న్యూఢిల్లీ, జనవరి 7, 2026: అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని, అక్కడ స్థిరపడాలని కలలు కనే భారతీయ విద్యార్థులకు అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) గట్టి హెచ్చరిక జారీ చేసింది. అమెరికా గడ్డపై అడుగుపెట్టిన తర్వాత అక్కడి చట్టాలను ఏమాత్రం అతిక్రమించినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది.
"వీసా అనేది మీ హక్కు కాదు.. అదొక అవకాశం మాత్రమే" సోషల్ మీడియా వేదికగా యూఎస్ ఎంబసీ ఈ హెచ్చరికను విడుదల చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. "అమెరికా చట్టాలను ఉల్లంఘించడం వల్ల మీ స్టూడెంట్ వీసాపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఏదైనా చట్టవిరుద్ధమైన పని చేసి మీరు అరెస్టయితే, మీ వీసాను తక్షణమే రద్దు చేస్తారు. అంతటితో ఆగకుండా మిమ్మల్ని దేశం నుంచి బహిష్కరించే (Deportation) అవకాశం కూడా ఉంది. దీనివల్ల భవిష్యత్తులో మళ్లీ ఎప్పటికీ మీకు అమెరికా వీసా రాకుండా పోవచ్చు" అని ఎంబసీ స్పష్టం చేసింది. ముఖ్యంగా అమెరికా వీసా అనేది ప్రతి ఒక్కరికీ ఉండే 'హక్కు' కాదని, అది ఒక 'అరుదైన అవకాశం' (Privilege) మాత్రమేనని విద్యార్థులకు గుర్తు చేసింది.
ట్రంప్ సర్కార్ కఠిన నిబంధనలు:
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే హెచ్-1బి (H-1B), స్టూడెంట్ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. గత వారం కూడా హెచ్-1బి, హెచ్-4 వీసాదారులకు ఎంబసీ ఇటువంటి హెచ్చరికలే జారీ చేసింది. వలస చట్టాలను ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య:
అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి ప్రభావం గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాల్లో 17 శాతం క్షీణత నమోదైంది. ఆగస్టు 2024 నాటి గణాంకాల ప్రకారం.. అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఏటేటా 19 శాతం పడిపోయింది. 2021 తర్వాత ఇదే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. ఇందులో భారత్ నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.
అక్రమ మార్గాల వైపు వెళ్లొద్దు..
{{/usCountry}}అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి ప్రభావం గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాల్లో 17 శాతం క్షీణత నమోదైంది. ఆగస్టు 2024 నాటి గణాంకాల ప్రకారం.. అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఏటేటా 19 శాతం పడిపోయింది. 2021 తర్వాత ఇదే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. ఇందులో భారత్ నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.
అక్రమ మార్గాల వైపు వెళ్లొద్దు..
{{/usCountry}}మరోవైపు, అక్రమ మార్గాల్లో అమెరికా వెళ్లాలనుకునే వారిని ఉద్దేశించి ఎంబసీ మరింత ఘాటుగా స్పందించింది. "అక్రమ వలస అనేది గమ్యం లేని ప్రయాణం. దారిలో మీరు మానవ అక్రమ రవాణా చేసే ముఠాల చేతుల్లో చిక్కి మోసపోయే ప్రమాదం ఉంది. ఈ అక్రమ వలసల వల్ల కేవలం దళారులు మాత్రమే లాభపడతారు తప్ప, మీకు దక్కేది ఏమీ ఉండదు" అని జనవరి 2న చేసిన ఒక పోస్ట్‌లో ఎంబసీ పేర్కొంది.
ప్రస్తుతం యూఎస్ కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లు దొరకడం కూడా కష్టతరంగా మారింది. అనేక అపాయింట్‌మెంట్లు రద్దు కావడం లేదా నెలల తరబడి వెనక్కి వెళ్లడం వంటి పరిణామాల మధ్య విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు.