భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చిల్డ్రన్స్ డే సందర్భంగా దోహాలో జరిగిన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)పై టీమ్ ఇండియా-ఎ తరఫున మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. కేవలం 14 ఏళ్ల వయసున్న వైభవ్.. తన కెరీర్‌లో తొలిసారిగా అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ఆడుతూ కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు.
సూర్యవంశీ బీస్ట్ మోడ్ ఆన్

ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగి మెరుపులు మెరిపించిన వైభవ్ సూర్యవంశీ గుర్తున్నాడా? అతడు ఇప్పుడు రైజింగ్ స్టార్స్ ఏషియా కప్ లో మరోసారి చెలరేగిపోయాడు. టీ20ల్లో రెండో సెంచరీ, అది కూడా కేవలం 32 బంతుల్లోనే సాధించాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ పై 35 బంతుల్లో కాగా.. ఆ రికార్డును తిరగ రాశాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా-ఎ.. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య రెండో ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. కానీ అది సూర్యవంశీని ఏమాత్రం ప్రభావితం చేయలేదు. బౌండరీలతో విరుచుకుపడి కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఆ తర్వాత సెంచరీ పూర్తి చేయడానికి అతనికి మరో 15 బంతులు మాత్రమే పట్టింది. ముఖ్యంగా అతను ముహమ్మద్ జవాదుల్లా, హర్షిత్ కౌశిక్‌లను టార్గెట్ చేసి, రెండు ఓవర్లలో ఏకంగా ఏడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను యూఏఈ నుంచి దూరం చేశాడు.
రిషబ్ పంత్ రికార్డు సమం
వైభవ్ సూర్యవంశీ 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్లతో సహా 144 పరుగులు చేసి ముహమ్మద్ ఫరాజుద్దీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ క్రమంలో అతను రిషబ్ పంత్‌తో కలిసి ఇండియా తరఫున రెండో అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ రికార్డును (32 బంతుల్లో) సమం చేశాడు. పంత్ 2018లో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో హిమాచల్ ప్రదేశ్‌పై 32 బంతుల్లో సెంచరీ సాధించాడు.
ఇక ఇండియాలో అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ రికార్డు ఉర్విల్ పటేల్, అభిషేక్ శర్మ పేరిట ఉంది. వీరు 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశారు. ప్రపంచ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. అతడు 2024లో సైప్రస్‌పై 27 బంతుల్లోనే సెంచరీ బాదాడు.
{{/usCountry}}ఇక ఇండియాలో అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ రికార్డు ఉర్విల్ పటేల్, అభిషేక్ శర్మ పేరిట ఉంది. వీరు 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశారు. ప్రపంచ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. అతడు 2024లో సైప్రస్‌పై 27 బంతుల్లోనే సెంచరీ బాదాడు.
{{/usCountry}}గతంలో సూర్యవంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ చేసి.. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
ఇండియా-ఎ భారీ స్కోరు
సూర్యవంశీ ఔటైన తర్వాత కెప్టెన్ జితేష్ శర్మ అజేయంగా 83 పరుగులు చేసి తన జట్టును 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోరుకు చేర్చాడు. నమన్ ధీర్ కూడా 34 పరుగులు చేశాడు. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జితేష్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.