...
...
Next Story

Stock market holiday : ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు అలర్ట్- ఈరోజు స్టాక్​ మార్కెట్లకు సెలవు..

విజయదశమి పండుగను పురస్కరించుకుని బాంబే స్టాక్ ఎక్స్​ఛేంజ్ (బీఎస్​ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ)లకు నేడు సెలవు ప్రకటించారు. ఎంసీఎక్స్ ఈవినింగ్ సెషన్ వేళలు, ఈ ఏడాది మిగిలిన స్టాక్ మార్కెట్ సెలవుల వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Oct 20, 2026, 06:45:40 IST
Advertisement

చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి పండుగ సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్లకు నేడు (మంగళవారం, అక్టోబర్ 20, 2026) సెలవు!. బాంబే స్టాక్ ఎక్స్​ఛేంజ్ (బీఎస్​ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ) తమ అధికారిక ట్రేడింగ్ క్యాలెండర్‌లో ఈ పండుగ రోజును సెలవు దినంగా చేర్చాయి.

నేడు స్టాక్​ మార్కెట్లకు సెలవు- ఏయే విభాగాలు బంద్?

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

దసరా పడుంగ నేపథ్యంలో నేడు ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ మార్కెట్ విభాగాల్లో ఎలాంటి లావాదేవీలు జరగవు. సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (ఎస్​ఎల్​బీ) సెగ్మెంట్‌ను కూడా నిలిపివేశారు.

మల్టీ కమోడిటీ ఎక్స్​ఛేంజ్ (ఎంసీఎక్స్) విషయానికి వస్తే, ఉదయం సెషన్‌లో ట్రేడింగ్ నిలిపివేసినప్పటికీ, సాయంత్రం సెషన్‌లో యథావిధిగా లావాదేవీలు కొనసాగుతాయి. దీనితో కమోడిటీ ట్రేడర్లకు పండుగ రోజు సాయంత్రం వేళ కూడా తమ పొజిషన్లపై ట్రేడ్ చేసుకునే అవకాశం లభిస్తుంది.

ఇక మంగళవారం సెలవు అనంతరం బుధవారం (అక్టోబర్ 21) ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లలో సాధారణ ట్రేడింగ్ పునఃప్రారంభమవుతుంది.

2026లో రాబోయే ఇతర మార్కెట్ సెలవులు..

ఎన్ఎస్ఈ, బీఎస్ఈ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మిగిలిన రోజుల్లో మరో మూడు పూర్తిస్థాయి సెలవులు ఉన్నాయి:

  • దీపావళి (బలిపాడ్యమి): నవంబర్ 10, 2026 (మంగళవారం)
  • గురు నానక్ జయంతి: నవంబర్ 24, 2026 (మంగళవారం)
  • క్రిస్మస్: డిసెంబర్ 25, 2026 (శుక్రవారం)

తేదీసెలవు
అక్టోబర్ 20దసరా
నవంబర్ 10దీపావళి
నవంబర్ 24 గురు నానక్ దేవ్ జయంతి
డిసెంబర్ 25 క్రిస్మస్

ముహురత్ ట్రేడింగ్ 2026 అప్డేట్..

మంగళవారం సెలవుకు ముందు రోజు (సోమవారం) భారతీయ షేర్ మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయినప్పటికీ, ఆ తర్వాత సూచీలు వేగంగా కోలుకున్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో కొనుగోళ్లు సానుకూల విషయం. అయితే యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ల నష్టాలు రికవరీ వేగాన్ని కొంత మేర నియంత్రించాయి.

సోమవారం ఉదయం ఒకానొక దశలో బీఎస్ఈ సెన్సెక్స్ 470.50 పాయింట్లు పడిపోయి 74,318 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 147.10 పాయింట్లు క్షీణించి 22,999.05 వద్దకు చేరాయి. ఆ తర్వాత ట్రేడర్లు దిగువ స్థాయిల వద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో ముగింపు సమయానికి సెన్సెక్స్ కేవలం 46.49 పాయింట్ల స్వల్ప నష్టంతో 74,682.78 వద్ద, నిఫ్టీ 14.55 పాయింట్ల నష్టంతో 23,131.60 వద్ద స్థిరపడ్డాయి.

ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,148.64 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. ఇక డీఐఐలు రూ. 3,201.19 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks