యూపీఎస్సీ సివిల్స్ 2025 ఫలితాలు విడుదల: ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ అనుజ్ అగ్నిహోత్రి.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాలు నేడు (శుక్రవారం) విడుదలయ్యాయి. అనుజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి టాపర్‌గా నిలవగా, రాజేశ్వరి సువే ఎం రెండో ర్యాంక్ సాధించారు. ఫలితాలు చూసుకునే విధానం, టాపర్ల జాబితా ఇక్కడ చూడండి.

Published on: Mar 06, 2026 3:01 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్ష (CSE) 2025 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అధికారికంగా విడుదల చేసింది. శుక్రవారం వెల్లడైన ఈ ఫలితాల్లో అనుజ్ అగ్నిహోత్రి అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి సత్తా చాటారు. రాజేశ్వరి సువే ఎం రెండో స్థానంలో, ఆకాంశ్ ధుల్ మూడో స్థానంలో నిలిచారు.

యూపీఎస్సీ సివిల్స్ 2025 ఫలితాలు విడుదల: రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
యూపీఎస్సీ సివిల్స్ 2025 ఫలితాలు విడుదల: రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

ముఖ్యంగా మూడు దశల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ) నిర్వహించిన ఈ కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను యూపీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లో అందుబాటులో ఉంచింది.

మీ ఫలితాలను ఇలా తనిఖీ చేసుకోండి (Step-by-Step Guide):

సివిల్స్ మెయిన్స్ రాసి, ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఈ క్రింది విధంగా సులభంగా చూసుకోవచ్చు:

  • మొదట యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ను సందర్శించండి.
  • హోమ్ పేజీలో కుడివైపున ఉండే ‘What’s New’ సెక్షన్‌కు వెళ్లండి.
  • అక్కడ కనిపిస్తున్న ‘UPSC Final Result 2025’ అనే లింక్‌పై క్లిక్ చేయండి.
  • వెంటనే అభ్యర్థుల పేర్లు, రోల్ నంబర్లతో కూడిన ఒక PDF ఫైల్ ఓపెన్ అవుతుంది.
  • ఆ పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. మొత్తం లిస్టులో మీ పేరు వెతకడం కష్టమైతే, Ctrl+F ఆప్షన్ వాడి మీ పేరు లేదా రోల్ నంబర్‌ను టైప్ చేసి సెర్చ్ చేస్తే నేరుగా మీ ఫలితం కనిపిస్తుంది.

యూపీఎస్సీ సివిల్స్ 2025 టాపర్ల జాబితా (Top 10):

ర్యాంక్, అభ్యర్థి పేరు

AIR 1, అనుజ్ అగ్నిహోత్రి

AIR 2, రాజేశ్వరి సువే ఎం

AIR 3, ఆకాంశ్ ధుల్

AIR 4, రాఘవ్ ఝున్‌ఝున్‌వాలా

AIR 5, ఇషాన్ భట్నాగర్

AIR 6, జిన్నియా అరోరా

AIR 7, ఏ ఆర్ రాజా మొహైదీన్

AIR 8, పక్షల్ సెక్రటరీ

AIR 9, ఆస్థా జైన్

AIR 10, ఉజ్వల్ ప్రియాంక్

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ):

ప్ర: యూపీఎస్సీ 2025 ఫలితాలను ఎక్కడ చూడాలి?

జ: మీరు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లో ఫలితాలను చూడవచ్చు.

ప్ర: 2025 సివిల్ సర్వీసెస్ టాపర్ ఎవరు?

జ: అనుజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ (AIR 1) సాధించారు.

ప్ర: రిజల్ట్ పీడీఎఫ్‌లో పేరు లేదా రోల్ నంబర్ ఎలా వెతకాలి?

జ: పీడీఎఫ్ ఓపెన్ చేసిన తర్వాత కీబోర్డ్‌లో Ctrl+F ప్రెస్ చేసి మీ వివరాలు ఎంటర్ చేస్తే మీ ర్యాంక్ కనిపిస్తుంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More