...
...
Next Story

Cars under 10 lakhs : వినాయక చవితికి కొత్త కారు కొంటున్నారా? రూ. 10లక్షల ధరలోపు బెస్ట్ మోడల్స్..

Vinayaka chavithi 2026 cars to buy : ఈ వినాయక చవితికి మీరు కొత్త కారు కొనాలని చూస్తుంటే, ఇది మీకోసమే! రూ. 10లక్షల బడ్జెట్​లో అందుబాటులో ఉన్న బెస్ట్ హ్యాచ్​బ్యాక్​లు, ఎస్​యూవీల లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..

Published on: Sep 12, 2026, 06:46:03 IST
Advertisement

సొంత కారు కొనుగోలు చేయడం అనేది ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కల. తెలుగు రాష్ట్రాల్లో పండుగల సీజన్లు, శుభకార్యాల వేళ కొత్త కారు కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. మరి ఈ వినాయక చవితికి మీరు కూడా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? రూ. 10లక్షల బడ్జెట్​లో కుటుంబ అవసరాలకు సరిపోయే మంచి ఫ్యామిలీ మోడల్​ని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! మైలేజ్, భద్రత, రీసేల్ విలువ, రోజువారీ నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని భారత మార్కెట్లో రూ. 10లక్షల బడ్జెట్​లోపు ఉన్న కొన్ని బెస్ట్, ఫ్యామిలీ కార్ల వివరాలను ఇక్కడ చూసేయండి..

మారుతీ సుజుకీ హ్యాచ్‌బ్యాక్‌లు: మైలేజ్​లో తోపు!

2026 టాటా పంచ్​ ఎస్​యూవీ..
2026 టాటా పంచ్​ ఎస్​యూవీ..

మారుతీ సుజుకీ బలెనో : మారుతీ సుజుకీ నుంచి మార్కెట్​లో ఉన్న ప్రీమియం హ్యాచ్​బ్యాక్​ కారు ఈ బలెనో. ఇటీవలే దీని ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని సంస్థ అధికారికంగా లాంచ్ చేసింది. ఈ 2026 బలెనో ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 6.09లక్షలుగా ఉంది. పాత మోడల్​ ధర రూ. 5.99లక్షలుగా ఉండేది. బలెనో సీఎన్జీ మోడల్​ ఏకంగా 33.61 కేజీ/కిలోమీటర్ మైలేజ్​ని ఇస్తుంది.

రూ. 9.99 లక్షల ధర వరకు లభించే ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, తన విభాగంలోనే అత్యంత విశాలమైన కేబిన్, అధునాతన ఫీచర్లతో లభిస్తోంది. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు, సిటీ డ్రైవింగ్‌కు తక్కువ ఇంధన ఖర్చుతో నడిచే కారు కోసం చూసేవారికి ఇది సరైన ఎంపిక.

మారుతీ సుజుకీ స్విఫ్ట్ : రూ. 5.84 లక్షల నుంచి రూ. 8.89 లక్షల ధరలో లభిస్తున్న స్విఫ్ట్, దశాబ్ద కాలంగా భారతీయ రోడ్లపై విజయవంతంగా నడుస్తోంది. స్పోర్టీ లుక్, నగర ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవ్ చేసే వెసులుబాటు, అద్భుతమైన మైలేజ్ దీని ప్రత్యేకతలు.

మారుతీ సుజుకీ డిజైర్ : ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్ కారు ఈ మారుతీ సుజుకీ డిజైర్. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగుతున్న డిజైర్, లీటరుకు గరిష్టంగా 33.7 కి.మీ వరకు ఇంధన సమర్థతను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. తక్కువ నిర్వహణ ఖర్చులతో ఎక్కువ మైలేజ్ కోరుకునే కుటుంబాలకు ఇది మొదటి ప్రాధాన్యత. దీని ఎక్స్​షోరూం ధర రూ. 6.30లక్షల నుంచి రూ. 9.41లక్షల వరకు ఉంటుంది.

టాటా, హ్యుందాయ్ మైక్రో ఎస్‌యూవీలు: భద్రతలో తోపు!

టాటా ఆల్ట్రోజ్/ టాటా నెక్సాన్ : టాటా ఆల్ట్రోజ్ ప్రారంభ ఎక్స్​షోరూం రూ. 6.3 లక్షలు. ఇక నెక్సాన్ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 7.3లక్షలు. వీటి టాప్ ఎండ్ మోడల్స్​ ధర రూ. 10లక్షలు దాటిపోతుంద కానీ బేస్, మిడ్ వేరియంట్లు రూ. 10 లక్షలలోపే లభిస్తాయి. దృఢమైన బిల్డ్ క్వాలిటీ, 5-స్టార్ భద్రతా ప్రమాణాలతో ప్రయాణికులకు పూర్తి రక్షణ ఇస్తాయి.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ : రూ. 5.8 లక్షల నుంచి రూ. 9.61 లక్షల శ్రేణిలో వస్తున్న ఎక్స్‌టర్ ఎస్​యూవీ.. ఆధునిక టెక్నాలజీతో కూడిన ఫీచర్లతో లభిస్తోంది. హయ్యర్ వేరియంట్లలో ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు కల్పిస్తూ సురక్షిత ప్రయాణాన్ని అందిస్తోంది.

కాంపాక్ట్ ఎస్‌యూవీలు..

మారుతీ సుజుకీ బ్రెజ్జా : బేస్, మిడ్-లెవల్ ట్రిమ్‌లు రూ. 7.3 లక్షల నుంచి రూ. 8.34 లక్షల ధరల వద్ద అందుబాటులో ఉన్నాయి. 1.5 లీటర్ల నమ్మకమైన పెట్రోల్ ఇంజిన్, లాంగ్-టర్మ్ డ్యూరబిలిటీ కోరుకునే వారికి బ్రెజ్జా బెస్ట్ ఆప్షన్.

నిస్సాన్ మాగ్నైట్ : రూ. 5.68 లక్షల నుంచి ప్రారంభమయ్యే మాగ్నైట్ (రూ. 10 లక్షలలోపు మిడ్ వేరియంట్లు లభిస్తాయి), తక్కువ ధరకే శక్తివంతమైన టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను అందిస్తూ 'వాల్యూ ఫర్ మనీ' కారుగా పేరు తెచ్చుకుంది.

రెనాల్ట్ ట్రైబర్ : రూ. 5.81 లక్షల నుంచి రూ. 8.69 లక్షల బడ్జెట్‌లో లభించే ఈ రెనాల్ట్ ట్రైబర్.. బడ్జెట్​ ఫ్రెండ్లీ ఫ్యామిలీ ఎంపీవీగా గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణించే వీలున్న 7-సీటర్ కారు ఇది. ప్యాసింజర్ సీటింగ్‌ను మన అవసరానికి తగినట్లు మార్చుకునే వెసులుబాటు దీనిలోని ప్లస్ పాయింట్!

మీరు మీ సమీపంలోని డీలర్​షిప్​ని సందర్శిస్తే, ఆ సమయంలో లభిస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి తెలుసుకోవచ్చు. ఇది కారు ధరను మరింత తగ్గిస్తుంది. మీ డబ్బు మరింత ఆదా అవుతుంది!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks