కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే 'ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్ఈ) 2027' దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. దరఖాస్తు గడువు నేడు (అక్టోబర్ 6, 2026) సాయంత్రం 6 గంటలతో ముగియనుందని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తెలిపింది. చివరి నిమిషంలో సర్వర్ రద్దీ, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, అర్హులైన అభ్యర్థులు వెంటనే అధికారిక పోర్టల్ upsconline.nic.in సందర్శించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని కమిషన్ సూచించింది.

ఈ సారి నోటిఫికేషన్ ద్వారా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో సుమారు 480 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 19 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. భారత ప్రభుత్వ పరిధిలోని రైల్వే, డిఫెన్స్, సీడబ్ల్యూసీ, కేంద్ర నీటిపారుదల శాఖ వంటి అత్యున్నత విభాగాల్లో క్లాస్-1 ఆఫీసర్ హోదాలో కొలువు తీరేందుకు ఈ పరీక్ష మార్గం సుగమం చేస్తుంది.
దరఖాస్తు విధానంలో కీలక నిబంధనలు..
యూపీఎస్సీ ఈఎస్ఈ 2027కి అప్లై చేసే క్రమంలో అభ్యర్థులు యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ (యూఆర్ఎన్), కామన్ అప్లికేషన్ ఫారమ్ (సీఏఎఫ్) ప్రక్రియలను పూర్తి చేయాలి. దరఖాస్తును కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. వేరే ఏ మార్గంలో పంపినా దరఖాస్తులను తిరస్కరిస్తారు.
ఒక్కసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దానిని వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. అలాగే సబ్మిషన్ పూర్తయ్యాక దరఖాస్తులో ఎలాంటి కరెక్షన్లు చేసుకోవడానికి వీలుండదని యూపీఎస్సీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. కాబట్టి ఫారమ్ సబ్మిట్ చేసేముందే నమోదు చేసిన వివరాలన్నీ సరైనవో కాదో క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవడం అవసరం.
వయోపరిమితి, విద్యార్హతల వివరాలు..
వయోపరిమితి: 2027 జనవరి 1 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. 30 ఏళ్లు దాటకూడదు. అంటే అభ్యర్థులు 1997 జనవరి 2 నుంచి 2006 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వుడ్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
{{/usCountry}}వయోపరిమితి: 2027 జనవరి 1 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. 30 ఏళ్లు దాటకూడదు. అంటే అభ్యర్థులు 1997 జనవరి 2 నుంచి 2006 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వుడ్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
{{/usCountry}}జాతీయత: అభ్యర్థులు భారతదేశ పౌరులై ఉండాలి, లేదా నేపాల్, భూటాన్ దేశస్థులై ఉండాలి.
విద్యార్హత: సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్షల షెడ్యూల్..
నోటిఫికేషన్ ప్రకారం యూపీఎస్సీ ఈఎస్ఈ ప్రిలిమినరీ పరీక్షను 2027 జనవరి 31న నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో దశ అయిన మెయిన్స్ పరీక్షను 2027 జూన్ 18న జరుపుతారు. మెయిన్స్ నెగ్గిన వారికి ఆఖరి దశలో పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) నిర్వహించి తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.