భారత్‌లో విస్తృతంగా ఉపయోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ వినియోగదారులకు కేంద్రం నుంచి బిగ్ న్యూస్ వచ్చింది. చిన్న తరహా చెల్లింపులు, వ్యక్తిగత నగదు బదిలీలపై ఎలాంటి రుసుములు విధించబోమని స్పష్టం చేసింది. అయితే వ్యాపారులకు(Merchants) సంబంధించి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన పెద్ద లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) రుసుమును విధించే అంశంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్ణయం తీసుకుంది.

వ్యాపారులకు వ్యక్తులు రూ.2000 కంటే ఎక్కువ యూపీఐ పేమెంట్స్ చేస్తే.. ఆ చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీ వర్తిస్తుందని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. అంటే రూ.2000 లోపు పేమెంట్స్ ఎండీఆర్ పరిధిలోకి రావు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ సెప్టెంబర్ 14న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నూతన నిబంధనలు అక్టోబర్ 15 నుండి అమలులోకి రానున్నాయి.
సాధారణ జనాల పరిస్థితేంటి?
ఈ కొత్త విధానం వల్ల సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పటిలాగే యూపీఐ లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. మీరు షాపుల్లో, టీ కొట్టు వద్ద, కూరగాయల మార్కెట్‌లో లేదా కిరాణా షాపుల్లో చేసే సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు పడవు. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి (P2P) పంపే డబ్బులపై ఎలాంటి రుసుములు ఉండవు.
బ్యాంకులకు లేదా పేమెంట్ యాప్‌లకు రూ.2,000 వరకు ఉండే యూపీఐ లావాదేవీల పై ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఛార్జీలు వసూలు చేసే అధికారం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది.
చిన్న వ్యాపారులు సేఫేనా?
ఎండీఆర్ ఛార్జీలు చిన్న వ్యాపారులకువర్తించవు. నెలకు రూ.లక్ష వరకు బ్యాంక్ ఖాతాలోకి క్యూఆర్ కోడ్ ద్వారా స్వీకరించే చిన్న వ్యాపారులకు ఈ విధానం ఉండదు. రైల్వేలు, టెలికాం సేవలు, బీమా, ఇంధనంలాంటి వాటికి రూ.2000 దాటితే ఒక్కో లావాదేవీకి ప్లాట్‌గా రూ.5 ఎండీఆర్ వర్తిస్తుంది. ఒక్కో లావాదేవీకి ఎండీఆర్ రుసుము గరిష్టంగా రూ.300 మించకుండా పరిమితి విధించారు.
{{/usCountry}}ఎండీఆర్ ఛార్జీలు చిన్న వ్యాపారులకువర్తించవు. నెలకు రూ.లక్ష వరకు బ్యాంక్ ఖాతాలోకి క్యూఆర్ కోడ్ ద్వారా స్వీకరించే చిన్న వ్యాపారులకు ఈ విధానం ఉండదు. రైల్వేలు, టెలికాం సేవలు, బీమా, ఇంధనంలాంటి వాటికి రూ.2000 దాటితే ఒక్కో లావాదేవీకి ప్లాట్‌గా రూ.5 ఎండీఆర్ వర్తిస్తుంది. ఒక్కో లావాదేవీకి ఎండీఆర్ రుసుము గరిష్టంగా రూ.300 మించకుండా పరిమితి విధించారు.
{{/usCountry}}దేశవ్యాప్తంగా జరిగే మొత్తం యూపీఐ లావాదేవీలలో సుమారు 96 శాతం చెల్లింపులు రూ.2,000 కంటే తక్కువ విలువైనవే. వ్యాపార సంస్థలకు జరిగే (P2M) చెల్లింపుల్లో కేవలం 4 శాతం లావాదేవీలు మాత్రమే రూ.2,000 కంటే ఎక్కువ విలువ కలిగి ఉన్నాయి. కాబట్టి మెజారిటీ ప్రజలపై ఈ నిర్ణయం ఎలాంటి ఆర్థిక భారం వేయదు.
భారం ఎవరిపై?
ఈ రుసుమును కేవలం వ్యాపారుల నుంచి మాత్రమే వసూలు చేస్తారు తప్ప కొనుగోలుదారుల (వినియోగదారుల) నుంచి కాదు. ఈ రుసుముల ద్వారా వచ్చే ఆదాయంలో 40 శాతం బ్యాంకులకు, మిగిలిన 60 శాతం మొత్తాన్ని సంబంధిత పేమెంట్ యాప్‌లు, అగ్రిగేటర్లు చెరిసగం పంచుకునేలా ప్రణాళిక రూపొందించారు. రూ.3వేలు పేమెంట్ చేస్తే రూ.12, రూ.50వేలకు రూ.200, రూ.75వేల పైన పేమెంట్ చేస్తే రూ.300లు వ్యాపారులు చెల్లించాలి.
యూపీఐ రికార్డు స్థాయి వృద్ధి
ఎన్‌పీసీఐ నివేదిక ప్రకారం గత ఆగస్టు (2026) ఒక్క నెలలోనే యూపీఐ ద్వారా 2,450 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ దాదాపు రూ.29.82 లక్షల కోట్లు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో భారత్ సాధించిన ఈ అసాధారణ ప్రగతిని దృష్టిలో ఉంచుకుని, చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని అధికారులు చెబుతున్నారు.