విజయ్ హజారే ట్రోఫీ రౌండ్ 1లో రికార్డుల మోత.. కోహ్లి, రోహిత్ సెంచరీలతోపాటు బ్రేకయిన మొత్తం రికార్డుల జాబితా ఇదీ

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతోపాటు విజయ్ హజారే ట్రోఫీ తొలి రౌండ్ లో ఎన్నో రికార్డులు బ్రేకయ్యాయి. ఈ ఇద్దరు లెజెండ్స్ మధ్య వైభవ్ సూర్యవంశీలాంటి యంగ్‌స్టర్ కూడా ఉన్నాడు. మరి ఇప్పటి వరకూ ఈ ట్రోఫీలో నమోదైన రికార్డుల జాబితాను ఇక్కడ చూడండి.

Published on: Dec 25, 2025, 17:15:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) బుధవారం (డిసెంబర్ 24) మొదలైన విషయం తెలుసు కదా. అయితే తొలిరోజే ఇది చరిత్ర సృష్టించింది. అసలు ఇది క్రికెట్ మ్యాచా లేక వీడియో గేమా అన్నట్టుగా స్కోర్లు నమోదయ్యాయి. బీహార్ టీమ్ 574 పరుగులు చేసి వరల్డ్ రికార్డు సృష్టించగా.. కర్ణాటక 413 రన్స్ ఛేజ్ చేసి షాక్ ఇచ్చింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా తమ బ్యాట్లకు పనిచెప్పారు.

విజయ్ హజారే ట్రోఫీ రౌండ్ 1లో రికార్డుల మోత.. కోహ్లి, రోహిత్ సెంచరీలతోపాటు బ్రేకయిన మొత్తం రికార్డుల జాబితా ఇదీ (PTI)
విజయ్ హజారే ట్రోఫీ రౌండ్ 1లో రికార్డుల మోత.. కోహ్లి, రోహిత్ సెంచరీలతోపాటు బ్రేకయిన మొత్తం రికార్డుల జాబితా ఇదీ (PTI)

విజయ్ హజారే ట్రోఫీ రికార్డులు ఇలా

మామూలుగా టోర్నమెంట్లు నెమ్మదిగా మొదలవుతాయి. కానీ ఈసారి విజయ్ హజారే ట్రోఫీ మాత్రం బాంబు పేలినట్టు స్టార్ట్ అయ్యింది. రౌండ్-1లో నమోదైన రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

బీహార్ బీభత్సం

అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బీహార్ టీమ్ బ్యాటింగ్ కాదు, విధ్వంసం సృష్టించింది. 50 ఓవర్లలో ఏకంగా 6 వికెట్లకు 574 పరుగులు చేసింది. మెన్స్ లిస్ట్-A క్రికెట్ చరిత్రలో (ప్రపంచవ్యాప్తంగా) ఇదే అత్యధిక స్కోరు. పాత రికార్డు (506) గల్లంతైంది. ఇక ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు కొట్టడం విజయ్ హజారే చరిత్రలో ఇదే తొలిసారి.

14 ఏళ్ల కుర్రాడి ఊచకోత

బీహార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. కేవలం 59 బంతుల్లోనే 150 పరుగులు చేసి ఏబీ డివిలియర్స్ రికార్డును బ్రేక్ చేశాడు. 14 ఏళ్ళ 272 రోజుల వయసులో సెంచరీ కొట్టి.. లిస్ట్-A క్రికెట్‌లో అతి పిన్న వయసులో శతకం బాదిన ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు.

కెప్టెన్ ఇన్నింగ్స్, బౌలర్ కష్టాలు

బీహార్ కెప్టెన్ సకిబుల్ గని కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. భారత్ తరఫున ఇదే అత్యంత వేగవంతమైన లిస్ట్-A సెంచరీ. ఇక ఈ మ్యాచ్ లో మిబోమ్ మోసు అనే బౌలర్ 9 ఓవర్లలో ఏకంగా 116 పరుగులు సమర్పించుకున్నాడు. ఇది ఒక చెత్త రికార్డు.

కర్ణాటక మాస్ ఛేజింగ్

అక్కడ బీహార్ కొడితే.. ఇక్కడ కర్ణాటక కూడా తగ్గేదే లే అన్నట్టు ఆడింది. ప్రత్యర్థి నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ.. 413 పరుగులు చేసి విజయం సాధించింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇదే హైయెస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజ్.

కోహ్లీ, రోహిత్ రికార్డులు

అత్యంత వేగంగా 16,000 లిస్ట్-A పరుగులు (330 ఇన్నింగ్స్‌ల్లో) పూర్తి చేసుకున్న ప్లేయర్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. ఇక అటు రోహిత్ శర్మ లిస్ట్-A క్రికెట్‌లో 9వ సారి 150+ స్కోరు చేసి డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేశాడు. అలాగే 38 ఏళ్ల వయసులో సెంచరీ కొట్టి, ఈ టోర్నీలో సెంచరీ చేసిన రెండో పెద్ద వయసు ప్లేయర్‌గా నిలిచాడు.

మరికొన్ని హైలైట్స్

22 సెంచరీలు: టోర్నీ తొలిరోజే మొత్తం 22 సెంచరీలు నమోదయ్యాయి.

డబుల్ సెంచరీ: ఒడిశా ప్లేయర్ స్వస్తిక్ షామల్ 212 పరుగులు చేశాడు.

ఫీల్డింగ్ రికార్డ్: విఘ్నేష్ పుతూర్ అనే ఫీల్డర్ ఒకే మ్యాచ్‌లో 6 క్యాచులు పట్టి ఔరా అనిపించాడు.

మొత్తానికి డిసెంబర్ 24న జరిగిన మ్యాచ్‌లు డొమెస్టిక్ క్రికెట్ రేంజ్ దాటిపోయి.. వరల్డ్ క్రికెట్‌నే ఆకర్షించాయి. మరి ఈ ట్రోఫీలో ఇంకెన్ని రికార్డులు బ్రేకవుతాయో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More