న్యూయార్క్: మనిషి ఆకారంలో ఉండి పనులు చేసే హ్యూమనాయిడ్ రోబోల శకం వేగంగా విస్తరిస్తోంది. కేవలం ప్రదర్శనల దశ నుంచి వాణిజ్య వినియోగం వైపు ఈ పరిశ్రమ అడుగులు వేస్తుండటంతో, అమెరికాలో వీటి ఉత్పత్తి భారీగా పెరగనుంది. 2030 నాటికి యూఎస్‌లో హ్యూమనాయిడ్ రోబోల ఉత్పత్తి 3 లక్షల నుంచి 4 లక్షల యూనిట్లకు చేరుతుందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ గురువారం అంచనా వేసింది. 2035 నాటికి ఈ సంఖ్య ఏకంగా 15 లక్షల (1.5 మిలియన్) యూనిట్లకు ఎగబాకుతుందని నివేదికలో వెల్లడించింది.

తయారీ, లాజిస్టిక్స్, గిడ్డంగుల (వేర్‌హౌసింగ్) రంగాల్లో ఒకే తరహా పనులను యాంత్రీకరించేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. కార్మికుల కొరత తీవ్రంగా ఉండటం, ఆర్థికంగా లాభదాయకత మెరుగుపడటం, ఉత్పత్తి సామర్థ్యం పెరగడం వంటి అంశాలు హ్యూమనాయిడ్ రోబోల వినియోగాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. మరోవైపు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే రోబోటిక్స్, పారిశ్రామిక యంత్రాల వల్ల జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని ట్రంప్ ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు దిగుమతులపై సుంకాలు (టారిఫ్‌లు) విధించడం లేదా ఇతర ప్రోత్సాహక చర్యలు తీసుకునే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ పేర్కొంది.
ఉత్పత్తి లక్ష్యాలు.. ఖర్చుల ఆదా
హ్యూమనాయిడ్ రోబోల వినియోగం పెరుగుతున్నప్పటికీ హార్డ్‌వేర్, ఏఐ శిక్షణ డేటా, కంప్యూట్ సామర్థ్యం, ఉత్పత్తి సామర్థ్యం వంటివి అడ్డంకులుగా నిలుస్తున్నాయి. ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న టెస్లా మినహా, మిగిలిన యూఎస్ తయారీ సంస్థలన్నీ ఏటా 10,000 నుంచి 30,000 యూనిట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం హ్యూమనాయిడ్ రోబోల ఖర్చులు దాదాపు మానవ కార్మికుల వేతనాలకు సమానంగా (పారిటీ) మారుతున్నాయి. వీటిని బహుళ షిఫ్టుల్లో (మల్టీ-షిఫ్ట్) వినియోగించడం వల్ల ఒక్కో వినియోగదారుడికి ఏటా సుమారు లక్ష డాలర్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ లెక్కగట్టింది.
"స్వల్పకాలిక ప్రగతికి సరఫరా పరమైన అడ్డంకులు ఉన్నాయి. రోబో చేతులు, యాక్యుయేటర్లు, మెదడు, ఉత్పత్తి సామర్థ్యం వంటివి ప్రధాన అవరోధాలుగా నిలుస్తున్నాయి" అని బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ పేర్కొంది.
విడిభాగాల తయారీదారులకే భారీ అవకాశాలు
{{/usCountry}}"స్వల్పకాలిక ప్రగతికి సరఫరా పరమైన అడ్డంకులు ఉన్నాయి. రోబో చేతులు, యాక్యుయేటర్లు, మెదడు, ఉత్పత్తి సామర్థ్యం వంటివి ప్రధాన అవరోధాలుగా నిలుస్తున్నాయి" అని బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ పేర్కొంది.
విడిభాగాల తయారీదారులకే భారీ అవకాశాలు
{{/usCountry}}ప్రస్తుత పరిస్థితుల్లో హ్యూమనాయిడ్ రోబోల విడిభాగాలు సరఫరా చేసే కంపెనీలకే అతిపెద్ద వ్యాపార అవకాశం ఉందని జేపీ మోర్గాన్ స్పష్టం చేసింది. యాక్యుయేటర్లు, మోటార్లు, విజన్ సిస్టమ్స్ వంటి కీలక విడిభాగాల మార్కెట్ 2035 నాటికి 30 బిలియన్ డాలర్లకు చేరువవుతుందని అంచనా వేసింది.
అమెరికాలో హ్యూమనాయిడ్ రోబోల తయారీలో టెస్లాకు చెందిన 'ఆప్టిమస్', ఎజిలిటీ రోబోటిక్స్ 'డిజిట్', బోస్టన్ డైనమిక్స్ 'అట్లాస్', ఫిగర్ ఏఐ 'ఫిగర్' రోబోలు, ఆప్ట్రోనిక్ 'అపోలో' కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక వివరించింది. విడిభాగాల సరఫరాదారులలో టిమ్కెన్, రోబోటిస్, లీడర్ డ్రైవ్, ఓర్బెక్, కాగ్నెక్స్ సంస్థలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. అయితే, కాలక్రమేణా రోబోల తయారీదారులు, ప్లాట్‌ఫామ్ ఇంటిగ్రేటర్ల వైపు విలువ సృష్టి (వాల్యూ క్రియేషన్) మళ్లుతుందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది.