...
...
Next Story

Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి బంపరాఫర్- టీమిండియాకు చేరువగా- సూర్యకుమార్, శుభ్‌మన్‌లకు సెలక్టర్ల షాక్!

Vaibhav Sooryavanshi: టీమిండియా డెబ్యూ దిశగా వైభవ్ సూర్యవంశీ మరో అడుగు ముందుకేశాడు. ఐపీఎల్ 2026 సంచలనం వైభవ్ సూర్యవంశీ ఏషియన్ గేమ్స్ భారత జట్టు ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్నాడు. అయితే సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్‌లను సెలక్టర్లు పక్కన పెట్టడం గమనార్హం.

Published on: May 30, 2026, 17:31:48 IST
Advertisement

Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఆడించాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ 2026 సీజన్‌లో పరుగుల వరద పారించి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్ దక్కింది. రాబోయే ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్ కోసం ప్రకటించిన టీమిండియా 30 మంది ప్లేయ్ల ప్రాబబుల్స్ లిస్ట్ లో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది.

వైభవ్ సూర్యవంశీ ఊచకోత

ఏషియన్ గేమ్స్ టీమిండియా ప్రాబబుల్స్ లో వైభవ్ సూర్యవంశీ పేరు (ANI Pic Service)
ఏషియన్ గేమ్స్ టీమిండియా ప్రాబబుల్స్ లో వైభవ్ సూర్యవంశీ పేరు (ANI Pic Service)

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోశాడు. 16 మ్యాచ్‌లలోనే 776 పరుగులు సాధించాడు. దీంతో అతణ్ని టీమిండియాాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కుర్రాడి ప్రదర్శనను సెలక్టర్లు సీరియస్‌గా పరిగణించి, ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లో చోటు కల్పించారు.

రికార్డు దక్కేనా?

2026 ఆసియా క్రీడల కోసం ప్రాబబుల్స్ కు ఎంపికైన వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర నెలకొల్పే అవకాశముంది. ఆ ఆసియా క్రీడల్లో వైభవ్ కచ్చితంగా డెబ్యూ చేస్తాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా తరపున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్సు ఆటగాడిగా సచిన్ రికార్డును వైభవ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. సచిన్ 16 ఏళ్లకు డెబ్యూ చేశాడు.

వీళ్లు దూరం

మరోవైపు, టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లను ఈ ఏషియన్ గేమ్స్ టోర్నీకి దూరం పెట్టడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా ఈ క్రీడలు జరగనున్నాయి. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే భారత ఒలింపిక్ సంఘానికి (IOA) ఆటగాళ్ల జాబితాను సమర్పించింది.

అదే కారణం

వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ జట్టును నడిపించే అవకాశం ఉన్నందున, అతడిని ఏషియన్ గేమ్స్‌కు ఎంపిక చేయలేదు. ఇక సూర్యకుమార్ యాదవ్ విషయానికి వస్తే, 2028 టీ20 ప్రపంచకప్, లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ ప్రణాళికల్లో అతడు లేడని సమాచారం. "రాబోయే మెగా ఈవెంట్ల రేసులో సూర్యకుమార్ లేకపోవడం వల్లే అతడిని ఏషియన్ గేమ్స్ లాంగ్‌లిస్ట్ లోకి తీసుకోలేదు" అని పిటిఐ (PTI) వార్తా సంస్థ స్పష్టం చేసింది.

స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరు ఈ ప్రాబబుల్స్ జాబితాలో ఉన్నప్పటికీ, అతడు జపాన్ వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వచ్చే ఏడాది సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వేదికలుగా జరిగే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బుమ్రా వన్డే ఫార్మాట్‌కే తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నాడు.

కెప్టెన్సీ రేసు

సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఏషియన్ గేమ్స్ జట్టుకు శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ లేదా తెలుగు కుర్రాడు తిలక్ వర్మలలో ఒకరు నాయకత్వం వహించే అవకాశం ఉంది.

ఈ ఏడాది న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా గాయపడిన హర్షిత్ రాణా ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటున్నాడు. దీంతో అతడితో పాటు అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలను సెలక్టర్లు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో చేర్చారు.

భారత ప్రాబబుల్స్ లిస్ట్

యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, ఆయుష్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షాబాజ్ అహ్మద్, శివం దూబే, విప్రాజ్ నిగమ్, హర్షిత్ రాణా, యశ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: ఏషియన్ గేమ్స్ 2026 ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయి?

జవాబు: ఏషియన్ గేమ్స్ 2026 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా జరుగుతాయి. ఇందులో పురుషుల క్రికెట్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 3 వరకు సాగుతాయి.

ప్రశ్న: సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్‌లను ఎందుకు ఎంపిక చేయలేదు?

జవాబు: వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండటంతో అతడిని పక్కన పెట్టారు. అలాగే భవిష్యత్తు ఒలింపిక్స్ ప్రణాళికల్లో సూర్యకుమార్ లేకపోవడంతో అతడిని ఈ జాబితా నుండి మినహాయించారు.

ప్రశ్న: వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకత ఏమిటి?

జవాబు: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్‌లో 16 మ్యాచ్‌లలో ఏకంగా 776 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ అద్భుత ప్రదర్శనతోనే అతడు టీమిండియా ప్రాబబుల్స్ జాబితాలో చోటు సంపాదించాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe