊతం ఇవ్వనున్నాయి.

ఏపీకి కేంద్రం మరో కానుక
ఏపీకి కేంద్రం మరో కానుక

రాజమండ్రి-విశాఖ మధ్య మొత్తం 198 కి.మీ మేర రూ.9,889 కోట్లతో కొత్తగా రెండు రైల్వే లైన్ల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నిడదవోలు-దువ్వాడను కలుపుతూ రైల్వే లైన్లు నిర్మించాలని నిర్ణయించింది. రద్దీ ఎక్కువగా ఉన్న చెన్నై-హౌడా మధ్య ఈ సెక్షన్‌లో నాలుగు లైన్లు తీసుకురావాలని నిర్ణయించింది.

రాజమండ్రి - విశాఖపట్నం 3వ, 4వ లైన్లు:

  • పొడవు - 198 కిలోమీటర్లు.
  • వ్యయం - రూ. రూ. 9,889 కోట్లు
  • జిల్లాల పరిధి - తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లె, విశాఖపట్నం జిల్లాల మీదుగా ఈ కొత్త లైన్ల నిర్మాణం ఉంటుంది.
  • విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం, కాకినాడ ఓడరేవులకు కనెక్టివిటీ పెరుగుతుంది.
  • ప్రస్తుతం ఇక్కడ లైన్ సామర్థ్యం వినియోగం 130 శాతానికి చేరుకోవడంతో…. కొత్త లైన్ల వల్ల రద్దీ తగ్గి సరుకు రవాణా వేగవంతం కానుంది.

ఈ కీలకమైన ప్రాజెక్టుతో సరుకు రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా… కార్బన్ ఉద్గారాలు కూడా భారీగా తగ్గుతాయని కేంద్రం ప్రభుత్వం తెలిపింది.అంతేకాకుండా ఆధ్యాత్మిక పర్యాటకానికి సంబంధించి.. అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం (ఏపీ), నైమిషారణ్య, గర్ముక్తేశ్వర్ ఘాట్ (యూపీ) వంటి పుణ్యక్షేత్రాలకు రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది.

ఇక ఢిల్లీ - గౌహతి నెట్‌వర్క్‌లో కీలకమైన ఈ మార్గంలో 403 కిలోమీటర్ల మేర 3వ మరియు 4వ లైన్లను నిర్మించనున్నారు. ఘజియాబాద్, హాపూర్, మొరాదాబాద్, బరేలీ, షాజహాన్పూర్ వంటి 9 జిల్లాలను ఇది కలుపుతుంది. ప్రస్తుతం ఈ మార్గంలో లైన్ సామర్థ్యం వినియోగం 168 శాతంగా ఉంది. ఈ ప్రాజెక్టుతో ఆ రద్దీ గణనీయంగా తగ్గుతుంది.

ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రతిపాదనలు 'పీఎం-గతి శక్తి' జాతీయ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి. ఇది ప్రజల కదలికలకు, వస్తువుల రవాణాకు అతుకులు లేని కనెక్టివిటీని అందిస్తుంది. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More