Electric car : 500 కి.మీ రేంజ్‌తో విన్‌ఫాస్ట్ వీఎఫ్ 8- ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇండియా లాంచ్ ఫిక్స్?
Vinfast VF 8 : తన పాప్యులర్ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వీఎఫ్ 8ని విన్‌ఫాస్ట్ సంస్థ ఇటీవలే అప్డేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ 2026 విన్‌ఫాస్ట్ వీఫ్ 8 డిజైన్ ఇండియాలో పేటెంట్ అయ్యింది. అంటే, ఇది మన దేశంలో కూడా లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఈవీ ఫీచర్లు, రేంజ్ వివరాలు..
Vinfast VF 8 electric SUV : భారతదేశపు ఎలక్ట్రిక్ వాహన రంగంలో సంచలనం సృష్టిస్తున్న వియత్నామీస్ కార్ల తయారీ సంస్థ ‘విన్‌ఫాస్ట్’.. దేశీయంగా తన పట్టును బలపరుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, తన సరికొత్త సెకండ్ జనరేషన్ ‘విన్‌ఫాస్ట్ వీఎఫ్ 8’ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డిజైన్‌ను భారత్‌లో అధికారికంగా పేటెంట్ చేసింది. గ్లోబల్ మార్కెట్లో విడుదలైన కొద్దిరోజులకే ఈ మోడల్‌ను ఇక్కడ పేటెంట్ చేయడం చూస్తుంటే.. కంపెనీ దీనిని భారతలో తన ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా (వీఎఫ్ 7 కంటే పైన) లాంచ్ చేసేందుకు పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది.

విన్‌ఫాస్ట్ పోర్ట్‌ఫోలియోలోనే సరికొత్త రెండవొ తరం డిజైన్ లాంగ్వేజ్‌తో వస్తున్న మొదటి మోడల్ ఈ 2026 వీఎఫ్ 8. పాత మోడల్‌తో పోలిస్తే దీని ఎక్స్‌టీరియర్ లుక్, ఇంటీరియర్ టెక్నాలజీలో కంపెనీ విప్లవాత్మక మార్పులు చేసింది.
ఈ అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన డైమెన్షన్స్, ఇంజన్ పవర్, ఫీచర్ల వివరాలు ఇక్కడ చూద్దాంము..
1. విన్‌ఫాస్ట్ వీఎఫ్ 8- స్పోర్టీ లుక్, సరికొత్త డైమెన్షన్స్..
కొత్త విన్‌ఫాస్ట్ వీఎఫ్ 8ని మునుపటి కంటే మరింత ఆధునికమైన, స్పోర్టీ అప్పీరెన్స్‌తో డిజైన్ చేసింది ఆటోమొబైల్ సంస్థ.
ఎక్స్‌టీరియర్ డిజైన్: ముందు భాగంలో వింగ్-షేప్ (రెక్కల ఆకారం) కలిగిన ఫుల్-విడ్త్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, మధ్యలో మెరిసే విన్‌ఫాస్ట్ లోగో, పెద్ద గ్లోస్-బ్లాక్ గ్రిల్ దీనికి బోల్డ్ లుక్‌ను ఇస్తాయి. వెనుక వైపు ఎల్‌ఈడీ టెయిల్‌లైట్లను కనెక్ట్ చేస్తూ బ్లాక్ అప్లిక్యూను అందించారు. 19-ఇంచ్ ఏరో వీల్స్, సెమీ-ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ దీని అదనపు ఆకర్షణ.
కారు కొలతలు: ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 4,701 ఎంఎం పొడవు, 1,872 ఎంఎం వెడల్పు, 1,670 ఎంఎం ఎత్తు కలిగి ఉంది. దీని వీల్‌బేస్ 2,840 ఎంఎం కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 170 ఎంఎంగా ఉంది. పాత మోడల్‌తో పోలిస్తే దీని పొడవు, వెడల్పు కొద్దిగా తగ్గించినప్పటికీ.. ఎత్తును 3 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్‌ను 8 ఎంఎం మేర పెంచారు.
2. విన్‌ఫాస్ట్ వీఎఫ్ 8- రీడిజైన్డ్ ఇంటీరియర్, లగ్జరీ ఫీచర్లు..
2026 విన్‌ఫాస్ట్ వీఎఫ్ 8 ఈవీ కేబిన్‌ని ప్రీమియం లుక్‌తో పూర్తిగా రీడిజైన్ చేశారు.
ఇన్ఫోటైన్‌మెంట్: డ్యాష్‌బోర్డ్ మధ్యలో సరికొత్త 12.9-ఇంచ్ భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు.
కీలక ఫీచర్లు: డ్రైవర్ కోసం సరికొత్త టీఎఫ్టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రీడిజైన్ చేసిన స్టీరింగ్ వీల్ అందించారు. అలాగే డ్రైవింగ్ సేఫ్టీ కోసం అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (లెవల్ 2 అడాస్), 360-డిగ్రీ కెమెరాలు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన డ్రైవర్ సీటు వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
3. విన్‌ఫాస్ట్ వీఎఫ్ 8- చిన్న బ్యాటరీ.. ఎక్కువ పవర్..
ఈ సెకండ్ జనరేషన్ మోడల్‌లో విన్‌ఫాస్ట్ బ్యాటరీ సైజును తగ్గించినప్పటికీ మోటార్ పవర్‌ను పెంచడం విశేషం.
బ్యాటరీ, రేంజ్: ఇందులో 60.13 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 500 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. (పాత మోడల్‌లో 87.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, 562 కిమీ రేంజ్ ఉండేది).
పర్ఫార్మెన్స్: ఈ కొత్త వెర్షన్‌లో ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) ఆప్షన్ లేదు. కేవలం ఫ్రంట్-వీల్ డ్రైవ్ (ఎఫ్‌డబ్ల్యూడీ) సెటప్‌తో మాత్రమే వస్తుంది. అయితే దీని మోటార్ పాతదాని కంటే 18 బీహెచ్పీ అదనపు పవర్‌తో ఏకంగా 228 బీహెచ్పీ శక్తిని, 330 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల కారు పికప్, వేగం మునుపటి కంటే చాలా స్మూత్‌గా ఉంటుంది.
అయితే, పేటెంట్ చేసినంత మాత్రాన ఈ మోడల్ ఇండియాలోకి వస్తుందని కచ్చితంగా చెప్పడానికి లేదు. అయితే, ఎక్స్‌ప్యాన్షన్ కోసం దూకుడుగా ఉన్న విన్‌ఫాస్ట్.. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మార్కెట్లోకి వచ్చాక హ్యుందాయ్ ఐయోనిక్ 5, కియా ఈవీ6 వంటి లగ్జరీ ఈవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


