...
...
Next Story

US visa rules : అమెరికా వీసా నిబంధనలు కఠినం- అక్టోబర్ 1 నుంచే అమలు! భారతీయులపై ప్రభావం ఎంత?

అమెరికా వీసా దరఖాస్తుదారులకు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ బిగ్ షాక్ ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి మరో మూడు రకాల వీసాలకు సోషల్ మీడియా స్క్రీనింగ్‌ను తప్పనిసరి చేస్తూ నిబంధనలను సవరించింది.

Published on: Sep 22, 2026, 05:27:25 IST
Advertisement

అమెరికా పర్యటనకు లేదా అక్కడ ఉద్యోగం చేయడానికి సిద్ధమవుతున్న వారికి యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీ నిబంధనలను మరింత విస్తరించనుంది. మరింత కఠినతరం చేయనుంది. కొత్తగా మరో మూడు కేటగిరీల నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను ఈ ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరిధిలోకి చేర్చినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

అమెరికా వీసా నిబంధనలు కఠినం- అక్టోబర్ 1 నుంచే అమలు!
అమెరికా వీసా నిబంధనలు కఠినం- అక్టోబర్ 1 నుంచే అమలు!

ఇప్పటికే హెచ్-1బీ ఉద్యోగులు, ఎఫ్-1 విద్యార్థులకు ఈ సోషల్ మీడియా తనిఖీ నిబంధనలు వర్తిస్తుండగా, తాజాగా జర్నలిస్టులు, ఇతర విదేశీ నిపుణులను కూడా అమెరికా యంత్రాంగం ఈ పరిధిలోకి తెచ్చింది.

కొత్తగా ఏ వీసాలు చేరాయి?

తాజా నిర్ణయంతో ‘ఐ’, ‘టీఎన్’, ‘టీడీ’ వీసా కేటగిరీలు సోషల్ మీడియా స్క్రీనింగ్ పరిధిలోకి వచ్చాయి.

'ఐ' వీసా : పత్రికలు, రేడియో, సినిమా, ప్రింట్, డిజిటల్ వంటి విదేశీ మీడియా సంస్థల్లో పనిచేస్తూ, వృత్తిపరమైన బాధ్యతలపై తాత్కాలికంగా అమెరికా వెళ్లే పాత్రికేయులు, మీడియా ప్రతినిధులకు ఈ వీసా మంజూరు చేస్తారు. భారతీయ జర్నలిస్టులకు ఈ నిబంధన నేరుగా వర్తిస్తుంది.

'టీఎన్' అండ్ 'టీడీ' వీసాలు : 'యూఎస్ఎమ్‌సీఏ' ఒప్పందం ప్రకారం కెనడా, మెక్సికో పౌరులకు ఇచ్చే వీసాలు 'టీఎన్'. వారి ఆధారపడిన కుటుంబ సభ్యులకు (భార్య/భర్త, పిల్లలు) ఇచ్చేది 'టీడీ' వీసా. ఈ కేటగిరీ వీసాలు భారతీయులకు వర్తించవు.

సోషల్ మీడియా ప్రొఫైళ్లు పబ్లిక్ చేయాల్సిందే!

అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త కేటగిరీ వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ (ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి) ప్రైవసీ సెట్టింగ్స్‌ను ‘పబ్లిక్’ లేదా ‘ఓపెన్’గా మార్చాలని స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆదేశించింది.

అలాగే కేవలం ఒక పోస్ట్ ప్రాతిపదికన వీసాను నేరుగా తిరస్కరించరని సమాచారం.

భారతీయులపై ప్రభావం ఎంత?

ఇప్పటికే హెచ్-1బీ ఉద్యోగులు, విద్యార్థులు (ఎఫ్-1, ఎం-1), జే-1 ఎక్స్​ఛేంజ్ విజిటర్స్, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఈ సోషల్ మీడియా స్క్రీనింగ్ విధానం అమలు అవుతోంది. ఇప్పుడు కొత్తగా ఐ వీసా ద్వారా అమెరికా వెళ్లాలనుకునే భారతీయ జర్నలిస్టులు, మీడియా రంగానికి చెందిన నిపుణులు తమ సామాజిక మాధ్యమాల ఖాతాలను పబ్లిక్‌గా ఉంచాల్సి ఉంటుంది.

వీసా పొందడానికి ఉండే ప్రాథమిక అర్హత నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయకపోయినప్పటికీ, సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసే విషయాల్లో దరఖాస్తుదారులు మరింత అప్రమత్తంగా ఉండటం మంచిదని రంగానికి చెందిన నిపుణులు సూచిస్తున్నారు.

The latest announcement, issued on September 18, broadens the scope of online presence checks that are already part of the visa screening process for several categories of applicants, including students, temporary workers, exchange visitors, and religious workers.

The department said visa applications are assessed using “every available source of information” to determine whether an applicant could be inadmissible to the US. This includes screening for individuals considered a potential risk to national security or public safety.

“Every visa adjudication is fundamentally a national security decision,” the department said.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks