అమెరికా రాజకీయ చరిత్రలో భారత సంతతి మహిళ, సెకండ్ లేడీ ఉషా వ్యాన్స్ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. 40 ఏళ్ల ఉష ప్రస్తుతం తన నాలుగో బిడ్డతో గర్భవతిగా ఉన్నారని, ఇది అమెరికా చరిత్రలోనే ఒక ప్రత్యేక సందర్భమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడి భార్య పదవిలో ఉండగా గర్భం దాల్చడం ఇదే మొదటిసారి.
60 ఏళ్ల తర్వాత మళ్లీ..

గతంలో 1963లో అప్పటి ప్రథమ మహిళ జాక్వెలిన్ కెన్నెడీ వైట్ హౌస్‌లో ఉండగా పాట్రిక్ బౌవియర్ కెన్నెడీకి జన్మనిచ్చారు. ఆ తర్వాత మళ్లీ దశాబ్దాల కాలం గడిచినా, శ్వేతసౌధంలో ఇటువంటి వేడుక జరగలేదు. ఇప్పుడు ఉషా వ్యాన్స్ రూపంలో వైట్ హౌస్‌లోకి మళ్లీ ఒక చిన్నారి రాబోతుండటంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.
"ఉష నాలుగోసారి గర్భం దాల్చిన వార్తను పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు మగబిడ్డ పుట్టబోతున్నాడు. ఉష, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. జూలై నెలాఖరులో మా కుటుంబంలోకి కొత్త సభ్యుడిని ఆహ్వానించడానికి మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం" అని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కార్యాలయం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది.
తమ కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న మిలిటరీ వైద్యులకు, సిబ్బందికి ఈ సందర్భంగా వ్యాన్స్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. దేశ సేవలో ఉంటూనే, పిల్లలతో గడుపుతూ ఒక అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నామని వారు మురిసిపోయారు.
యాలే లా స్కూల్ నుంచి వైట్ హౌస్ వరకు..
ఉష, జేడీ వ్యాన్స్ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. వీరిద్దరూ 2013లో యేల్ లా స్కూల్‌లో చదువుకుంటున్నప్పుడు కలుసుకున్నారు. మొదటి డేట్‌లోనే ఉషకు తన ప్రేమను వ్యక్తపరిచినట్లు వ్యాన్స్ తన జ్ఞాపకాల్లో రాసుకున్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన జేడీ వ్యాన్స్‌కు, విద్యావేత్తల కుటుంబానికి చెందిన ఉష ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు.
2014 జూన్ 14న వీరి వివాహం జరిగింది. ఉష భారతీయ మూలాలను గౌరవిస్తూ అప్పట్లో హిందూ సంప్రదాయంలోనూ వేడుకలు జరుపుకున్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమారులు ఇవాన్ (8), వివేక్ (5) తో పాటు ఒక కుమార్తె మిరాబెల్ (4) ఉన్నారు.
వివాదాల మధ్య తీపి కబురు
{{/usCountry}}2014 జూన్ 14న వీరి వివాహం జరిగింది. ఉష భారతీయ మూలాలను గౌరవిస్తూ అప్పట్లో హిందూ సంప్రదాయంలోనూ వేడుకలు జరుపుకున్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమారులు ఇవాన్ (8), వివేక్ (5) తో పాటు ఒక కుమార్తె మిరాబెల్ (4) ఉన్నారు.
వివాదాల మధ్య తీపి కబురు
{{/usCountry}}ఇటీవలి కాలంలో వీరి వ్యక్తిగత జీవితంపై కొన్ని ఊహాగానాలు వినిపించాయి. ఉషను క్రైస్తవ మతంలోకి మారాలని కోరుకుంటున్నట్లు వ్యాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అలాగే ఒక కార్యక్రమంలో ఎరికా కిర్క్ అనే మహిళను వ్యాన్స్ ఆలింగనం చేసుకున్న వీడియోలు వైరల్ కావడంతో, వీరి వివాహ బంధంలో విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు నాలుగో బిడ్డ రాబోతున్నాడన్న వార్తతో ఆ పుకార్లన్నింటికీ ఫుల్‌స్టాప్ పడినట్లయింది.