కేంద్ర మంత్రిమండలి దేశాభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతులు, యువత, క్రీడాకారులు, ఇంధన రంగానికి లబ్ధి చేకూర్చే బృహత్తర పథకాలకు పచ్చజెండా ఊపారు. ఈ నిర్ణయాల వివరాలను కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
పీఎం-కిసాన్ మరో ఐదేళ్లు పొడిగింపు

రైతులకు సాగు ఖర్చుల కోసం నేరుగా ఆర్థిక సహాయం అందించే 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (పీఎం-కిసాన్) పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించారు. ఈ ఐదేళ్ల కాలానికి గాను రూ. 3,15,614 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారు.
2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 6,000 చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. ఈ మొత్తాన్ని రూ. 2,000 చొప్పున మూడు సమాన విడతల్లో నేరుగా లబ్ధిదారుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లోకే జమ చేస్తున్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతు కుటుంబాలకు రాబోయే ఐదేళ్ల పాటు నిరంతర ఆర్థిక భరోసా లభించనుంది.
క్రీడారంగానికి రూ. 36,441 కోట్లు.. 'ఖేలో ఇండియా' విస్తరణ
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక క్రీడాభివృద్ధి కార్యక్రమంగా రూపుదిద్దుకున్న 'ఖేలో ఇండియా' విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఖేలో ఇండియా పథకంతో పాటు జాతీయ క్రీడా సమాఖ్యలకు (NSF) అందించే సహాయాన్ని కలిపి మొత్తం రూ. 36,441 కోట్లు కేటాయించారు.
ఇందులో ఖేలో ఇండియా పథకానికి రాబోయే ఐదేళ్లకు గాను రూ. 29,054 కోట్లు కేటాయించారు. ఇది మునుపటి బడ్జెట్ కంటే దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ, 2036 ఒలింపిక్స్ వేలం దిశగా అడుగులు వేస్తున్న భారత్, క్రీడల్లో ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు ఈ నిధులు తోడ్పడనున్నాయి. అలాగే జాతీయ క్రీడా సమాఖ్యలకు ఐదేళ్ల వ్యవధిలో రూ. 7,387 కోట్ల సాయం అందించనున్నారు.
{{/usCountry}}ఇందులో ఖేలో ఇండియా పథకానికి రాబోయే ఐదేళ్లకు గాను రూ. 29,054 కోట్లు కేటాయించారు. ఇది మునుపటి బడ్జెట్ కంటే దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ, 2036 ఒలింపిక్స్ వేలం దిశగా అడుగులు వేస్తున్న భారత్, క్రీడల్లో ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు ఈ నిధులు తోడ్పడనున్నాయి. అలాగే జాతీయ క్రీడా సమాఖ్యలకు ఐదేళ్ల వ్యవధిలో రూ. 7,387 కోట్ల సాయం అందించనున్నారు.
{{/usCountry}}పాఠశాల స్థాయి నుంచే క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు రెండు కొత్త కార్యక్రమాలను ప్రారంభించారు:
- ఖేలో ఇండియా ఫీడర్ స్కూల్స్ (KIFS)
- ఖేలో ఇండియా ఉత్కృష్ట విద్యాలయాలు (KIUV)
ఈ విధానం ద్వారా సాధారణ విద్యతో పాటు క్రీడలను అనుసంధానించి చిన్ననాటి నుంచే ప్రతిభను గుర్తించి శిక్షణ ఇస్తారు. మహిళా అథ్లెట్లు, పారా అథ్లెట్లు, దేశీయ సాంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ క్రీడాకారుల సమాచారం, మౌలిక వసతులు, పోటీల వివరాల కోసం ఒక డిజిటల్ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌ను కూడా అందుబాటులోకి తేనున్నారు.
'సముద్ర మంథన్'తో ఇంధన రంగంలో విప్లవం
దేశీయంగా చమురు, సహజ వాయువు ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 'సముద్ర మంథన్' (నేషనల్ ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ స్కీమ్) ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అమలు కానున్న ఈ పథకానికి రూ. 84,084 కోట్లు కేటాయించారు.
ఈ పథకం ద్వారా సముద్ర తీర ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిల్వల అన్వేషణను వేగవంతం చేస్తారు. 600 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ఈక్వివలెంట్ (MMTOE) కంటే ఎక్కువ నిల్వలను కనుగొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గడమే కాకుండా ఇంధన రంగంలో భారీగా కొత్త ఉద్యోగాలు, పెట్టుబడులు తరలివచ్చే అవకాశముంది.
నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్లు: రూ.5,070 కోట్లతో 'పీఎం సూర్య సరోవర్ యోజన'కు కేబినెట్ ఆమోదం
పునరుత్పాదక ఇంధన రంగాన్ని విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన' (PM-SSY) పథకానికి ఆమోదం తెలిపింది. రూ.5,070 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా నీటిపై తేలియాడే (ఫ్లోటింగ్) సోలార్ ప్లాంట్ల సాయంతో 5,000 మెగావాట్ల (MW) విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టుల వద్దే విద్యుత్‌ను నిల్వ చేసే వ్యవస్థలను (Energy Storage Systems) కూడా అనుసంధానించనున్నారు.
ఈ పథకం కింద కనీసం రెండు గంటల పాటు విద్యుత్‌ను నిల్వ ఉంచేలా (మొత్తంగా 10,000 MWh) సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తారు. 2026-27 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయనుండగా, 2032-33 వరకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. ప్రస్తుతం దేశంలో తేలియాడే సోలార్ ప్లాంట్ల సామర్థ్యం కేవలం 700 మెగావాట్లు మాత్రమే ఉండగా, ప్రాజెక్టులు, జలాశయాల్లో దాదాపు 102.18 గిగావాట్ల (GWp) మేర విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (NISE) స్పష్టం చేసింది.
కేంద్ర సాయం వివరాలు:
తయారీ సాయం: ప్రాజెక్ట్ విజయవంతంగా ప్రారంభమైన తర్వాత ప్రతి మెగావాట్‌కు రూ.1 కోటి చొప్పున కేంద్రీయ ఆర్థిక సాయం (CFA) లభిస్తుంది.
ప్రాథమిక అధ్యయనాలు: పర్యావరణ, హైడ్రోగ్రాఫిక్ తదితర ముందస్తు అధ్యయనాల కోసం ఒక్కో ప్రాజెక్టుకు గరిష్టంగా రూ.50 లక్షల వరకు అందిస్తారు.
ఈ ప్రాజెక్టుల వల్ల సౌర ప్లాంట్ల కోసం ప్రత్యేకంగా భూమి సేకరించాల్సిన అవసరం ఉండదు. ప్లాంట్ల ఏర్పాటు వల్ల ఏటా దాదాపు 1 కోటి టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని, దేశీయంగా తయారీ రంగానికి ఊతం లభించడమే కాకుండా 16,000 నుంచి 17,000 మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం అందుబాటులోకి రానుంది.