నిస్సాన్ ఇండియా నుంచి రాబోతున్న మల్టీ-పర్పస్ వెహికల్ (ఎంపీవీ) భారత రోడ్డుపై టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించింది. త్వరలోనే ఈ మోడల్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోందని ఇది స్పష్టం చేస్తోంది. ఈ కొత్త మోడల్‌తో కాంపాక్ట్ ఎంపీవీ సెగ్మెంట్‌లోకి నిస్సాన్ తిరిగి అడుగుపెట్టనుంది. రాబోయే నెలల్లో నిస్సాన్ విడుదల చేయాలనుకుంటున్న మూడు కొత్త వాహనాల్లో ఇది ఒకటి.
నిస్సాన్ కొత్త ఎంపీవీ- డిజైన్ ఎలా ఉండనుంది?

భారత రోడ్లపై టెస్ట్ చేస్తున్న ఈ వాహనం పూర్తిగా కవర్ చేసి ఉంది. కాబట్టి పూర్తి డిజైన్ వివరాలు బయటకు రాలేదు. అయితే, దీని ఆకారం చూస్తుంటే ఇది రెనాల్ట్ ట్రైబర్‌ను పోలి ఉంది. అంటే, ఈ రెండు కార్లు ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారవుతున్నాయని తెలుస్తోంది.
ఇదే నిజమైతే ఇదొక ఫ్యామిలీ ఎంపీవీగా మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది.
నిస్సాన్ తనదైన ప్రత్యేక శైలిని తీసుకురావడానికి కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఇందులో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, కొద్దిగా మార్చిన బంపర్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్ ఉండవచ్చు
నిస్సాన్ కొత్త ఎంపీవీ- ఇంజిన్ ఎలా ఉండవచ్చు?
ఈ ఎంపీవీకి రెనాల్ట్ ట్రైబర్‌లో ఉన్న 1.0-లీటర్, మూడు-సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టీ గేర్‌బాక్స్‌తో జత చేసి ఉంటుంది. దీంతో ఈ కారు పనితీరు, ఇంధన సామర్థ్యం రెండూ మెరుగ్గా ఉండేలా నిస్సాన్ జాగ్రత్తపడుతోంది.
| స్పెసిఫికేషన్స్ | వివరాలు |
|---|---|
| ఇంజిన్ | 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ |
| ట్రాన్స్మిషన్ | 5-స్పీడ్ మేన్యువల్/ఏఎంటీ |
| పవర్ | 71 బీహెచ్పీ |
| టార్క్ | 96 ఎన్ఎం |
| Drivetrain | Front-wheel drive |
నిస్సాన్ కొత్త ఎంపీవీ- ఏయే ఫీచర్లు ఆశించవచ్చు?
నిస్సాన్ ఎంపీవీలో రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌లో చూసిన ఫీచర్లనే ఆశించవచ్చు! ముఖ్యమైన సౌకర్యాలలో కూల్డ్ స్టోరేజ్, వైర్లెస్ ఛార్జింగ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్టీరింగ్‌పై కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, కీలెస్ ఎంట్రీ/ఎగ్జిట్ వంటివి ఉండవచ్చు.
{{/usCountry}}నిస్సాన్ ఎంపీవీలో రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌లో చూసిన ఫీచర్లనే ఆశించవచ్చు! ముఖ్యమైన సౌకర్యాలలో కూల్డ్ స్టోరేజ్, వైర్లెస్ ఛార్జింగ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్టీరింగ్‌పై కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, కీలెస్ ఎంట్రీ/ఎగ్జిట్ వంటివి ఉండవచ్చు.
{{/usCountry}}అలాగే, ఈ ఎంపీవీకి ప్రొజెక్టర్ లెన్స్‌లతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఇవ్వనున్నారు. ఇవి ట్రైబర్‌లో మాదిరిగానే మెరుగైన లో-బీమ్, డీసెంట్ హై-బీమ్‌ను అందిస్తాయి. అయితే, టెయిల్ ల్యాంప్‌లు మాత్రం ఆధునిక డిజైన్‌తో కూడిన హాలోజన్‌గా ఉండే అవకాశం ఉంది.
ఏ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంది?
నిస్సాన్ ఎంపీవీ నాలుగు మీటర్ల లోపు (సబ్-ఫోర్-మీటర్) పొడవుతో మూడు వరుసల సీటింగ్‌తో ఉన్న వాహనాల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఇది ప్రధానంగా కుటుంబ అవసరాలకు సరిపోయే కార్ల విభాగం. ట్రైబర్‌తో ప్లాట్‌ఫామ్‌ను పంచుకోవడం ద్వారా, నిస్సాన్ తక్కువ ధరలో మెరుగైన డిజైన్, అదనపు ఫీచర్లతో కూడిన “వాల్యూ-ఓరియెంటెడ్ పీపుల్ మూవర్”ను అందించాలని చూస్తోంది.
నిస్సాన్ ఇండియా నుంచి రాబోతున్న వాహనాలు..
ఈ ఎంపీవీని విడుదల చేసిన తర్వాత నిస్సాన్.. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా , హ్యుందాయ్ క్రెటా వంటి వాటికి పోటీగా ఒక మిడ్-సైజ్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా, కియా క్యారెన్స్, హ్యుందాయ్ అల్కాజార్ వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చేందుకు వీలుగా పెద్ద ఒక ఏడు-సీట్ల ఎస్‌యూవీ కూడా అభివృద్ధి దశలో ఉంది. దీని ద్వారా భారత మార్కెట్‌లో నిస్సాన్ బలమైన పునరాగమనాన్ని ప్లాన్ చేస్తోందని స్పష్టమవుతోంది.