...
...
Next Story

అందరిదీ ఒకే ఒక్క ప్రశ్న.. దళపతి విజయ్ ఎవరితో చేతులు కలుపుతారు?

అధికారిక గణాంకాల ప్రకారం తమిళనాడులో టీవీకే విజయ్ మెజారిటీ మార్కుకు మరో 8 సీట్ల దూరంలో ఉన్నారు. ఒకవేళ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేకపోతే విజయ్ ఎవరి మద్దతు తీసుకుంటారు? ఇదే ఇప్పుడు అందరి ప్రశ్న.

Published on: May 04, 2026 02:31 PM IST
Advertisement

మధ్యాహ్నం 2:11 గంటల సమయానికి అందిన ట్రెండ్స్ ప్రకారం, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ఏకంగా 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. ఒకవేళ విజయ్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితిలో ఉంటే ఎవరితో పొత్తు పెట్టుకుంటారు?

1. ‘సొంతంగానే పీఠం’ - టీవీకే ధీమా

టీవీకే అధినేత విజయ్ పోస్టర్ తో పార్టీ కార్యకర్తలు (PTI)
టీవీకే అధినేత విజయ్ పోస్టర్ తో పార్టీ కార్యకర్తలు (PTI)

టీవీకే అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ తాజా ప్రకటన ప్రకారం.. "టీవీకే తన సొంత బలం మీదనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది." డీఎంకే ఇన్నాళ్లూ ఒక చీకటి గదిలో పరుగెడుతోందని, ఇప్పుడు వారికి వాస్తవం తెలిసి వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుతానికి విజయ్ పార్టీ ఎవరి మద్దతు కోరాల్సిన అవసరం లేనంత మెజారిటీని సాధిస్తోందని చెప్పారు.

2. ‘నో కాంప్రమైజ్’ - విజయ్ సిద్ధాంతం

రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి విజయ్ ఒకే మాటపై నిలబడ్డారు. ఇది కేవలం ఎన్నికల పోరాటం కాదు, ఒక "ప్రజాస్వామ్య యుద్ధం" అని ఆయన అభివర్ణించారు.

తమ రాజకీయ సిద్ధాంతాలను ఎవరి కోసం, దేని కోసం రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేల మార్క్ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగానే టీవీకే పుట్టుకొచ్చింది కాబట్టి, ఆ పార్టీలతో చేతులు కలిపితే పార్టీ ఉనికికే ప్రమాదమని విజయ్ భావిస్తున్నారు.

3. బీజేపీ ఒత్తిడిని సైతం ఎదిరించి..

ఎన్నికలకు ముందు టీవీకేను తమ కూటమిలోకి లాగాలని బీజేపీ ప్రయత్నించిందనే వార్తలు వచ్చాయి. కానీ, విజయ్ ఏమాత్రం తలొగ్గకుండా ఫిబ్రవరిలోనే తన వైఖరిని స్పష్టం చేశారు. తాము బీజేపీతో సహా ఏ ఇతర ప్రధాన పార్టీలతోనూ పొత్తు పెట్టుకోమని ఖరాఖండిగా చెప్పారు.

ఒకవేళ మెజారిటీ తగ్గితే పరిస్థితి ఏమిటి?

పార్టీప్రస్తుత ఆధిక్యంమెజారిటీకి కావాల్సినవిపొత్తు అవకాశం
TVK (విజయ్)1108వేచి చూడాలి
AIADMK5464టీవీకే తిరస్కరించింది
DMK3484ప్రధాన ప్రత్యర్థి

విజయ్ ప్రచార శైలి, ఆయన పార్టీ నాయకుల మాటలను బట్టి చూస్తే, టీవీకే "కింగ్ మేకర్" పాత్రను కాకుండా నేరుగా "కింగ్" స్థానాన్నే కోరుకుంటోంది. ఒకవేళ నంబర్లు అటు ఇటు అయినా, దశాబ్దాలుగా తాము వ్యతిరేకిస్తున్న ద్రవిడ పార్టీలతో విజయ్ చేతులు కలిపే అవకాశం దాదాపు శూన్యం.

డీఎంకే కూటమి లేదా అన్నా డీఎంకే కూటమిలోని చిన్న పార్టీలు విడిగా విజయ్ కు మద్దతు ఇస్తే తీసుకునే అవకాశాలు లేకపోలేదు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe